top of page

సంక్రాంతి సీజన్.. సక్సెస్‌లోనే డ్యామేజ్ జరిగిందా?

  • Guest Writer
  • 13 hours ago
  • 2 min read

సంక్రాంతి.. టాలీవుడ్ కు అతిపెద్ద మూవీ సీజన్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కచ్చితంగా ఆ టైమ్ లో ఆడియన్స్ ఫ్యామిలీలతో థియేటర్స్‌కు తరలివస్తారు. దాదాపు అన్ని సినిమాలు కంప్లీట్ చేయాలనుకుంటారు. అయితే ఈసారి ఐదు స్ట్రయిట్ తెలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

రాజా సాబ్‌తో సంక్రాంతి సందడి మొదలు కాగా.. ఆ తర్వాత వరుసగా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. అయితే ఐదింటిలో మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సంక్రాంతి సీజన్ కు తగ్గట్టు సినిమాలుగా నిలిచి.. థియేటర్స్ కు పెద్ద ఎత్తున సినీ ప్రియులను రప్పించాయి.

ప్రభాస్ రాజా సాబ్ తోపాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. అదే సమయంలో మూడు సినిమాలకు హిట్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్ల విషయంలో డ్యామేజ్ జరిగినట్లు ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి విండోలో మూడు- నాలుగు సినిమాలకు స్పేస్ ఉంటుంది. కానీ ఈసారి ఐదు రిలీజ్ అయ్యాయి.

దీంతో ఆడియన్స్.. ఆయా సినిమాలకు డివైడ్ అయిపోయారు. లేకుండా మూడు హిట్ చిత్రాల వసూళ్లు మరో రేంజ్ లో ఉండేవని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. దానికి తోడు థియేటర్స్ విషయంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు రావడంతో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలకు పెద్ద దెబ్బ ఎదురైంది. హిట్ టాక్ వచ్చినా.. వసూళ్లపై మాత్రం ఎఫెక్ట్ పడింది.

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ కలెక్షన్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది రాలేదు. నవీన్, శర్వా చిత్రాల కన్నా ముందే థియేటర్స్ లోకి రావడం, అప్పటికే వచ్చిన రాజా సాబ్ కు మిక్స్ డ్ టాక్ రావడం.. ఆ సినిమాకు కలిసి వచ్చింది. అనేక చోట్ల స్పెషల్ షోలు కూడా వేయడంతో మూవీకి పెద్ద ఎత్తున వసూళ్లు వచ్చాయి. కానీ పోటీ తక్కువ ఉంటే మాత్రం ఇంకా పెరిగేవని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఏదేమైనా ఇప్పుడు ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల.. సక్సెస్ దక్కినా వసూళ్ల విషయంలో డ్యామేజ్ జరిగిపోయింది. అందుకే ఒకే సీజన్లో అన్ని చిత్రాలు రిలీజ్ చేయడం కన్నా.. కాస్త చూసుకుని విడుదల చేయడం బెటర్ అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. అదేం కాకుండా.. సంక్రాంతినే క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలా వసూళ్ళ పరంగా డ్యామేజ్ జరగడం పక్కాలా ఉంది. మరేం ఫ్యూచర్ లో మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.

- తుపాకి.కామ్ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page