top of page

సొంత గడ్డ మీదే చితక్కొట్టి..

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 2 days ago
  • 1 min read

ఇప్పుడు అందరూ టి-20 వరల్డ్ కప్ కోసం.. సూపర్`8.. సెమీ ఫైనల్స్‌లో ఇండియా ఆడుతున్న మ్యాచ్‌ల కోసమే మాట్లాడుకుంటున్నారు. కానీ డొమెస్టిక్ క్రికెట్‌లో ఓ చిన్న అనామక జట్టు జమ్మూ కాశ్మీర్ సాధించిన అద్భుత విజయాన్ని ఎవరూ ఎంజాయ్ చేయడంలేదు. నిజంగా 67 ఏళ్ల రంజీ చరిత్రలో ఇదో సంచలనం!

నిజానికి మిగతా రాష్ట్రాలు వేరు.. జమ్మూ కాశ్మీరు క్రికెట్ పరిస్థితి వేరు! అక్కడ ఇప్పటికీ సరైన క్రీడా వసతులు లేవు.. ప్రాక్టీస్ చెయ్యడానికి సరైన గ్రౌండ్స్ లేవు.. అసలు వాళ్ల దగ్గర ఉన్నది రెండే రెండు టర్ఫ్ పిచ్‌లు! ఇక అక్కడి వాతావారణం.. ప్రత్యేక రాజకీయ పరిస్థితులు.. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ సంగతి అందరికి తెలిసిందే! పైగా నిత్యం తమ జాతీయతపై అనుమానాలు వివక్షను మోస్తూ తిరగాల్సిందే! ఇలాంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి క్రికెట్ ఆడి తీరాలన్న కసే వాళ్లని నిజమైన చాంపియన్స్‌గా నిలిపింది! పైగా ఇదేదో ఒక మ్యాచ్ లోనో.. టి-20ల్లో లాగా ఒకే ఒక్క మెరుపు ఇన్నింగ్స్‌తోనో దక్కిన గాలివాటం విజయం కాదు! వాళ్లు బలమైన ఢిల్లీని ఢిల్లీలోనే ఓడించారు! మధ్యప్రదేశ్ లాంటి పెద్ద జట్టును వాళ్ల రాష్ట్రంలోనే ఓడించారు! అస్సలు ఏ మాత్రం అలవాటు లేని బ్లాక్ సోయల్‌లో బెంగాల్‌ను బెంగాల్‌లోనే ఓడించి ఫైనల్‌కు చేరుకున్న తీరు.. ఫైనల్‌లో 8 సార్లు రంజీ చాంపియన్ కర్ణాటకను ఎదుర్కొని.. అందులోనూ అత్యంత బలమైన ఫైనల్-11లో ఆరుగురు కేప్డ్ ప్లేయర్స్ ఉన్న కర్నాటక టీమ్‌ను వాళ్ల గడ్డ మీదే మట్టి కరిపించిన తీరు చూశాక.. జమ్మూ కాశ్మీర్ టీమ్ డిజర్వ్‌డ్ టు బి ట్రూ ఛాంపియన్స్!

ఇక యంగ్ సంచలనం.. సూపర్ స్టార్ అకీబ్ నబీ సత్తా ఏంటో.. ఫైనల్‌లో కర్నాటక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన విధానం చూస్తే అర్థమవుతుంది! స్పిన్‌కు అనుకూలించే ఇండియన్ స్లో-పిచ్‌ల మీద ఒక్క రంజీ సీజన్‌లో 60కు పైగా వికెట్స్.. రెండు సీజన్ల మీద 110.. అదీ ఒక ఫాస్ట్ బౌలర్ అంటే మాములు విషయమా? ఇక త్వరలో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో అతన్ని చూడటం లాంఛనమే!

  • సత్యం స్పోర్ట్స్ డెస్క్

1 Comment


Ajit Jain
Ajit Jain
2 days ago

That's because of BJP Government who helped the Jammu n Kashmir state to be normal like other states and people of the state should participate in sports n other activities

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page