సీత చేసే లంకా దహనం : ఘాటీ ట్రైలర్
- Guest Writer
- Aug 7
- 2 min read

క్రిష్ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఇప్పటివరకు ఆయన తీసిన ఏ సినిమాకి మరో సినిమాతో పోలిక ఉండదు. ప్రతిసారి ఒక కొత్త నేపథ్యంతో సినిమా తీయడం ఆయన మార్క్. ఈసారి అనుష్కతో ఘాటీ సినిమా చేస్తున్నారు. వేదం తర్వాత క్రిష్ -అనుష్క కాంబినేషన్ కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ మరిన్ని ఆశలు రేపుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
బ్రిటిష్ కాలంలో ప్రమాదకరమైన కొండప్రాంతాల్లో రోడ్లు నిర్మించిన తెగ ఘాటి. అయితే ఇప్పుడా సమాజం కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో చిక్కుకుపోయింది. తప్పు చేస్తున్నామనే గ్రహించి, ఈ చెడు వ్యవస్థకి ఎదురు నిలవడానికి రెడీ అవుతుంది అనుష్క. తన వాళ్లను ఈ ప్రమాదకర వ్యాపారం నుంచి ఎలా బయటకు తీసుకొచ్చింది? దీనికోసం ఎలాంటి పోరాటం చేసిందనేది ట్రైలర్ చాలా ఆసక్తికరంగా చూపించారు.
అనుష్కను మునుపెప్పుడూ చూడని వైల్డ్ అవతార్‌లో కనిపించింది. ఓ సామాన్య మహిళ నుంచి క్రిమినల్, లెజెండ్‌గా మారే పాత్ర ఈ కథకి కీలకం. ‘సీత చేసే లంకా దహనం చూస్తారు’ అనే డైలాగ్ ఆమె క్యారెక్టర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. క్రిష్ జాగర్లముడి యాక్షన్, ఎమోషన్‌తో పాటు కొత్త బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకొని ఈ కథను సిద్ధం చేయడం కొత్త అనుభూతిని కలిగించింది. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో విడుదలవుతున్న ఈ సినిమాకి ట్రైలర్ మంచి జోష్ తీసుకొచ్చింది.
-తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
‘మిల్కీబ్యూటీ’ తమన్నా అసలు సీక్రెట్ ఇదే.. !

పాల మీగడ లాంటి మేని ఛాయతో ఎప్పటికప్పుడు యువతను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది తమన్నా భాటియా. అంతేకాదు తన అందంతో మిల్కీ బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. అదే అందంతో.. అదే క్రేజ్ తో దూసుకుపోతోంది. సినిమాలలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా.. స్పెషల్ సాంగ్ లలో నర్తిస్తూ ఇండస్ట్రీలో తన ఇమేజ్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే తమన్నా ఇన్నేళ్లయినా.. ఇంతే అందంగా.. ఇంతే యవ్వనంగా కనిపించడం వెనుక అసలు కారణం ఏంటి? అని.. ఈ మిల్కీ బ్యూటీ అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఊహించని కామెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తమన్నా చెప్పిన ఆ బ్యూటీ సీక్రెట్ విని కొంతమంది నెటిజన్స్ అసహ్యించుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్న తమన్నా తన బ్యూటీ సీక్రెట్ కూడా చెప్పేసింది. ఇంటర్వ్యూలో భాగంగా..’’ మీరు మొటిమలు తగ్గించుకోవడానికి ఏం చేస్తారు?’’ అని అడగగా.. దీనికి తమన్నా స్పందిస్తూ..’’ ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నా నోటిలో ఉండే సలైవా (ఉమ్మి )మొటిమలపై రాసుకుంటాను. అవి క్రమంగా తగ్గిపోతాయి. ఇది నాకు వ్యక్తిగతంగా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా దీని వెనుక సైన్స్ కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఉదయం లేవగానే వచ్చే సలైవా (ఉమ్మి) లో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మొటిమలను, మొటిమల తాలూకు మచ్చల్ని కూడా తొలగిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చింది.
ఈ విషయం వైరల్ అవ్వడంతో.. దీనిపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది లాలాజలాన్ని ముఖంపై రాసుకోవడం ఏంటి? అని అసహ్యించుకుంటుంటే.. మరికొంతమంది వేలకు వేలు ఖర్చుపెట్టి క్రీములు ఉపయోగించినా తగ్గని సమస్య.. ఉమ్మితో తగ్గిపోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తమన్నా ఈ చిట్కా చెప్పడం ఇదేం మొదటిసారి కాదు.. 2021 లో కూడా ఇదే కామెంట్ చేసింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడంతో గత ఏడాది డిసెంబర్లో ఎయిమ్స్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గార్గి తనేజా ఒక వీడియో షేర్ చేస్తూ అసలు విషయం చెప్పుకొచ్చారు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో..

రుహానీ శర్మ ప్రతిభావంతులైన నటి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి లుక్‌లోనూ ఆమె అందంగా కనిపిస్తుంది. ఆధునిక లేదా సాంప్రదా య దుస్తులలో ఉన్నా, ఆమె అందంగా కనిపిస్తుంది. ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబం ధించిన విషయాలను కూడా పంచుకుంటుంది. రుహాని 2013లో తన కెరీర్‌ను ప్రారంభిం చింది. ఆమె మొదట పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఈ వీడియోలు అమ్మి విర్క్ రాసిన థెకా, క్లాస్‌రూమ్ మరియు కుడి తు పటాకా. ఆమె తన అందానికి త్వరగా దృష్టిని ఆకర్షించింది. 2018లో, ఆమె తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది. ఆమె మొదటి చిత్రం చి లా సౌ. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె పరిశ్రమలో కొత్త నటిగా మారింది. 2019లో, ఆమె మల యాళంలో అరంగేట్రం చేసింది. ఆమె థ్రిల్లర్ కమలలో నటించింది. ఈ చిత్రానికి రంజిత్ శంకర్ రచన, దర్శకత్వం వహించారు. రుహాని తెలుగు చిత్రాలలో తన నటనను కొనసాగించింది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో..
Comments