top of page

సినిమా పిల్లల సినిమాకు రూ.4,600 కోట్ల ఓపెనింగ్‌!!

  • Guest Writer
  • 3 days ago
  • 2 min read

- జోశ్యుల సూర్యప్రకాశ్‌

‘‘యానిమేషన్‌ సినిమానే కదా.. ఏమో పెద్దగా కలెక్ట్‌ చేయకపోవచ్చు’’ అనే పాత నమ్మకాన్ని ‘జూటోపియా`2’ ఒక్క వీకెండ్‌లోనే ధ్వంసం చేసింది. ప్రపంచం మెల్లిగా యానిమేషన్‌ని కేవలం పిల్లల వినోదంగా చూసే అలవాటు మార్చుకుంటోంది. దాంతో బాక్సాఫీస్‌ కూడా తన లెక్కలను మార్చి చూసుకోవాల్సిన పరిస్దితికి చేరింది. యానిమేషన్‌ చిత్రాలకు గ్లోబల్‌గా ఉన్న మార్కెట్‌ ఇప్పుడు లైవ్‌-యాక్షన్‌ బ్లాక్‌బస్టర్లను కూడా మింగేస్తోంది, దానికి తాజా ఉదాహరణగా డిస్నీ భారీ సీక్వెల్‌ ‘జూటోపియా`2’ నిలిచింది.

ree

థాంక్స్‌గివింగ్‌ వీకెండ్‌లో వచ్చిన ‘జూటోపియా`2’ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ను ఊహించని రీతిలో షేక్‌ చేస్తోంది. ‘‘సీక్వెల్‌ ఓపెనింగ్‌కి ఇంత డిమాండ్‌ ఏమిటి?’’, ‘‘యానిమేషన్‌కు ఇంత భారీ రెస్పాన్స్‌ ఎలా వచ్చింది?’’ అని ట్రేడ్‌ ఆలోచనలో పడిపోయింది. ఈ సినిమా నవంబరు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అలాగే ఈ హాలీవుడ్‌ సినిమా చైనాలో ఒక్క రోజులో 104 మిలియన్‌ డాలర్స్‌ రాబట్టింది. అంటే ఇది మన కరెన్సీలో రూ.930 కోట్లు. అంతేకాదు ప్రపచ వ్యాప్తంగా కేవలం ఐదు రోజుల్లోనే ?4,600 కోట్లకు పైగా వసూలు చేసిందీ చిత్రం. ఇది 2025లో ఏ సినిమా సాధించని రికార్డ్‌, యానిమేషన్‌ సినిమాల చరిత్రలో అద్బుతం.

ప్రపంచ సినిమా మార్కెట్‌లో ప్రస్తుతం స్పష్టమవుతున్న ఒక ట్రెండ్‌ ఏమిటంటే: పెద్ద కథలకంటే పెద్ద ఎమోషన్‌, పెద్ద బ్రాండ్‌, పెద్ద వరల్డ్‌ బిల్డింగ్‌ ఆడియన్స్‌ను ఆకర్షిస్తోందిుఅది యానిమేషన్‌ అయినా, లైవ్‌ యాక్షన్‌ అయినా రెస్పాన్స్‌ ఒకేలా ఉంటోంది. ‘జూటోపియా`2’ ఇదే ఫార్ములాతో, అదే ప్యూర్‌ ఫ్యామిలీ పుల్‌తో బాక్సాఫీస్‌ను పూర్తిగా హైజాక్‌ చేసింది. ఇంకా, ఈ విజయం కేవలం ఓపెనింగ్‌ వద్దే ఆగేలా కనిపించడం లేదు. గత దశాబ్దంలో ‘ఫ్రోజెన్‌, మనియన్స్‌, ఇన్‌సౌడ్‌ అవుట్‌ వంటి చిత్రాలు రూ.5,000 కోట్లు దాటిన సందర్భంలోనే, ..యానిమేషన్‌ సినిమాలకున్న దీర్ఘకాలిక మార్కెట్‌ స్పష్టమైంది. అలాంటి బలమైన నేపథ్యంలో వాల్ట్‌ డిస్నీ కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘జూటోపియా`2’ థ్యాంక్స్‌ గివింగ్‌ వీకెండ్‌లో విడుదలై ప్రపంచ బాక్సాఫీస్‌ లెక్కలను పునర్రచిస్తోంది.

గ్లోబల్‌ రికార్డు: యుఎస్‌ఏ G ఇంటర్నేషనల్‌ R రూ.4,600 కోట్లు!

డిస్నీ అధికారిక గణాంకాల ప్రకారం: యుఎస్‌ఏ డొమెస్టిక్‌ : రూ.1,300కోట్లు, ఇంటర్నేషనల్‌ మార్కెట్లు: రూ.3,300 కోట్లు మొత్తం గ్లోబల్‌ డెబ్యూ: రూ.4,600కోట్లు ఈ వసూళ్లు ‘జూటోపియా`2’ను 2025లో అతిపెద్ద గ్లోబల్‌ ఓపెనింగ్‌, ఆల్‌ టైమ్‌ నాలుగో అతిపెద్ద ఓపెనింగ్‌, యానిమేషన్‌ సినిమాల చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్‌ లాగా నిలబెట్టాయి. అంటే ప్రపంచ బాక్సాఫీస్‌లో ‘‘ఫ్యామిలీ ఫ్రాంచైజ్‌లు లోతైన మార్కెట్‌ను నిర్ణయిస్తాయి’’ అన్న సిద్ధాంతానికి ఇది పెద్ద ఉదాహరణ.

చైనా మార్కెట్‌లో ‘జూటోపియా`2’ సంచలనం: రూ.2,300 కోట్ల దూకుడు!

చైనా మార్కెట్‌లో సినిమా సాధించిన విజయమైతే హాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్‌ చిత్రాలకు గత రెండు సంవత్సరాలుగా చైనాలో పరిమిత సక్సెస్‌ ఉన్నా, ‘జూటోపియా`2’ మాత్రం అక్కడి ప్రేక్షకులను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించింది. ర్యూటర్స్‌ ప్రకారం, చిత్రం చైనాలో మొదటి ఆరు రోజుల్లోనే రూ.2,300 కోట్లు (1.95 బిలియన్‌ యువాన్‌) వసూలు చేసి, చైనా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ అనిమేటెడ్‌ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ తర్వాత చైనాలో రెండో అతిపెద్ద విదేశీ భాషా ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది. జూపిటియా ఫ్రాంచైజ్‌ చైనాలో కలిగిన నాస్టాల్జియా, టార్గెట్‌ చేసిన డిజిటల్‌ మార్కెటింగ్‌, స్థానిక ఇన్‌ఫ్లుయెన్సర్‌ క్యాంపెయిన్‌ మొత్తం అన్నీ ఈ రికార్డుల వెనుక ఉన్న ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి.

ఎందుకింత పెద్ద సక్సెస్‌?

యానిమేషన్‌ జానర్‌కు పెరుగుతున్న గ్లోబల్‌ నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీలు భారీ ఎంటర్టైన్‌మెంట్‌ కోసం థియేటర్లను ఎంచుకునే సమయంలో యానిమేషన్‌ సినిమాలే బెస్ట్‌ ఆప్షన్‌. ఈ సేఫ్టీ మైండ్‌ సెట్‌ కారణంగా ప్రతి పెద్ద యానిమేషన్‌ ఫ్రాంచైజ్‌కు గ్లోబల్‌ మార్కెట్‌ రెడీగా ఉంటుంది. మొదటి పార్ట్‌కు ఉన్న కల్ట్‌ స్టేటస్‌ ‘జూపిటియా’ (2016) ఒక కల్ట్‌ క్లాసిక్‌. ఆ ఫ్యాన్‌బేస్‌ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్‌ను భారీ ఈవెంట్‌లా మార్చింది.

డిస్నీ మార్కెటింగ్‌ పవర్‌ G ఫ్యామిలీ పుల్‌ తమ థీమ్‌పార్క్స్‌ నుంచి మర్చండైజ్‌ దాకాుడిస్నీ ఒక సినిమా విడుదలను ‘కంటెంట్‌ డ్రివెన్‌ ఈవెంట్‌’గా మార్చగలదు. చైనా కోసం ప్రత్యేక లొకలైజ్డ్‌ ప్రమోషన్‌ లోకల్‌ ఇన్‌ఫ్లుఎన్సర్లు, ప్రత్యేక స్క్రీనింగ్స్‌, డిజిటల్‌ పార్ట్‌నర్‌షిప్‌ుఆల్‌ దీజ్‌ యాంప్లిఫైడ్‌ ది హైప్‌. హాలీవుడ్‌ స్ట్రైక్స్‌ తర్వాత వచ్చిన సరైన టైమింగ్‌ లైవ్‌ యాక్షన్‌ సినిమాల కంటే క్లీనర్‌, హ్యాపీ, ఫ్యామిలీ సేఫ్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలకే ఆడియన్స్‌ వెళ్లే ట్రెండ్‌ బలపడిరది.

ఏదైమైనా... ‘జూటోపియా`2’ ప్రపంచ బాక్సాఫీస్‌పై చూపిస్తున్న ప్రభావం చూస్తే, ఇది కేవలం ఓ సక్సెస్‌ఫుల్‌ సీక్వెల్‌ కాదు. 2025 సినిమా మార్కెట్‌లో మార్పు తెచ్చే కీలక మలుపుగా కనిపిస్తోంది. యానిమేషన్‌ జానర్‌కు ఉన్న గ్లోబల్‌ డిమాండ్‌ ఎంత పెరిగిందో, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లలో బిగ్‌ సైజ్‌ స్టోరీస్‌కి ఎంత రెస్పాండ్‌ అవుతున్నారో, మరియు డిస్నీకి మళ్లీ వచ్చిన క్రియేటివ్‌ కాన్ఫిడెన్స్‌ ఈ చిత్రం స్పష్టంగా నిరూపిస్తోంది. చైనాలో వచ్చిన అద్భుతమైన రన్‌ హాలీవుడ్‌కు కొత్త ఆశ చూపిస్తోంది. మొత్తానికి, ‘జూటోపియా`2’ గ్లోబల్‌ సినిమా మార్కెట్‌ను మళ్లీ మాప్‌ చేస్తున్న ఒక ఫెనామెనాన్‌ు2025 బాక్సాఫీస్‌ కథలో తొలి ఘట్టంగా మారుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page