top of page

సినీ లెజెండ్రీ ధర్మేంద్ర.. తెలియని విషయాలు ఎన్నో!

  • Guest Writer
  • Nov 11, 2025
  • 2 min read

ప్రముఖ బాలీవుడ్‌ లెజెండ్రీ నటులు ధర్మేంద్ర తుది శ్వాస విడిచారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో సెలబ్రిటీలు అభిమానులు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్లు పెట్టడంతో ఈ విషయం కాస్త వారి కుటుంబ సభ్యుల వరకు చేరాయి. దీంతో ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్‌ స్పందిస్తూ ఒక్కసారిగా మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు సహకరిస్తున్నారు.. చనిపోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం ధర్మేంద్ర గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. భారతీయ నటుడుగా, నిర్మాతగా, మరియు రాజకీయ నాయకుడిగా ఈయనకు మంచి పేరు ఉంది. హిందీ చిత్రాల్లో ఈయన చేసిన కొన్ని పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతాయి. 1960లో ‘దిల్‌ భీ తేరా హమ్‌ భీ తేరా’ మూవీతో సినీ సినిమా రంగంలో అడుగు పెట్టారు. యాక్షన్‌ కింగ్‌ గా పేరు సాధించారు. 1997లో ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు 2005లో బీజేపీ తరఫున రాజస్థాన్లోని బికనీర్‌ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్‌ పురస్కారం కూడా అందుకున్నారు.

‘హీ`మ్యాన్‌’ ఎలా అయ్యారంటే?

ధర్మేంద్రను బాలీవుడ్‌ లో హీమ్యాన్‌ అని అంటుంటారు. ఈ పేరు రావడానికి కారణం ధర్మేంద్రకు ఉన్న మస్క్యులర్‌ బాడీ, రగ్గడ్‌ లుక్స్‌, 1960-70ల మధ్య ఎక్కువగా యాక్షన్‌ పాత్రలు చేయడమే. యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ వంటి జానర్స్‌ అన్ని పాత్రలు కలిసి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర చివరిగా నటించిన ‘ఇక్కీస్‌’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. వ్యక్తిగత జీవితం.. ఆయనకు ఇద్దరు భార్యలు ప్రకాశ్‌ కౌర్‌, హేమమాలిని. బాలీవుడ్‌ నటులు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ మొదటి వైఫ్‌ కు జన్మించారు. హేమమాలిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ధర్మేంద్ర దంపతులకు ఈషా డియోల్‌, అహనా డియోల్‌ జన్మించారు. అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘షోలే’లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. అలీబాబా ఔర్‌ 40 చోర్‌, దోస్త్‌, డ్రీమ్‌ గర్ల్‌, సన్నీ, గాయల్‌, లోఫర్‌, మేరా నామ్‌ జోకర్‌ వంటి సినిమాలు ధర్మేంద్రకు విపరీతమైన పేరును తీసుకొచ్చాయి.

లెగిసి కంటిన్యూ చేస్తున్న కుమారులు

ఇతని కుమారుడు బాబి డియోల్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్‌ సినిమాలో బాబి డియోల్‌ నటించిన తీరు నెక్స్ట్‌ లెవెల్‌ లో ఉంటుంది. ఈ సినిమా తర్వాత బాబీ డియల్‌ కంప్లీట్‌ గా బిజీగా మారిపోయాడు. కేవలం బాలీవుడ్‌ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే డాకు మహారాజ్‌, హరిహర వీరమల్లు వంటి సినిమాల్లో కనిపించాడు. ఇంక ముందు ముందు కూడా తెలుగులో మరిన్ని ప్రాజెక్ట్‌ లు చేయనున్నాడు. మరోవైపు సన్నీ డియోల్‌ కూడా దాదాపు 100 సినిమాలకు పైగా నటించాడు. యాక్షన్‌ హీరోగా అతనికి మంచి పేరు ఉంది. అతని కెరియర్‌ లో రెండు ఫిలింఫేర్‌ అవార్డులు కూడా గెలుచుకున్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా తాను యాక్టివ్‌ గా ఉన్నారు.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page