top of page

సుమధుర వెండితెర దృశ్య కావ్యం ‘గీతాంజలి’.

  • Guest Writer
  • May 13
  • 3 min read

36 సంవత్సరాల గీతాంజలి నాటికి నేటికీ ఏనాటికి విన్నుతమైన ప్రేమకథ చిత్రం. ఈచిత్రం రిలీజ్‌ రోజున థియేటర్‌ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకులు మరియు అభిమానులు సినిమా ఎలా ఉంది అంటే సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే సూపర్‌ సుబ్బరాయన్‌ పైట్స్‌ అన్నారు. పైట్స్‌ లేవు ఘర్షణ వంటి సెంటిమెంట్‌ యాక్షన్‌ మూవీ తీసిన మణిరత్నంగారు హీరో హీరోయిన్‌ ఇద్దరిని ఎన్నాళ్ళు బ్రతుకుతారో తెలియదు కానీ కొన్నాళ్ళు బతికిన సంతోషంగా ఉంటారు అనే క్లయిమాక్స్‌. ఎటువంటి అంచనాలు లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో అతి పెద్ద థియేటర్స్‌ గుంటూరు మంగా హైదరాబాద్‌ దేవి వైజాగ్‌ చిత్రాలయ లాంటి సెంటర్స్‌ లలో థియేటర్‌ రికార్డు సృష్టించిన చిత్రం గీతాంజలి. కొసమెరుపు ఏమిటంటే.. ఈ చిత్రానికి పాటలు వేటూరి సుందరరామమూర్తి మాటలు డబ్బింగ్‌ రైటర్‌ రాజశ్రీ గారు రాశారు.

ree

నా వ్యూ. నా మాటల్లో ..సినిమా రిలీజ్‌ అయ్యి దాదాపు 28 సంవత్సరాల తరువాత (అప్పుడు రాసాను)

గీతాంజలి: టైటిల్‌ తెలిసి పెట్టారో తెలియక కాకతాళీయంగా పెట్టారో తరువాత చెప్తాను కాని మన రవీంద్రనాథ్‌ టాగోర్‌ రాసిన నోబెల్‌ ప్రైజ్‌ పొందిన మహత్తర రచన.

ప్రపంచ సాహిత్యంలోనే ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం ఆ రవీంద్రనాథ్‌ టాగోర్‌ గీతాంజలిలోని ముఖ్యాంశం అయితే

ఈ గీతాంజలి మణిరత్నం గారిచే అదే నిరాశ నిస్పృహలను (ప్రాణాంతకమైన వ్యాధి) ఒకటి ఉంది అని తెలుసుకొని విరక్తి చెందుతున్న దశలో ఇతనికి భిన్నంగా జీవితాన్ని చలాకీగా గడుపుతున్న ఒక అందమైన అమ్మాయి పైగా ఇలాంటి ఇబ్బంది ఆమెకి కూడా వుండటం ,వారి ఇరువురి మధ్య స్నేహం, గొడవలు, చివరికి ప్రేమ...ఇలా చూడటానికి ఏదో నిరాశ నిస్పృహ లతో కూడిన సినిమా అనుకుంటాం.

స్వర్గీయ రాజశ్రీ గారు.. అరవ డబ్బింగ్‌ సినిమాలకే లిప్‌ సింక్‌తో పాటు అర్ధం చెడకుండా తెలుగు డైలాగ్స్‌ మరియు పాటలు రాయగల దిట్ట .అలాంటిది ఏకంగా డైరెక్ట్‌గా తెలుగు సినిమాకే రాస్తున్నారు అంటే... ఇక ఊహించుకోండి

సీన్‌ ఓపెన్‌ చేస్తే భారత దేశ భవిష్యత్‌ యువతరం చేతుల్లో వుంది..అవును సింబాలిక్‌గా కాలుతున్న సిగరెట్‌, అడ్డదారులు తొక్కుతూ వస్తున్న యువత.. ఇక ఇది మామూలు రొటీన్‌ సినిమా అనుకునే సమయంలో చిన్న పదం అప్పట్లో పెద్ద కుదుపు...

ఐ లవ్‌ యు...ఐ లవ్‌ యు అని చాన్సలర్‌తో అనటం

ఇలా చాలా పదాలు ఇప్పటికీ కుదుపు వచ్చే చాలా వున్నాయి.. ఏయ్‌ లేచిపోదామా,

నన్ను పెళ్లి చేసుకుంటారా అని డాక్టర్‌ని అడగటం, లేచిపోదాం అన్న మగాడు , ‘‘వాళ్ళు వేరు నువ్వు వేరు..’’ ఇత్యాది ఇలాంటి పదాలు సినిమా చూస్తున్నప్పుడు ఆ పదాలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి..

‘వాళ్ళు వేరు నువ్వు వేరు’ ‘‘ఏ..ఏ ..ఏ’’ పదాలు ఇప్పటికీ వాడుతున్నాం అంటే అప్పట్లోనే రాజశ్రీ గారి కలం ఎంత ముందుగా 21వ శతాబ్దంలోకి వెళ్ళిపోయిందో.. ఇలా సరదాగానూ ఉన్నా కూడా అటు సెంటిమెంట్‌ పదాలు నాన్నా నాకు బ్రతకాలని వుంది,ఆ చిన్న పిల్లల అల్లరిలో ముద్దు ముద్దు మాటలు ఇలా ఒకటేమిటి.. ప్రతి పదం ఆణిముత్యాలే..

ఇక మెల్లగా కళ్ళు, ఒళ్ళు, మనసు ఏదో జరగబోతుంది అనే ఆత్రుతతో ఇక సినిమాలోకి వెళ్ళిపోవటం మొదలుఅవుతాయి.

చనిపోబోతున్న ప్రేమికుల కథను ఓ గొప్ప కావ్యంలా ‘గీతాంజలి’ గా మలిచిన దర్శకుడు మణిరత్నం.హృదయాలను హత్తుకొనే కథ, గొప్ప పెయింటింగ్‌లా కదిలే దృశ్యాలు , మనసు లోతట్టు భావాలను కదిలించే సంగీతం కలబోత ఈ సినిమా.

కాని ఇక్కడ మణిరత్నం గారు ఒక పక్క, ఒక పక్క ఇళయరాజా గారు, కెమెరామేన్‌ పీసీ శ్రీరామ్‌ గారు, ఆర్ట్‌ తోట తరణి గార్లు... పేర్లు చెప్తుంటేనే కళ్ళముందు పెయింటింగ్స్‌ లాంటి సీన్స్‌ కనపడుతున్నాయా? అదే దృశ్యమాలిక మ్యాజిక్‌ ఈ సినిమాలో

సుమధుర వెండితెర దృశ్య కావ్యం ‘గీతాంజలి’. ఈ సినిమా చూస్తున్నంతసేపు విజువల్‌ పొయిట్రీ లానే వుంటుంది. ప్రతి షాట్‌ పెయింటింగ్‌నే. ఆ ఊటి చల్లదనం, ఆ చక్కని ప్రకృతి దృశ్యాలు ఒక ఎత్తు అయితే ప్రతి షాట్‌లో రీ రికార్డింగ్‌కి ఇళయరాజా గారు ఇచ్చిన సంగీతం ఇంకో ఎత్తు. హీరొయిన్‌ తలుపు తీసినప్పుడు మంచు అలా లోపలికి వస్తుంటే నిజంగా ఆ చల్లదనం మనమూ ఫీల్‌ అయ్యేంత రేంజ్‌లో లైటింగ్‌ కాని, మ్యూజిక్‌ కాని మనకు తెలియకుండానే ఊటీ లో ఉన్నాం అనేంత పరిస్థితిలోకి తీసుకుని వెళ్తాయి.

అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఇక ‘ఓ నమహా..’ పాట చిత్రీకరణ. రౌండ్‌ట్రాలీతో కెమెరాను వారి చుట్టూ తిప్పుతూ.. వాళ్ళిద్దరి మధ్యా ఆ ఎమోషన్‌ను క్యారీ చేస్తూ, వారి ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌ని క్యాచ్‌ చేస్తూ తీసిన ఆ పాట ఒక అద్భుతం ఆ ప్రేమికుల మధ్య ఎమోషన్‌నూ ఆ దృశ్యమాలికతో పాటు.. ఇళయరాజా సంగీతం తోడవటంతో అత్యద్భుతం అనిపిస్తుంది. ఇంకో విషయం సింగిల్‌ షాట్‌గా తీసారు ఆ రౌండ్‌ ట్రాలీ షాట్‌ని.. ఒక పాటలో ఎక్కువ శాతం రౌండ్‌ ట్రాలీలో పాటలో ఎక్కువ భాగం కేవలం హీరో, హీరోయిన్‌ ముఖాల మీదనే తీసిన మొదటి సినిమా ఇది తెలుగులో (వేరే బాషలో ఇంకోటి వుంది అని గుర్తు. మరో టైంలో మళ్ళీ ఈ షాట్‌ గురించి చెప్తాను)

ఇన్ని చెప్పి ఎడిటింగ్‌ గురించి చెప్పక పోతే ఫుల్‌మీల్స్‌ తిని స్వీట్‌ పాన్‌ మిస్‌ అయినట్టే..

ఏదో షాట్స్‌ చుట్టేసి రీల్స్‌కి రీల్స్‌ తీసేసి అతుకుల బొంతగా కుట్టటం కాదు ఎడిటింగ్‌ అంటే. స్క్రీన్‌ప్లేకి తగినట్టుగా షాట్‌ డివిజన్‌ చేసుకోవటం సాధారణంగా స్క్రీన్‌ప్లే రాసేటప్పుడే షాట్‌ డివిజన్‌ దగ్గరే దర్శకుడికెలా తెరకెక్కించాలో పూర్తి అవగాహన వచ్చేస్తుంది. షాట్స్‌ ఎంత క్రిస్ప్‌గా ఉంటాయో మళ్ళీ ఒకసారి చూడండి. షాట్‌ టు షాట్‌ అలా టచ్‌ అవుతూ వెళ్ళిపోతాయి. ఎక్కడా ఒక్క సెకండ్‌ కూడా ల్యాగ్‌ రాదు. అందుకే ప్రతి ఫ్రేం మనకు ఇప్పటికీ గుర్తు ఉండిపోయాయి ఎడిటింగ్‌ చేసింది లెనిన్‌-విజయన్‌ గారు.

అన్నట్టు ఈ సినిమా ‘‘యంగ్‌ డై ఫస్ట్‌’’ అనే అంగ్ల చిత్రానికి ప్రేరణ

కథానాయిక పేరు గీతాంజలి ఢల్లీికి చెందిన 11సంవత్సరాల బాలిక పేరు. త్వరలో చనిపోనున్నాని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. టైటిల్‌ వెనుక ఉన్న అసలు కథ అదీ.

చమక్‌: ఈ సినిమా మొత్తం కేవలం 60 రోజుల్లో తీసారు అంటే మీరు నమ్మగలరా? ఊటీకి 2500 అడుగుల ఎత్తున ఉన్న దొడబిట్ట ప్రాంతంలో ప్రతీరోజూ తెల్లవారురaామున 3,4 గంటల సమయంలో విపరీతమైన చలిలో ఎదుటిమనిషి కనిపించని పొగమంచులో దాదాపు 25 రోజులపాటు షూటింగ్‌ చేశారు.

32 నే: ఎందుకో నాకు తెలియదు కాని ఛామన ఛాయ నప్పినట్టు గా వేరే ఏ స్కిన్‌ టోన్‌ నాకు నచ్చదు, నాకు నచ్చే ప్రతి ‘‘హీరోయిన్‌’’ ఛామన ఛాయనే రేవతి, భానుప్రియ, మాధవి, ప్రియమణి, పూర్ణిమ, ముచ్చెర్ల అరుణ ఇత్యాది అన్నమాట.

కిక్కు : ఈ సినిమా రిలీజ్‌ అయి బంపర్‌ హిట్‌ అయిన ఆరు నెలలకే ‘‘శివ’’ రావటం, ఇక మన నాగార్జునగారు వెనుతిరిగి చూసుకునే అవసరం రాలేదు.

ఈ సినిమాలో గిరిజ కాస్ట్యూమ్స్‌ కూడా బాగా ఫేమస్‌ అయ్యాయి. టీనేజ్‌ అమ్మాయిలంతా గీతాంజలి డ్రస్సులంటూ ఎగబడ్డారు. మార్కెట్‌లో గిరిజకు సైట్‌ కొట్టే కుర్రాడు నిర్మాత నరసారెడ్డిగారి కొడుకు గౌతం కుమార్‌ రెడ్డి. ఏయ్‌ లేచిపోదామా...32 నే

మీ బాలు గాడు..( నేను సినిమా విభాగానికి చెందిన వాడిని కాదు, సినిమా పరిబాషా పదాలలో నాకు చెప్పటం రాదు, నేను కేవలం అతి మామూలు ప్రేక్షకుడినే తప్ప మరోటి కాదు..)

- బాలూ ఇక్బాల్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page