top of page

సుశాంత్‌తో మీనాక్షి పెళ్లి..?

  • Guest Writer
  • Jan 6
  • 3 min read

మీనాక్షి చౌదరి.. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ సొట్టబుగ్గల సుందరి.. తన అందంతోనే కాదు నటనతో కూడా అందరిని ఆకట్టుకుంది. 2024 సంక్రాంతి సందర్భంగా మహేష్‌ బాబుతో గుంటూరు కారం సినిమా చేసి సంక్రాంతి విజేతగా నిలిచిన ఈమె.. గత ఏడాది విక్టరీ వెంకటేష్‌తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మరోసారి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పుడు కూడా మళ్లీ సంక్రాంతి విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ అందుకోవాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అందులో భాగంగానే తాజాగా నవీన్‌ పోలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చేపట్టింది మీనాక్ష్షి చౌదరి. అందులో భాగంగానే తన మొదటి సినిమా హీరో సుశాంత్‌తో రిలేషన్‌ లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ గత ఐదు సంవత్సరాలుగా రూమర్స్‌ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ రూమర్స్‌పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది మీనాక్ష చౌదరి.

ఇంటర్వ్యూలో భాగంగా.. సుశాంత్‌తో మీనాక్షి చౌదరి పెళ్లి అని సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వినిపించాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ విషయంపై మీరు సుశాంత్‌తో మాట్లాడారా? అని యాంకర్‌ ప్రశ్నించగా.. మొదట మీనాక్షి చౌదరి నవ్వేసింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. నా మొదటి సినిమా ఇచ్చట వాహనములు నిలపరాదు. ఈ సినిమాలో సుశాంత్‌ హీరోగా నటించారు. అప్పటి నుంచే నాకు సుశాంత్‌తో మంచి ఫ్రెండ్షిప్‌ ఏర్పడిరది. ఇక రూమర్స్‌ అంటారా సోషల్‌ మీడియాలో ఇలాంటి రూమర్స్‌ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. వీటిని చూసి చూడనట్టు వదిలేయాలి అంతేకానీ వీటినే పట్టుకొని వేలాడితే భవిష్యత్తులో ముందుకు వెళ్లలేము. ఇదే విషయాన్ని నేను సుశాంత్‌తో చెబితే ఆయన కూడా ఇలాంటి రూమర్స్‌ గురించి పట్టించుకోవడం అంటే మన సమయాన్ని మనమే వృధా చేసుకోవడం అని చెప్పాడు అంటూ తెలిపింది.

అంతేకాదు ఇదే విషయంపై ఆమె ఇంకా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాక ఇవన్నీ సహజం. అందుకే వీటన్నింటినీ మైండ్‌ లోకి ఎక్కించుకొని స్ట్రెస్‌ తీసుకోవాలని అనుకోవట్లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చేసిన ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడమే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా వినిపిస్తున్న రూమర్స్‌కి ఒక్కసారిగా చెక్‌ పడిరదని చెప్పవచ్చు. ప్రస్తుతం మీనాక్షి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా విషయానికొస్తే.. ఇందులో నవీన్‌ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. కళ్యాణ్‌ సుందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా ఎస్‌.తమన్‌ పనిచేస్తున్నారు.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

అనసూయ సరే.. ‘ఈటీవీ’ ఏమంటుంది?

ఈటీవీలో జబర్దస్త్‌ షోకి సెపరేట్‌ ఫ్యాన్స్‌ బేస్‌ ఉంది. ఈటీవీ సంస్థని, మల్లెమాలనీ లాభాల బాట పట్టించిన షో ఇది. ఆ తరవాత ఇదే స్ఫూర్తితో కొన్ని టీవీ ఛానళ్లు కొత్త షోలకు అంకురార్పణ చేశాయి. కానీ జబర్దస్త్‌ ధాటికి తట్టుకోలేక.. ఎంత వేగంగా వచ్చాయో, అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాయి. యూ ట్యూబ్‌లో ఒక్కో జబర్దస్త్‌ వీడియోకి లక్షల వ్యూస్‌ కనిపిస్తాయి. ఇదంతా ఆయా సంస్థలకు ఆదాయమే. చాలామంది జీవితాల్లో జబర్దస్త్‌ ఓ మేలిమి మలుపు.అనామకుల్ని స్టార్లుగా మార్చిన ఘనత ఈ కార్యక్రమానిది.

ఇదంతా ఒకవైపు. మరోవైపు చూస్తే.. విమర్శలు, వివాదాలు. వినోదం పేరుతో, బూతులు వాడేస్తున్నారని, ఈటీవీ సంస్థ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని ఆవేద న వ్యక్తం చేసిన వాళ్లెందరో..? చాలా స్కిట్లు వివాదాస్పదమయ్యాయి. కానీ వాటన్నింటినీ తట్టుకొని ఈ షో నిలబడిరది. ఇప్పుడు ఇదివరకటి జోరులేదు కానీ, ఇప్పటికీ ఈ షోని ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారు. కానీ బూతు పురాణం మాత్రం ఆగలేదు. ఎప్పుడూ ఏదో ఒక రభస. లేదంటే పాత వీడియోలు వైరల్‌ అవ్వడం, వాటి గురించి డిబేట్‌ జరగడం షరా మామూలుగా జరుగుతుంటాయి. లేటెస్టుగా ‘రాశి’ ఎపిసోడ్‌ తెర పైకి వచ్చింది. గతంలో ఇదే షోలో అనసూయ, హైపర్‌ ఆది.. నటి రాశిని ఉద్దేశిస్తూ వాడిన కొన్ని చీప్‌ డైలాగులు ఇప్పుడు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. ఇటీవల శివాజీ ఇష్యూలో స్పందిచి, మహిళల సాధికారికత పై మాట్లాడిన అనసూయ.. ఈ విషయంలో కార్నర్‌ అయ్యింది. నేరుగా రాశినే ‘ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగారు’ అని నిలదీయడంతో.. అనసూయ రియాక్ట్‌ అవ్వక తప్పలేదు. జరిగిన దానికి క్షమాపణ చెప్పింది. అప్పట్లో చేసిన తప్పుని క్షమాపణతో సరిదిద్దుకొనే ప్రయత్నం చేసింది. తప్పు తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పే. కానీ.. తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని చూడడం, భేషజాలకు పోకుండా క్షమాపణలు అడగడం స్వాగతించాల్సిన విషయం. అనఅసూయ ఈ విషయంలో పరిణితి చూపించింది.

అయితే ఇదే ఇష్యూలో ఈటీవీ సంస్థ గానీ, మల్లెమాల గానీ, హైపర్‌ ఆది గానీ, ఆ స్క్రిప్టు రాసిన వాళ్లు, డైరెక్ట్‌ చేసిన వాళ్లు గానీ స్పందించలేదు. హైపర్‌ ఆది కూడా ఈ ఇష్యూలో ఉన్నాడు కాబట్టి.. తన స్పందన చాలా ముఖ్యం. మరీ ప్రధానంగా ఈటీవీ, మల్లెమాల లాంటి సంస్థలు ఈ విషయంలో అనసూయలా పరిణితితో వ్యవహరిస్తే మంచిది. దొర్లిన తప్పుని లేటుగా అయినా గుర్తించి, ఆ తప్పు వల్ల గాయపడిన హృదయాలకు స్వాంతన చేకూరేలా చఅబశ్రీశ్రీర్యఅబశ్రీశ్రీలు తీసుకొంటే బాగుంటుంది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది. మరీ ముఖ్యంగా వినోదం పేరుతో మహిళల మర్యాదని, వాళ్ల ప్రతిష్టనీ, సాధికారికతని, గౌరవాన్ని వ్యంగంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించాలి. ఈ విషయంలో ఈటీవీ, మల్లెమాలలా ప్రక్షాళనకు దిగకపోతే.. ఆ సంస్థల ప్రతిష్టకు మాయని మచ్చలా మారే ప్రమాదం వుంది.

-తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page