హుక్ స్టెప్స్ గుర్తు చేసిన చిరు
- Guest Writer
- Jan 8
- 2 min read

హుక్ స్టెప్స్ అనే మాట ఇప్పుడు వింటున్నాం కానీ.. అసలు దీనికి ఆధ్యుడు తప్పకుండా మెగాస్టార్ చిరంజీవినే. ఒకప్పుడు సినిమాల్లో పాటలు వస్తే, జనం సిగరెట్ కోసం బయటకు వెళ్లిపోయే రోజులు ఉండేవి. దాన్ని మెల్లమెల్లగా మార్చారు చిరంజీవి. పాటల కోసం థియేటర్లకు వెళ్లి, మళ్లీ మళ్లీ టికెట్లు కొనేలా చేశారు. అదంతా చిరు మాయ.
‘ముఠామేస్త్రీ’లో చిరు లయబద్ధంగా వేసిన హుక్ స్టెప్.. ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటికీ దాన్ని ఇమిటేట్ చేయడానికి చూసేవాళ్లెంతో మంది. ‘హిట్లర్’లో పాటని కళ్లార్పకుండా చూశారు అప్పటి చిరు ఫ్యాన్స్. ఇప్పటికీ ఆ స్టెప్‌పై మోజు తీరలేదు. ‘ఇంద్ర’లో వీణ స్టెప్పు.. హుక్ స్టెప్స్‌కే బాప్ లాంటిది. చిరు శరీరం మొత్తం స్ప్రింగులా కదిలిన మూమెంట్ అది. ‘ఇంద్ర’లో యాక్షన్ సీన్స్‌ని ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేశారో, ఈ ఒక్క మూమెంట్‌ని అంతలా ఆస్వాదించారు. ఇలా చిరు వేసిన హుక్ స్టెప్స్ గురించి చెప్పుకొంటూ పోతే.. ఎన్నో పాటల్ని ఉదాహరించాల్సి ఉంటుంది.
ఇప్పుడు హుక్ స్టెప్స్‌తో ఓ పాటే చేసేశారు మెగాస్టార్. ‘మన శంకర వర ప్రసాద్ గారు’లో.. మంచి డాన్సింగ్ నంబర్‌లా ఈ పాటని కంపోజ్ చేశారు. పాటలో చిరు మరోసారి లయబద్ధంగా కాలు కదిపి, తన గ్రేస్ చూపించుకొన్నారు. గ్రాఫిక్స్‌లో అలనాటి హుక్ స్టెప్స్‌ని మరోసారి తెరపైకి తీసుకురావడం మరింత బాగా కుదిరింది.
బాబా సెహగల్ చిరు కోసం పాట పాడి చాలా రోజులైంది. ఈ పాటతో ఆయన ‘రూప్ తేరా మస్తానా’ కాలంలోని అభిమానుల్ని తీసుకెళ్లిపోయారు. ఈ పాటతో ఫ్యాన్స్ అంతా ఒకప్పటి చిరు డాన్స్‌లోని గ్రేస్‌ని, ఎనర్జిటిక్ మూమెంట్స్‌ని గుర్తు చేసుకొంటున్నారు. డాన్సుల్లో ఎవరెంతమంది, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఈ విభాగంలో చిరుని మించిపోయేవాళ్లెవరూ మనకు ఎదురు కాలేదన్న సంగతి ఈ పాట మరోసారి నిరూపించింది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
శ్రీలీల లవ్ స్టోరీ.. ఎందుకు ఇలా..?

యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో కూడా తన మార్క్ చాటుతుంది శ్రీలీల. తెలుగు అమ్మాయే అయినా అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో తొలి సినిమా చేసింది. ధమాకాతో తొలి హిట్ అందుకున్న శ్రీలీల తెలుగులో వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేస్తుంది. ఐతే సినిమాలైతే చేస్తుంది కానీ శ్రీలీలకు సక్సెస్ లు మాత్రం పడలేదు. ఐతే స్టార్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేవలం సాంగ్స్, రెండు మూడు సీన్స్ కోసమే అన్నట్టు ఉంటుంది. తిరుపతిలో క్యూ లైన్ లో పక్క్కింటి అమ్మాయిలానే..
అసలు శ్రీలీల ఆఫ్ స్క్రీన్ ఫోటోస్ చూస్తే ఎంతో క్యూట్ గా ఉంటాయి. మొన్న తిరుపతిలో క్యూ లైన్ లో మన పక్కింటి అమ్మాయిలానే శ్రీలీల చాలా న్యాచురల్ గా అనిపించింది. ఐతే ఆ వీడియో చూసిన శ్రీలీల ఫ్యాన్స్ ఆమెతో ఎందుకు మన దర్శకులు లవ్ స్టోరీస్ ట్రై చేయట్లేదని అంటున్నారు. నిజమే శ్రీలీల లవ్ స్టోరీస్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అవూతుంది. ఆమెను ఎందుకో మన మేకర్స్ గర్ల్ ఫ్రెండ్ గా చూపించడానికి ఆసక్తి చూపించట్లేదు. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ కోసమో.. లేదా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ల కోసమో తప్ప అసలు శ్రీలీల వెయిట్ ఉన్న రోల్ చేయట్లేదు. ఒకప్పుడు త్రిష చేసినట్టుగా లవ్ స్టోరీస్ చేస్తే శ్రీలీల కెరీర్ కి కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. బాలీవుడ్ లో శ్రీలీల తొలి సినిమా కార్తీక్ ఆర్యన్ తో లవ్ స్టోరీ చేస్తుంది. సూపర్ హిట్ ఫ్రాంచైజ్ ఆషికి సీక్వెల్ గా ఇది వస్తుందని తెలుస్తుంది.
శ్రీలీలలో ఒక ప్రేమికురాలిని.. బాలీవుడ్ డైరెక్టర్స్ గుర్తించినట్టుగా శ్రీలీలలో ఒక ప్రేమికురాలిని ఎందుకు చూడలేకపోతున్నారు అన్నది సోషల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నారు. తెలుగులో శ్రీలీల ఒక సీరియస్ లవ్ స్టోరీ చేస్తే తప్పకుండా ఆమెకు అది ప్లస్ అవుతుంది. శ్రీలీల తో ఒక క్రేజీ లవ్ స్టోరీ అంటే ఏ యువ హీరో అయినా చేయడానికి సై అనేస్తారు. మరి మన దర్శక నిర్మాతలు ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆడియన్స్ కోరుతున్నారు.
శ్రీలీల కూడా తెలుగులో కెరీర్ కొనసాగించాలని ఆలోచన ఉన్నా కేవలం కమర్షియల్ సినిమాల్లో ఏదో ఒక ఆట బొమ్మలా కాకుండా కాస్త వెయిట్ ఉన్న సీరియస్ రోల్స్ పడితే బాగుంటుందని అనుకుంటుంది. సో శ్రీలీలతో ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే మాత్రం ఆమె డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ కూడా ప్లస్ అయ్యి సినిమా ప్రేక్షకులను రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అలాంటి అటెంప్ట్ ఎవరు చేస్తారు.. శ్రీలీలని ఆ యాంగిల్ లో ఎవరు చూపిస్తారు అన్నది చూడాలి. శ్రీలీల మాత్రం ఇదివరకు లాగా వచ్చిన ప్రతి సినిమా అన్నట్టు కాకుండా కాస్త ఆచి తూచి అడుగులు వేయాలని చూస్తుంది. వరుస ఫ్లాపులు ఆమెలో చాలా మార్పులు తెచ్చాయని తెలుస్తుంది.
-తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments