హరిహర వీరమల్లు’ ట్రైలర్: పులిని వేటాడే బెబ్బులి
- Guest Writer
- Jul 3
- 3 min read

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం హరి హర వీర మల్లు పార్ట్ 1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ట్రైలర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మూడున్నర నిమిషాల ట్రైలర్ ఇవాళ విడుదలవగా, అభిమానులు, ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్‌ను కలిగించింది. ట్రైలర్ మొత్తం పవన్ కల్యాణ్ యొక్క పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆసక్తికరంగా సాగుతుంది.
అర్జున్‌దాస్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఇక పవన్ కల్యాణ్ వీర మల్లు అనే అప్రతిహత యోధుడిగా కనిపించడం మెయిన్ హైలెట్. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ముఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచే కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ డియోల్ ఔరంగజేబ్‌గా భయానకమైన పాత్రలో కనిపించగా, కోహినూర్ డైమండ్ కోసం జరుగుతున్న పోరాటం నేపథ్యంగా వీర మల్లు, ఔరంగజేబ్ ల మధ్య జరిగే యుద్ధమే చిత్రానికి హైలైట్. యాక్షన్, విజువల్స్ బిగ్ స్క్రీన్ పై మరింత కిక్కిచ్చేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిపి ఒక పవర్‌ఫుల్ యోధుడిగా తెరపై నిండుగా కనిపిస్తారని తెలుస్తోంది. ‘‘ఆంధి వచ్చేసింది’’ అనే డైలాగ్ ఒక్కటే అభిమానుల్లో గూస్‌బంప్స్ కలిగిస్తోంది. ‘‘అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు... మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు’’ అనే మరో డైలాగ్ కూడా ఆయన రాజకీయమైన ప్రస్తుత స్థితిని ప్రతిబింబించడంతో ట్రైలర్‌కు మరింత బలాన్ని తెచ్చిపెట్టింది. అలాగే పులిని వేటాడే బెబ్బులి అనే డైలాగ్ కూడా పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంది.
దర్శకుడు జ్యోతి క్రిష్ణ ఈ చారిత్రక చిత్రాన్ని మెగాస్కేల్‌లో రూపొందిస్తూ.. భారీ కాన్వాస్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో ప్రేక్షకులకు థియేట్రికల్ ఫీస్ట్ అందించనున్నట్లు అర్ధమవుతుంది. ట్రైలర్‌లో కనిపించిన యుద్ధ సన్నివేశాలు, సనాతన ధర్మంపై ప్రధాన పాత్ర పోరాటం సినిమాలోని ప్రధాన బలంగా నిలవనున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే, జ్యోతి క్రిష్ణ విజన్ పూర్తిగా గ్రాండ్ స్క్రీన్ అనుభూతిని ఇవ్వాలన్నదే. పంచమిగా నటించిన నిధి అగర్వాల్ పాత్ర కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. సునీల్, భరణి లాంటి ప్రముఖ నటులు కూడా సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్లు జ్ఞాన శేఖర్ %పూ%, మనోజ్ పరమహంసా లు కలిసిచేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తోట తరణి వేసిన సెట్లు ముఘల్ కాలానికి తగినంత వైభవాన్ని చూపించగా, కీరవాణి సంగీతం ఎమోషన్‌కు అర్థం చెప్పే విధంగా సాగుతోంది. ప్రకాశం %ఖూ% ఎడిటింగ్ కూడా ట్రైలర్‌ను కట్టిపడేస్తోంది.
మొత్తంగా ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ బ్లాక్‌బస్టర్ ఫీల్ ఇచ్చే విధంగా ఉంది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే గ్రాండ్ చారిత్రక పాత్రగా నిలవబోతున్న ఈ సినిమా జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ ట్రైలర్‌తో పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు మొదలయ్యాయి. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. తుపాకి.కామ్ సౌజన్యంతో...
ఔను ! వాళ్లిద్దరు 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసిపోయారు!

బాలీవుడ్‌ను కొన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఫ్యామిలీలలో కపూర్ ఫ్యామిలీ ఒకటి !
చిత్ర నిర్మాణం, నటన, దర్శకత్వాలలో కపూర్ ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి
కపూర్ ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలంటే మొదటగా రాజ్‌కపూర్ గురించి చెప్పుకోవాలి. బాలీవుడ్‌లో కొన్నేళ్లు రాజ్‌కపూర్ శకం నడిచింది. చిత్ర నిర్మాతగా, దర్శకుడిగా , నటుడిగా విభిన్న రంగాల్లో రాజ్‌కపూర్ సక్సెస్ అయ్యారు. ఆ రాజ్‌కపూర్ కొడుకులే రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్.
ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరు కపూర్ సినిమాలు. లవ్ స్టోరీ సినిమాల్లో హీరోగా నటించి సక్సెస్ అయిన రణధీర్ కపూర్‌కు నిజ జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. రాజ్‌కపూర్ సినిమా సంగమ్ షూటింగ్‌లోనే రణధీర్ కపూర్ బబితను చూసి ప్రేమించాడు. ఆ ప్రేమ పార్కులు పాటలు షికార్లు తిరిగి ఫైనల్‌గా పెద్దల ఆమోదంతో పెళ్లి దాకా వచ్చింది. ఇరువైపులా పెద్దలు అంగీకరించడంతో 1971 నవంబర్‌లో వారిద్దరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కరీనా కపూర్, కరిష్మా కపూర్. కొంతకాలం అన్యోన్యంగా గడిచిన రణధీర్ కాపురంలో క్రమేపీ కలతలు మొదలయ్యాయి. ఆఖరికి 1988 లో రణధీర్‌కపూర్ బబిత నుంచి విడిపోయాడు. అయితే అధికారికంగా విడాకులు మాత్రం ఇవ్వలేదు. కరీనా, కరిష్మాలు తల్లి దగ్గరే పెరిగి బాలీవుడ్‌లో సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా నిలదొక్కుకున్నారు.
తిరిగి ఇన్నేళ్లకు పిల్లల చొరవతో రణధీర్ దంపతులు కలిసిపోయారు.
ఈ నేపథ్యంలో కరీనా బార్హాదత్‌లో మాట్లాడుతూ ‘35 సంవత్సరాల తర్వాత తమ తల్లితండ్రులు తిరిగి కలిసిపోవడం ఆనందంగా ఉందని.. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడు అవసరమన్నారు. తాము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మగతోడు లేకపోయినా తమ తల్లి ధైర్యంగా తమను పెంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి బాట వేశారని ఆమె చెప్పారు.
రణధీర్‌కపూర్ కూడా బబితతో తిరిగి తన కలయిక గురించి మాట్లాడుతూ ‘తిరిగి బబిత.. నేనూ కలవడం సంతోషంగా ఉంది.. మొదట్లో మా సంసారం అన్యోన్యంగా గడిచినా నేను తాగి వస్తానని బబిత నా మీద కోపంతో దూరం అయ్యింది.. మళ్ళీ ఇన్నాళ్లకు పిల్లలు మా ఇద్దర్నీ కలిపారు’.. అని సంతోషం వ్యక్తం చేశారు.
ఏదిఏమైనా 35 సంవత్సరాల ఎడబాటు తర్వాత రణధీర్‌కపూర్ దంపతులు తిరిగి కలిసిపోవడం పట్ల ఆయన అభిమానులు హర్షం వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం రణధీర్‌కపూర్ వయసు 78 సంవత్సరాలు.!
పరేష్ తుర్లపాటి
Comments