కమీషన్లు లేని ఆర్ధిక కార్యకలాపాలు
స్పర్ధలకు తావులేని మోనోపలి
నగరంలో బీఎన్‌ఐ కాంక్లేవ్
‘సత్యం’తో ఈడీ చంద్రమౌళి, డీసీ షర్మిళ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార రిఫెరల్ సంస్థ. అమెరికాలో ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయింది. ప్రపంచంలోని 79 దేశాల్లో సుమారు 10,900 చాప్టర్లలో 3 లక్షల మంది కంటే ఎక్కువ సభ్యులు ఉన్నారు. దేశంలో 20 ఏళ్ల క్రితం ప్రారంభమై 132 పట్టణాల్లో ఈ సంస్థ వ్యాపార రిఫెరల్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.. టెక్నాలజీకి సంబంధించిన సేవలు, సాఫ్ట్‌వేర్లు, కంప్యూటర్లు, మానవ వనరుల సేవలు, అకౌంటింగ్ ప్రొఫెషనల్ సేవలు, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్, ఎలివేటర్లు, ఫర్నిచర్, ఇన్సూరెన్స్, ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, డెంటల్, న్యాయవాదులు, పార్టీ ప్లానర్లు, క్యాటరర్లు, ప్లంబింగ్, ట్రావెల్స్, ప్రింట్‌ంగ్, ఫోటోగ్రాఫర్ తదితర మానవ సంబంధాలు కలిగిన వ్యక్తిగా, వ్యాపార, వాణిజ్యం చేస్తున్నవారు సభ్యులుగా బీఎన్‌ఐలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు వెలకట్టలేనివి. బీఎన్‌ఐలో ప్రతి సభ్యుడు ఒకరికొకరు రిఫెరల్ ఇచ్చుకోవడం, ఇతర సభ్యులందరికీ మద్దతుగా నిలవాలనే లక్ష్యంతో పని చేస్తుండడం వల్ల వివిధ రకాల వ్యాపార భాగస్వామ్యులందరికీ ఆర్ధిక ప్రయోజనం సమకూరడం, వ్యాపారం వృద్ధిచెందడంతో పాటు కార్యకలాపాలు విస్తారమవుతాయి. సంస్థ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకువెళ్లి వ్యాపార, వాణిజ్యవేత్తలను భాగస్వామ్యం చేయడానికి నగరానికి చెందిన వీఎస్‌ఆర్ గ్రూప్ సమర్పణలో బీఎన్‌ఐ శ్రీకాకుళం, విజయనగరం రీజియన్ ఆధ్వర్యంలో బిజినెస్ నెట్‌వర్క్ కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తున్నట్టు బీఎన్‌ఐ ఈడీ ఎం.చంద్రమౌళి, డీసీ ఊణ్ణ షర్మిళ తెలిపారు. ఈ సందర్భంగా ‘సత్యం’తో వారిద్దరూ ముచ్చటించారు.
ప్రశ్న: బీఎన్‌ఐ కార్యకాలాపాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు?
జవాబు: బీఎన్‌ఐ అంటే బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్. ఇది వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, విస్తరించడానికి, ప్రమోట్ చేసుకోవడానికి, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి చక్కటి వేదిక. వ్యాపారాభివృద్ధికి చుక్కాని లాంటిది. దీన్ని వివిధ రకాల వ్యక్తిగత వ్యాపారాల సమూహం అనొచ్చు. జిల్లాలో మూడున్నరేళ్ల క్రితం ప్రారంభించాం. శ్రీకాకుళం ప్రధాన కేంద్రంగా దీన్ని ముందుకు నడుపుతున్నాం. ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలో రెండు చాప్టర్లు (గ్రూప్స్)లో 30 మంది చొప్పున 60 మంది ఉన్నారు.
ప్రశ్న: బీఎన్‌ఐ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?
జవాబు: బీఎన్‌ఐలో సభ్యుడిగా చేరివారెవరూ ఎవరికీ కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అస్సలు కమీషన్ అన్న మాటకు తావే లేదు. గివ్స్ గెయిన్ ఫార్ములాను అనుసరించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున వ్యాపారం విస్తరించడానికి, వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇందులో సభ్యులుగా పోటీ వ్యాపారాలను అనుమతించం. మీరు ప్రింట్ ఏజెన్సీ అయితే, మీరు బీఎన్‌ఐలో ప్రింట్ సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే అవుతారు. మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా, మార్కెటింగ్ ఏజెన్సీ అయినా ఒక చాప్టర్‌లో ఒక్కరు మాత్రమే ఉంటారు. దీనివల్ల పోటీ వ్యాపారం జరగడానికి వీలుండదు. దీనివల్ల బీఎన్‌ఐలో ఉన్న వ్యాపార భాగస్వామ్యుల మధ్య సహృద్భావ వాతావరణం కలిగి ఉంటుంది.
ప్రశ్న: బీఎన్‌ఐ మోడల్ ఇక్కడ సూట్ అవుతుందా?
జవాబు: వినియోగదారులకు వివిధ రకాలైన సేవలను, అవసరాలను ఒక్కచోట నుంచే పొందే వీలు కలిగించేలా బీఎన్‌ఐ కార్యకలాపాలు రూపొంది ఉంటాయి. బీఎన్‌ఐలో సభ్యులుగా చేరిన వ్యాపారులు దేశం, రాష్ట్రం, ప్రాంతంలోని స్థానిక సంప్రదాయ పద్ధతులను అనుసరించి వ్యక్తిగత వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. బీఎన్‌ఐలో సభ్యులుగా చేరినవారంతా ఒక ప్రాంతానికి చేందినవారై పూర్తిస్థాయి నెట్‌వర్క్ కలిగి ఉంటారు. అలా ఉండం వల్లనే వ్యాపారుల మధ్య రిఫరల్ కార్యకలాపాలు నిత్యం జరుగుతుంటాయి. దీనివల్ల వ్యాపారం పెరిగి విస్తరించడానికి అవకాశం కలుగుతుంది. స్థానిక మార్కెట్‌లో కస్టమర్లకు విస్తృతమైన సేవలు అందించే అవకాశం కలుగుతుంది.
ప్రశ్న: బీఎన్‌ఐలో ఎవరు సభ్యత్వం తీసుకోవాలి?
జవాబు: చాలా తక్కువ మొత్తంతో ఒక వ్యాపార సమూహంలో చేరడానికి అవకాశం కల్పిస్తుంది. సేవా ఆధారిత చిన్న వ్యాపారాలు, సమాజానికి సేవ చేసే పెద్ద వ్యాపారాల కమ్యూనిటీ శాఖలు బీఎన్‌ఐలో సభ్యులుగా చేరడం వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. బిజినెస్ నెట్‌వర్క్‌ను అంచనావేసి సభ్యత్వానికి సిఫార్సు చేస్తాము. చేస్తున్న వ్యాపార రకాన్ని బట్టి, కస్టమర్ జీవితకాల సేవా ఆధారిత వ్యాపారాలు బీఎన్‌ఐలో సభ్యులుగా ఉంటారు. పెట్టుబడిపై రాబడిని పొందడానికి వ్యాపారుల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో రిఫరల్‌ను వాడుకుంటారు. శ్రీకాకుళం నగరం కేంద్రంగా ప్రారంభమై కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఎన్‌ఐ పనితీరును పరిశీలిస్తే ఇందులో చేరితే ఎలాంటి ప్రయోజనం పొందవచ్చో తెలుస్తోంది.
ప్రశ్న: బీఎన్‌ఐలో సభ్యుత్వం పొందిన తర్వాత?
జవాబు: వ్యాపారులు మధ్య పరస్పరం పంచుకున్న అంశాలను ఆలోచించి, ప్రయోజనాలను ప్రతివారం సభ్యులంతా సమావేశమై విశ్లేషణ చేస్తుంటాము. తమను తాము మార్కెట్ చేసుకోవడం, వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంలో సహాయపడటంపై దృష్టి సారించడానికి బీఎన్‌ఐ ఒక వేదికగా పని చేస్తుంది. బీఎన్‌ఐ సభ్యుడిగా కొనసాగే సమయం పెట్టుబడికి విలువైనదిగా నమ్ముతాం. ప్రతి సభ్యుడు బీఎన్‌ఐ కోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. వారానికి కనీసం 90 నిమిషాల సమావేశం ఉంటుంది. ఈ సమావేశాల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, నూతన సభ్యుడిని చేర్చుకోవడం, ఆసక్తికరమైన వ్యక్తులు వచ్చి వారి వ్యాపార అనుభవాలను, రిఫరల్, ప్రమోషన్ వల్ల కలిగిన ప్రయోజనాలు చర్చించుకొనే అవకాశం ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి, పంచుకోవడానికి ప్రతి సభ్యుడు ప్రతివారం నిర్వహించే బిజినెస్ ఆర్గనైజేషన్‌కు కచ్చితంగా హాజరవుతారు.
ప్రశ్న: బిజినెస్ నెట్‌వర్క్‌ంగ్ కాన్‌క్లేవ్ ఎలా నిర్వహిస్తున్నారు?
జవాబు: బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎస్‌ఐ) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం రీజియన్ పరిధిలో బిజినెస్ నెట్‌వర్కింగ్ కాన్‌క్లేవ్‌ను ఈ నెల 9న స్థానిక 80 అడుగుల రోడ్డులో ఉన్న బృందావనం ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచే నిర్వహిస్తున్నాము. దీన్ని నిర్మాణ, రియల్ ఎస్టేల్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఊణ్ణ సర్వేశ్వరరావు (వీఎస్‌ఆర్) గ్రూప్ స్పాన్సర్ చేస్తుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి 300 మంది హాజరవుతున్నారు. ఇప్పటికే అందరూ వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జిల్లా చరిత్రలో మొట్టమొదటి అతి పెద్ద బిజినెస్ నెట్‌వర్క్‌ంగ్ కాన్‌క్లేవ్ జరగబోతుంది. గ్రూప్ చర్చల ద్వారా హాజరయ్యే ప్రతినిధులంతా వివిధ అంశాలపై చర్చించుకుంటారు. కొత్త కష్టమర్లను ఆకర్షించి, బిజినెస్ పెంచుకోవాలనే ఆలోచనతో వచ్చేవారికి ఇది సదవకాశం. బిజినెస్ విజిబిలిటీ దొరుకుతుంది. బిజినెస్‌ను ప్రమోట్ చేసుకోవచ్చు. బిజినెస్‌లో పరస్పరం సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి వ్యాపారులకు అవకాశం కలుగుతుంది. వ్యాపార విస్తరణలో, వృద్ధి చెందడంలో ఎదురయ్యే సవాళ్లు, అందిపుచ్చుకొనే అవకాశాలపై చర్చ జరిగింది.
ప్రశ్న: కాన్ క్లేవ్‌లో ఎటువంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు?
జవాబు: ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించనున్నాము. ఇందులో ప్రముఖంగా వీఎస్‌ఆర్ వెంకట సాయి ఇన్‌ఫ్రా, వీఎస్‌ఆర్ గాయత్రీ టౌన్‌షిప్, టీఆర్‌జే ట్రేడర్స్, విజయలక్ష్మీ ప్రొఫైల్స్, వీఎస్‌ఆర్ ఆన్ ఎంటర్‌ప్రైజెస్, వీఎస్‌ఆర్ శివశక్తి ఏజెన్సీస్, ఎస్‌వీఎన్ బే పార్క్, వెకా యూపీవీసీ, శివసాయి ఎంటర్ ప్రైజెస్ (ఏషియన్ పెయింట్స్), గజానన్ సిరామిక్, జేడీ కన్‌స్ట్రక్షన్స్ అండ్ హోం సర్వీసెస్, స్కిన్ మెడ్, అభయ హాస్పిటల్, విబ్‌గొర్ పెబ్ స్టాల్స్ ఏర్పాటుచేసి వారి ప్రొడక్ట్స్ అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తున్నాము.
Comments