top of page

20 టీమ్‌లు.. 412 శాంపిల్స్

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 3 hours ago
  • 2 min read
  • కాలువ మీద కనెక్షన్లు తొలగింపు

  • రంగంలోకి దిగిన ఈఎన్‌సీ, ఎసఈ, ఈఈ

  • సాయంత్రానికి చేరనున్న మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

  • వెయ్యి శాంపిల్సే టార్గెట్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

యుద్ధ ప్రాతిపదికన అనే పదానికి సజీవ సాక్ష్యం చూడాలంటే.. గడిచిన నాలుగు రోజులుగా గోల్కొండ రేవు రోడ్డు, దమ్మలవీధి, మొండేటివీధి, మంగువారితోట ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య, కుళాయి పనులను చూపిస్తే సరిపోతుంది. డయేరియాకు ప్రాథమిక కారణం నీరు కలుషితం కావడమేనని తేలడంతో గురువారం నుంచి 20 టీమ్‌లు కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాలువల మీదుగా వెళ్తున్న కుళాయి కనెక్షన్లను పూర్తిగా తీసేసి కొత్తవాటిని వేస్తున్నారు. ఇందులో ఒక్కో టీమ్‌కు ఒక ఏఈ, ఫిట్టర్, 10 మంది టెక్నీషియన్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఎక్కడైతే కాలువల మీదుగా పైప్‌లైన్లు వెళ్తున్నాయో, వాటిని తీయిస్తున్నారు. స్వయంగా రాష్ట్ర ఈఎన్‌సీ, ఎసఈ, ఈఈలు పర్యవేక్షిస్తున్నారు. సుడా ఈఈ సుగుణాకర్ డీఈగా ఉన్నప్ప్పుడే మున్సిపాలిటీ పరిధిలో 24 గంటల వాటర్ ప్రాజెక్ట్ అమలులోకి రావడంతో ఆయనకు దీనిపై పూర్తి పట్టు ఉంది. ఈ వాటర్ ప్రాజెక్ట్ డిజైనింగ్ దగ్గర్నుంచి శివారుకు నీరు వెళ్లేవరకు ప్రతీ అంశంలోనూ సుగుణాకర్ సూచనలు ఉన్నాయి. దీంతో ఆయన్ను పట్టుకొని పబ్లిక్ ఎసఈ, ఈఎన్‌సీలు రంగంలోకి 20 టీమ్‌లు దించారు. వీరంతా ఎక్కడికక్కడ కాలువల్లోను, కల్వర్టుల కింద ఉన్న పైప్‌లైన్లను తీసేస్తున్నారు. వెంటనే దీనికి ప్రత్యామ్నాయ లైన్ వేస్తున్నారు. గురువారం 412 చోట్ల నీటి శాంపిల్స్ తీసి శ్రీకాకుళం ల్యాబ్‌లో టెస్ట్ చేశారు. ఇందులో ప్రాథమికంగా ఎటువంటి హానికలిగించే బ్యాక్టీరియా అవశేషాలు కనిపించలేదు. కాబట్టి కార్పొరేషన్ నీటి సరఫరాను పునరుద్ధరించవచ్చు. కానీ ఆ పని చేయడంలేదు. మరింత క్లారిటీతో ముందుకు వెళ్లాలని యంత్రాంగం భావిస్తోంది. 37 శాంపిల్స్‌ను విశాఖపట్నంలో ఉన్న రీజనల్ ల్యాబ్‌కు పంపారు. అలాగే ప్రభుత్వం తరఫున వచ్చినవారు 50 శాంపిల్స్ అదనంగా తీసుకొని ఇదే రీజనల్ ల్యాబ్‌కు వెళ్లారు. మొత్తంగా వెయ్యి చోట్ల శాంపిల్స్ తీసి, అన్నింటిలోనూ నెగెటివ్ వస్తే, అప్ప్పుడు నీటిని సరఫరా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈలోగా ఎక్కడికక్కడ నీటిని పరీక్షించడం కోసం మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ను రంగంలోకి దించారు. ఇది గురువారం సాయంత్రం నాటికి శ్రీకాకుళం చేరుతుంది. ప్రతీ లైన్ దగ్గర నీటి శాంపిల్‌తో పరీక్షించి నీరు విడిచిపెడతారు. అలాగే మెయిన్ పైప్‌లైన్ ఎండ్ వాల్వ్‌ను క్లియర్ చేసి, మెయిన్ లైన్‌ను కూడా శుభ్రం చేయడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఉన్న జేసీ అసిస్టెంట్ కలెక్టర్ ఫధ్వీరాజ్ కుమార్‌ను వెంటబెట్టుకొని మంగువారితోట పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 5 గంటలకే శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టించారు. హెల్తాఫీసర్‌ను పిలిపించి దగ్గరుండి ఆ ఏరియాను క్లియర్ చేయించారు. డయేరియా అంటువ్యాధి కావడంతో నగరంలో అనేక చోట్లకు ఇది వ్యాపించింది. అయితే ఇప్పటికే దీనిపై ప్రజలకు ఒక అవగాహన రావడంతో కొద్దిపాటి లక్షణాలు కనిపించినా డాక్టర్లను సంప్రదిస్తున్నారు. దీనివల్ల ప్రాణ నష్టం తగ్గింది. కానీ ఎక్కడైతే డయేరియా ప్రబలిందో, ఆ ప్రాంతంలో మాత్రం తినుబండారాల హÃటళ్లను, రోడ్డు మీద స్టాళ్లను మూయించకపోవడం వల్ల ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. నీటి ద్వారా కాకుండా ఆహార పదార్ధాల ద్వారా సోకడం వల్ల కూడా చనిపోతారన్న విషయం ఎంహెచ్‌వో సుధీర్‌కుమార్‌కు తెలియకపోవడం విడ్డూరం. అసలే ఇరుకు ప్రాంతమైన గోల్కొండరేవు రోడ్డులో మళ్లీ ఒక్కరికి డయేరియా సోకినా పరిస్థితి అదుపు తప్ప్పుతుంది. అంతా కంట్రోల్‌లోకి వచ్చేవరకైనా ఈ ప్రాంతాల్లో హÃటళ్లు, బళ్ల మీద టిఫిన్ సెంటర్లు మూయిస్తే బాగుంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇవన్నీ డీఎంహెచ్‌వో, లేదా ఎంహెచ్‌వో చూసుకోవాల్సిన వ్యవహారం. దీనికి కూడా కలెక్టరే చెప్పాలనుకోవడం అవివేకం.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page