పండగలొచ్చాయ్.. పదండి తనిఖీకి
- BAGADI NARAYANARAO

- 1 day ago
- 2 min read
శాంపిల్స్ వెళ్తున్నా రిపోర్టులు రావడంలో జాప్యం
నీరు, పాలు అంతా కల్తీమయం
అరకొర సిబ్బంది, అంతంత మాత్రం సోదాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అరసవల్లిలో అసిరితల్లి ఉత్సవాల సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్‌స్టాల్స్‌లో 11 స్టాల్స్‌ని సోమవారం తనిఖీ చేశారు. ఎఫఎసఎసఎఐ అనుమతి లేని హానికర రంగులు వినియోగిస్తున్నారని నిర్ధారించి షుగర్ క్యాండీని, ముడిసరుకులను ధ్వంసం చేశారు.
శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో ఇటీవల గ్రామ దేవత ఉత్సవాల్లో బాదం మిల్క్ సేవించిన కొందరు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై స్పందించిన ఉన్నతాధిóకారులు బాదం మిల్క్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు చేయించాలని ఆహార కల్తీ నియంత్రణ అధికారులకు ఆదేశించడంతో ల్యాబ్ పరీక్షలు నిర్వహించి కల్తీ జరిగినట్టు ధ్రువీకరించారు. అంతకు ముందు శ్రీకాకుళం నగరంలో ప్రuలిన డయేరియాకు తాగునీరే కారణమని గుర్తించి హైదరాబాద్‌లోని విమ్‌జా ల్యాబ్‌లో పరీక్షించగా ఈకోలీ బ్యాక్టీరియా ఉందని తేలింది. దీంతో ఎచ్చెర్ల, శ్రీకాకుళం నగరంలోని ఎంపిక చేసిన ఆరు ఆర్‌వో ప్లాంట్‌ల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. వీటికి సంuంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.
సింగుపురంలో బాదం మిల్క్‌లో కల్తీ జరిగి పలువురు అస్వస్థతకు గురి కావడంతో జిల్లావ్యాప్తంగా బాదంమిల్క్ తయారుచేస్తున్న వారందరి నుంచీ శాంపిల్స్ తీశారు. టెక్కలి డివిజన్‌లో నాలుగు శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. రాజమండ్రిలో పాలలో కల్తీ కారణంగా పలువురు మతిచెందడంతో జిల్లాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. పాల ఉత్పత్తిదారులు నుంచి శాంపిల్స్ సేకరించారు. పదుల సంఖ్యలో శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించి రిపోర్టు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
అధికారులు ఉదాశీనం
రాష్ట్రంలో ఎక్కడో ఒక సంఘటన జరిగితే జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హడావుడి చేయడం తప్ప కల్తీ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో సహాయ ఫుడ్ కమిషనర్‌తో పాటు, ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఒక్కో డివిజన్‌లో 15 మండలాలకు ఒక ఇన్‌స్పెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆహారంలో కల్తీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు వారంలో నాలుగు రోజులు కోర్టుకు హాజరు కావడంతోనే సమయం సరిపోతుంది. సిబ్బంది కొరత, అరకొర వసతులు కారణంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయడానికి అవకాశం లేకుండా పోతుందని అధికారులు చెబుతున్నారు. తామంతా పని చేస్తున్నామని చెప్పడానికి వారంలో ఒకరోజు తనిఖీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారని విమర్శలున్నాయి.
జిల్లాలో ఫుడ్ లైసెన్స్ కలిగి ఉన్న రెస్టారెంట్‌లు, హÃటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, దాబాలు సుమారు 1950 వరకు ఉన్నాయి. వీటికి అదనంగా తోపుడుబళ్లు, ఫుడ్ ఆన్ వీల్స్ పేరుతో నడుపుతున్న సంచార ఆహార కేంద్రాలు ఉన్నాయి. ఆహార విక్రయ కేంద్రాలకు అనుమతి ఇవ్వడానికి మూడు రకాల ఫుడ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఏడాదికి రూ.12లక్షలు లోపు టర్నోవర్ కలిగి ఉన్నవాటికి రూ.100, రూ.12 లక్షలు పైబడిన వ్యాపారులకు నెలకు 2 నుంచి రూ.5 వేలు చెల్లించాలి. రూ.20 కోట్లు టర్నోవర్ దాటితే రూ.7,500 చెల్లించాలి. ఇలా అనుమతి తీసుకొని వ్యాపారం చేస్తున్నవారి సంఖ్య జిల్లాలో వందల్లోనే ఉన్నాయి.
అపరాధ రుసుముతో సరిపెడుతున్నారు
శ్రీకాకుళం డివిజన్‌లో జనవరి నుంచి ఇప్పటి వరకు 10 కేసులు నమోదు చేశారు. కాలపరిమితి దాటిన, దుకాణాల్లో విక్రయించకూడని ఆహార పదార్ధాలు ఉన్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. రెస్టారెంట్లు, కిరాణాషాపుల్లో దాడుల చేసి ఆరు శాంపిల్స్ సేకరించి వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. సేకరించిన శాంపిల్స్ ల్యాబ్‌కు పŸంపించి రిపోర్టు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కల్తీని నిర్ధారించే ల్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో అందరూ హైదరాబాద్‌లోని విమ్‌జా ల్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో రిపోర్టులు ఇవ్వడానికి వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
టెక్కలి డివిజన్‌లో 2025 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 15 కేసులు మాత్రమే నమోదు చేశారు. వీటి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తే.. ఏడు కేసుల్లో అన్‌సేఫ్‌గా, మిగతా 8 కేసుల్లో సబ్ స్టాండర్డ్‌గా రిపోర్టులు వచ్చాయి. వీటిని క్రిమినల్, జేసీ కోర్టుల్లో విచారిస్తున్నారు. ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టులో అన్‌సేఫ్ అని తేలితే క్రిమినల్ కేసు నమెదు చేయాల్సి ఉంటుంది. సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండ్, మిస్ లీడింగ్ అని తేలితే జేసీ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కోర్టులో కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయితే జైలుశిక్షతో పాటు అపరాధ రుసము వసూలు చేస్తారు. జేసీ కోర్టులో కేవలం అపరాధ రుసుము మాత్రమే వసూలుచేస్తారు. ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హÃటల్స్, రెస్టారెంట్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ట్రేడర్స్, హÃల్‌సేల్, షాపింగ్‌మాల్ నిర్వాహకులు పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే ఆహార కల్తీ విచ్చలవిడిగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. కేసులు నమోదు చేస్తున్నా విచారణ పేరుతో కాలం గడిచిపోతుంది. కల్తీ జరిగినట్టు నిర్ధారణ జరిగినా అపరాధ Šరుసుము వసూలుచేసి విడిచిపెడుతున్నారు. దీంతో ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఆహారాన్ని కల్తీ చేసి వ్యాపారం సాగిస్తున్నారు.






Comments