ANMల ప్రమోషన్.. ఓ జీడిపాకం సీరియల్
- Prasad Satyam
- 5 hours ago
- 2 min read
డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొందరు బలికావడం ఖాయం
కమిషన్ చెప్పినా కదలని యంత్రాంగం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఏఎనఎం గ్రేడ్`3 ప్రమోషన్ల వ్యవహారం తెలుగులో ఓ జీడిపాకం సీరియల్‌లా సాగుతునే ఉంది. ముందురోజు ఎపిసోడ్ ఎక్కడ ముగిసిందో, మరుసటి రోజు కూడా అక్కడే ఆగిపోవడం మనకు తెలుసు. ఇప్ప్పుడు ఈ వ్యవహారం కూడా సరిగ్గా అలాగే ఉంది. మొగలిరేకులు, కార్తీకదీపం లాంటి హిట్ సీరియల్స్‌కు మించి ఏఎనఎంల ధారావాహిక రక్తికట్టిస్తుంది. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి కలెక్టర్‌కు, అక్కడి నుంచి వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌కు, మధ్యమధ్యలో జాతీయ ఎస్టీ కమిషన్‌కు వెళ్లి వస్తున్న ఈ కథకు మాత్రం ముగింపు దొరకడంలేదు. 2019లో వైకాపా ప్రభుత్వం సచివాలయాల్లో హెల్త్ సెక్రటరీల పేరుతో ఏఎనఎంలను నియమించింది. వీరికి తదనంతర కాలంలో గ్రేడ్`3 ఏఎనఎంలుగా పదోన్నతి ఇవ్వాలి. ఆ తర్వాత వీరు వైద్యఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న గ్రేడ్`2, గ్రేడ్`1లతో పాటు అనేక మెట్లు ఎక్కుతారు. అయితే ఈ గ్రేడ్`3 పదోన్నతులు కల్పించడంలో తయారుచేసిన జాబితాకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదనేది ఎస్టీ అభ్యర్థుల ఆరోపణ. నిబంధనల మేరకు ఎస్టీలకు రావాల్సిన పోస్టులు రాలేదని వీరు చెబుతున్నారు. కాదు.. ఇంతకు ముందు తీసిన పోస్టుల్లో ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చేశామని, దీనికి ఇవ్వనవసరం లేదంటూ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉద్యోగులు చెబుతున్నారు. వీరు అనుకున్న మేరకు తయారుచేసిన జాబితాను కలెక్టర్ ఆమోదించేశారు కాబట్టి, తాము అన్నీ సవ్యంగానే చేసినట్లు లెక్క అని వైద్యఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కానీ జనరల్ కోటాలో వచ్చిన ఎస్టీలు, ఎస్సీలు తప్ప రిజర్వేషన్‌లో ప్రమోషన్లు ఇవ్వలేదని, లెక్కప్రకారం ఆరు శాతం ఎస్టీలకు పదోన్నతులు ఇవ్వాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఎస్టీల ఆరోపణ నిజమేనని, ఆ మేరకు రిజర్వేషన్ పాటించాలంటూ ఎస్టీ కమిషన్ ఓసారి ఆదేశించింది. కానీ డీఎంహెచ్‌వో వర్గాలు మాత్రం ఆమేరకు జాబితాను మార్చలేదు. దీంతో మరోసారి ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈసారి ఏకంగా రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరబ్‌గౌరే ఢిల్లీ వెళ్లి మరీ ఎస్టీ కమిషన్ ముందు హాజరయ్యారు. అక్కడ కూడా ఎస్టీ కమిషన్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై 20 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరబ్‌గౌర్‌కు ఆదేశించారు. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలులో జాప్యం జరగడంపై కూడా తప్ప్పుపట్టారు. సీనియారిటీ జాబితాలో నాలుగు డబుల్ ఎంట్రీలు, 25 మంది ఉద్యోగులు లోటు వంటి తప్ప్పులపై ప్రశ్నించారు. ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని స్పష్టం చేశారు. ఇది జరిగి 20 రోజులు ఎప్ప్పుడో పూర్తయిపోయింది. అయినా ఇంతవరకు ఈ రోస్టర్‌ను మార్చి పదోన్నతులు కల్పించలేదు. విచిత్రమేమిటంటే.. లేటెస్ట్‌గా ఎస్టీ కమిషన్ ముందు హాజరైన హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు డీఎంహెచ్‌వో అనిత కూడా ఉన్నారు. మొదట్నుంచీ ఈ పదోన్నతుల్లో రోస్టర్ పాటించాల్సిన అవసరం లేదనేది ఈ జాబితాను తయారుచేసిన ఉద్యోగుల వాదన. అలా కాదు.. ఎక్కడైనా ఎప్ప్పుడైనా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్‌ను తయారచేయాల్సిందేననేది ఎస్టీ కమిషన్ ముందు ఉన్న వాస్తవం. అటు డీఎంహెచ్‌వోకు గాని, ఇటు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి గాని ఇటువంటి వ్యవహారం మీద అవగాహన ఉండే అవకాశం లేదు. వీరు కాకుండా నేరుగా ఈ రోస్టర్‌ను తయారుచేసిన అధికారులనే ఎస్టీ కమిషన్ ముందు కూర్చోబెడితే ఈసరికే లెక్క సరిపోయుండేది. ఇప్ప్పుడు 154 మంది ప్రమోషన్ల జాబితాలో ఎవర్ని తీయాలో, కొత్తగా ఎవర్ని నియమించాలో తెలియక ఈ ఫైల్‌ను పూర్తిగా పక్కన పడేశారు. ఎస్టీ కమిషన్ ఇచ్చిన గడువు ముగియడంతో కచ్చితంగా దీనికి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్ప్పుడు ఎస్టీ రోస్టర్ పాటిస్తే, ఎస్సీ రోస్టర్‌ను కూడా మార్చాల్సివుంటుంది. ఈ లెక్కన జాబితా మొత్తం తలకిందులైపోతుంది. ఇప్పటికే జాబితా ప్రకటించడంతో తమకు పదోన్నతులు రావడంలో జాప్యం జరుగుతోందన్న ఆందోళన అభ్యర్థుల్లో ఉంది. ఇప్పటికే పక్క జిల్లాల్లో తమతో పాటు 2019లో రిక్రూట్ అయిన హెల్త్ సెక్రటరీలు గ్రేడ్`3 ఏఎనఎంలు అయిపోయారు. ఇలాగే కొన్నాళ్లు ఆగితే గ్రేడ్`2 కింద కూడా ప్రమోట్ అయిపోతారు. అప్ప్పుడు అంతర్ జిల్లా స్థాయికి హÃదా పెరిగితే ప్రమోషన్ల లెక్కలో మనోళ్లు వెనుకపడిపోతారు. వీటిని పట్టించుకోకుండా డీఎంహెచ్‌వో సిబ్బంది తాము పట్టిన కుందేలుకు మÖడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరించడం శోచనీయం.






Comments