అద్దెలు భారం.. వ్యాపారుల హాహాకారం!
- BAGADI NARAYANARAO

- 15 hours ago
- 2 min read
మున్సిపల్ షాపుల లీజులపై అసంతప్తి
తలకుమించిన రేట్లతో సతమతం
హేతుబధ్దీకరించాలని వ్యాపార సంఘాల వినతి
ఇతర రాష్ట్రాల్లోనే మేలంటున్న నిర్వాహకులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ కామర్స్ ప్లాట్‌ఫారాలు, కార్పొరేట్ సంస్థలు రిటైల్ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల వస్తువులు, సరుకులు.. నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేరిపోతున్నాయి. నగరాల్లో కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న మాల్స్‌లో తక్కువ ధరకే నిత్యావసరాలు లభిస్తుండడంతో సంప్రదాయ చిల్లర వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. వీటికి తోడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మరింత చేటు చేస్తున్నాయి. అటువంటి నష్టదాయక విధానాల్లో షాపుల లీజు, అద్దెల నిర్ణయం ఒకటి. స్థానిక సంస్థల పరిధిలోని షాపుల లీజు ఖరారు చేస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న ఆరోపణలు ఉండగా.. వాటికి అద్దెల నిర్ణయం కూడా లీజుదారులకు భారంగా పరిణమిస్తున్నదన్న అసంతప్తి పెరుగుతోంది. కనీస అద్దె నిర్ణయం, ఏటేటా పెంపుదల వంటి అంశాలు శాస్త్రీయంగా మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉండటంలేదని, వాటిని సంస్కరించాలన్న వ్యాపారవర్గాలను విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు తమ ఆధీనంలోని షాపులను లీజు ప్రాతిపదికన ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇస్తుంటాయి. మూడేళ్లకోసారి బహిరంగ వేలం ద్వారా లీజుదారులను ఎంపిక చేసి షాపులు కేటాయిస్తున్నారు. 1968 నుంచి ఈ విధానం అమýవుతోంది. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సమూల మార్పులతో కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దాని ప్రకారం మూడేళ్లకోసారి 33 శాతం అద్దె పెంచడంతో పాటు ఆ తర్వాత ప్రవేశపెట్టిన జీఎస్టీని కూడా వర్తింపజేసి భారీగా అద్దెలు వసూలు చేస్తుండటంపై వ్యాపారవర్గాలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాగా 2019లో వైకాపా ప్రభుత్వం పాత విధానాన్ని కొనసాగిస్తునే అప్‌సెట్ ప్రైస్ పేరుతో కొన్ని మార్పులు చేసి ఆ మేరకు అద్దెలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా షాపుల అద్దెలు ఒకేసారి ఐదు నుంచి ఎనిమిది రెట్లు పెరిగాయి. దీంతో చాలాచోట్ల షాపులు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి మన రాష్ట్రంలో తగిన మార్పులు చేసి ఉపశమనం కల్పించాలన్న డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఎట్టకేలకు దీనిపై స్పందించిన ప్రభుత్వం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని షాపుల లీజుదారులు, వ్యాపార సంఘాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. వీటి ఆధారంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నది.
మన రాష్ట్రంలో ఎక్కువ
మరోవైపు రాష్ట్రస్థాయిలో క£మిటీని నియమించి వివిధ రాష్ట్రాల్లోని స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తున్న షాపుల లీజు`అద్దె విధానాలపై ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఆ వివరాలతో కమిటీ నివేదిక ఇచ్చింది. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఏటా 5 శాతం, తెలంగాణ, మహారాష్ట్రల్లో మూడేళ్లకోసారి 10 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌లో ఐదేళ్లకు 10 శాతం అద్దె పెంచుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. మనరాష్ట్రంలో వీటన్నింటికంటే అధికంగా అద్దెలు నిర్ణయించడం వల్ల లీజుదారులు వాటిని చెల్లించలేకపోవడం, న్యాయపరమైన వివాదాలు వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి లీజు విధానమే కారణమని అధికారులు, వ్యాపార సంఘాలు ప్రతినిధులు ప్రభుత్వ దష్టికి తీసుకెళ్తున్నారు. అప్‌సెట్ ప్రైస్ పెంచిన తర్వాత చాలా చోట్ల షాపులను లీజుకు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం తీసుకురావాలన్న ఆలోచన చేయడంపై హర్షం వ్యక్తం అవుతోంది. ఈ విధానాన్ని హేతుబద్ధీకరించడంతో పాటు ఐదేళ్లకోసారి 5 శాతం అద్దె పెంచేలా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ విలువలను పరిగణనలోకి తీసుకుని అద్దెలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.
రిజిస్ట్రార్ విలువలను మించి..
జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలు, టెక్కలి, నరసన్నపేట మేజర్ పంచాయతీల్లో ఆయా స్థానిక సంస్థలకు చెందిన షాపులు 800 వరకు ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోనే పెద్దమార్కెట్, పాత బస్టాండ్, సెవెన్ రోడ్డు జంక్షన్, జీటీ రోడ్డు, అంబేద్కర్ జంక్షన్, పాత బ్రిడ్జి రోడ్డు, రైతు బజార్ తదితర ప్రాంతాల్లో 425 షాపులు ఉన్నాయి. వీటిలో 110 షాపులు ఖాళీగానే ఉన్నాయి. వీటికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అద్దెలు నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత లీజు విధానం ప్రకారం ఒక చదరపు అడుగుకు రూ.150 రేటు నిర్ణయించారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న షాపులకు రూ.20వేలు, మార్కెట్‌లో రూ.16 వేలు, సెవెన్ రోడ్డు జంక్షన్ వద్ద రూ.30 వేలు, రైతుబజార్ వద్ద రూ.18 వేలు చొప్పున నెలవారీ అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వ షాపులకు రూ.13 వేలకు తక్కువ కాకుండా అద్దెలు నిర్ణయిసŸT్తన్నారు. 2019 వరకు మార్కెట్ లోపల ఉన్న షాపునకు రూ.3,216 అద్దె చెల్లిస్తుండేవారు. అప్‌సెట్ ప్రైస్ విధానం వచ్చాక బహిరంగ వేలం ద్వారా అద్దె మొత్తాన్ని రూ.13వేలకు పెంచి వసూలు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో 2019 వరకు ఒక్కో షాపునకు రూ.7,100 చెల్లించేవారు. అప్‌సెట్ ప్రైస్‌తో కలిపి అది రూ.18,100కు చేరింది. ఇదే విధానాన్ని నగరంలో 425 షాపులకు వర్తింపజేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం మున్సిపల్ దుకాణాలకు అద్దెలు రూ.8 వేలకు మించకూడదు. అయితే దీనికి రెండు రెట్లు వసూలు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు, పెద్దమార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు కోరాడ హరిగోపాల్ అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని బుధవారం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ నిర్వహించిన సమావేశంలో హరిగోపాల్‌తో పాటు లీజుదారులు, వ్యాపార సంఘాలు నాయకులు అధికారుల దష్టికి తీసుకువెళ్లారు.










Comments