అధికారం ఉంటేనే ఆస్తిత్వం!
- DV RAMANA

- 1 hour ago
- 2 min read

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనదికాని రోజున అన్నీ తారుమారైపోతాయి. మన అనుకున్నవారే తిరగబడతారు.. తిరస్కరిస్తారు.. మనల్నే తరిమేస్తారు. దీనికి నిలువెత్తు నిదర్శనం పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే. నిన్న వరకు ఆమెను దీదీ అని పిలిచినవారే ఇప్పుడు రాజకీయంగా దిక్కులేనిదాన్ని చేశారు. రాజకీయ ఆస్తిత్వం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేలా చేశారు. ఆమె స్వయంగా స్థాపించి, సుమారు మÖడు దశాబ్దాలుగా నాయకత్వం వహించిన ఆల్ ఇండియా తృణమÖల్ కాంగ్రెస్(ఏఐటీసీ) పార్టీని ఆమెకు కాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అధ్యక్ష పదవి నుంచి తప్పించేశారు. పైగా ఆమె పట్ల చాలా ఉదారంగా ఉన్నట్లు కావాలంటే పార్టీకి గౌరవ సలహాదారుగా ఉండొచ్చని సూచించారు. ఇప్పటికే పార్టీని విడగొట్టిన అసెంబ్లీ ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనాయకులు.. సుమారు 500 మంది కోల్‌కతాలోని ఓ స్టార్ ీVAటల్ వేదికగా మమతను సాగనంపే క్రతువు నిర్వహించారు. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, తమదే అసలైన తృణమÖల్ కాంగ్రెస్ అని ప్రకటించారు. తను తయారు చేసిన నేతలే తిరుగుబాటుదారులుగా మారి తననే పార్టీ నుంచి తొలగించడం దీదీ రాజకీయ జీవితంలోనే అతిపెద్ద పరాభవంగా మిగిలిపోనుంది. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా, ఆమె నీడలా భావించే కోల్‌కతా మాజీ మేయర్ ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్, అరూప్ రాయ్ వంటి సీనియర్ నేతలు సైతం రెబల్స్ శిబిరంలోకి ఫిరాయించడం పార్టీపై ఆమె పట్టు పూర్తిగా సడలిపోయిందనడానికి తిరుగులేని నిదర్శనం. ఈ భేటీలోనే పార్టీ కొత్త ఛైర్మన్‌గా అరూప్ రాయ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే అక్కడితో అయిపోయిందనుకోవడానికి లేదు. మమతా బెనర్జీ మనస్తత్వం గురించి తెలిసినవారేవరైనా ఓటమిని ఆమె అంత తొందరగా ఒప్పుకుంటుందంటే నమ్మరు. అందుకు తగినట్లే మమత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన అధ్యక్షతన పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి.. ఆ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆగమేఘాలపై సమర్పించేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తానే కొనసాగుతున్నానని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అటు తిరుగుబాటు శిబిరం కూడా అదే రకమైన చర్యలు తీసుకుంటుంది. ఈ వివాదంపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది త్వరలో వెల్లడవుతుంది. కానీ బెంగాల్లో దీదీ శకం కొనసాగింపుపై ఆసక్తికర చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాభవం మొదలు.. పార్టీలో తిరుగుబాటు వంటి పరిణామాలతో దీదీ దాదాపు ఒంటరిగా ఆస్తిత్వ పోరాటం చేయాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ద్వారా రాజకీయాలు ప్రారంభించిన మమత అగ్రనాయకత్వంతో విభేదించి బయటకొచ్చేసి 1998 తృణమÖల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. అప్పటినుంచి అటు కాంగ్రెస్‌పైన.. ఇటు బెంగాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న కమÖ్యనిస్టులపైనా తనదైన శైలిలో ఎగ్రసివ్(దూకుడు) రాజకీయాలతో క్రమంగా ఆధిపత్యం సంపాదించారు. మొదట్లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వేమంత్రిగా వ్యవహరించినా.. తర్వాత ఆ కూటమి నుంచి కూడా బయటకొచ్చేశారు. అనేక ఆటుపోట్లు తట్టుకుని 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కమÖ్యనిస్టు కోటలను కూల్చివేసి తొలిసారి బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అక్కడినుంచి ఆమెకు తిరుగులేకుండా పోయింది. 2016, 2021 ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి ఎదురైన తీవ్ర ప్రటిఘటనను విజయవంతంగా అధిగమించి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించారు. ఇక మొన్నటి ఎన్నికల్లోనూ పార్టీని విజయం పథంలో నడిపి వరుసగా నాలుగోసారి సీఎం పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరిన ఆమెకు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత జెల్ల కొట్టింది. స్వయంగా ఆమె పోటీ చేసిన భబానీపూర్‌లోనే ఓటమి వెక్కిరించింది. అక్కడితో మొదలైన కష్టాలు ఇప్పుడు పార్టీని కూడా దూరం చేసే వరకు వచ్చాయి. ప్రాంతీయ పార్టీల్లో, ఒకటి రెండు రాష్ట్రాలకు పరిమితమైన పార్టీల్లో ఇటువంటి పరిణామాలు సహజమేనని భారత రాజకీయ చరిత్రలో చోటుచేసుకున్న అనేక పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఏకవ్యక్తి ఆధిపత్యం, కుటుంబ పెత్తనం ఉన్న పార్టీలకు ఇటువంటి చేదు అనుభవాలు తప్పదనిపిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ఎన్టీఆర్ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగసిన తెలుగుదేశం పార్టీ పరిణామాలను ప్రస్తుత తృణమÖల్ కాంగ్రెస్ సంక్షోభంతో పలువురు పోల్చి చూస్తున్నారు. సాపేక్షికంగా ఈ రెండింటి మధ్య స్వల్ప తేడాలున్నా.. స్థూలంగా చూస్తే మాత్రం రెండు సంక్షోభాలు దాదాపు ఒకేలా కనిపించకమానవు. నాడు 1994లో అఖండ మెజారిటీతో ఎన్టీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చినా ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి పెత్తనంపై అసంతృప్తితో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ మెజారిటీ ఎమ్మెల్యేల దన్నుతో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా పార్టీని సైతం ఎన్టీఆర్ నుంచి లాగేసుకున్నారు. ప్రస్తుతం తృణమÖల్ విషయంలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై అసంతృప్తితో పార్టీలో తిరుగుబాటు చెలరేగింది. అయితే ఎన్టీఆర్ ఎన్నికల్లో గెలిచి పార్టీలో ఓడిపోగా.. మమత మాత్రం అటు ఎన్నికల్లోనూ.. ఇటు పార్టీలోనూ పరాభవం పాలయ్యారు. అలాగే తమిళనాడులో ఎంజీఆర్ మరణానంతరం ఏఐఏడీఎంకేలోనూ దాదాపు ఇలాగే జరిగింది. పార్టీ, ప్రభుత్వ ఆధిపత్యం కోసం ఎంజీఆర్ సతీమణి జానకీరామచంద్రన్, శిష్యురాలు జయలలిత మధ్య జరిగిన పోరాటంలో చివరికి జయలలిత నెగ్గి తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన, యÖపీలో సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభాలను కూడా తృణమÖల్ పరిణామాలను పోలినవే.






Comments