అన్నేళ్ల అనుభవం ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
- Prasad Satyam
- 3 hours ago
- 4 min read
ఆధార్ నుంచి బంధుత్వాల వరకు అన్నీ ఫేక్
దొంగ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లు
రూ.4 కోట్ల భూభాగోతంలో మాజీ స్పీకర్‌పై బిగుస్తున్న ఉక్కుపాశం
సివిల్ వివాదం కాదు.. ఇది తీవ్రమైన క్రిమినల్ నేరం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భుకబ్జా పన్నాగం వేశారంటూ శ్రీకాకుళం పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్ప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దాదాపు రూ.4 కోట్లు విలువ చేసే భూమిని సీతారాం కుటుంబం అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించడంతో ఇప్ప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్‌టాపిక్. ఈ భూభాగోతంలో సీనియర్ పొలిటీషియన్, రాష్ట్రమంత్రిగా, స్పీకర్‌గా సుదీర్ఘ కాలం ప్రోటోకాల్ పోస్టులో ఉన్న సీతారాం చిన్న చిన్న లాజిక్‌లు మిస్సయిపోయారు. కథ పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఈనాడు, జ్యోతి స్టేట్ పేజీలో దీన్ని ప్రచురించగా, సోషల్ మీడియాలో ఆదివారం పోలీసులు ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ విపరీతంగా ట్రోలవుతోంది. కాబట్టి సీతారాం కుటుంబం ఏ మేరకు నిబంధనలను పట్టించుకోలేదో, లేదూ కావాలని కాలరాసిందో చర్చించే ప్రయత్నమే చేద్దాం.
స్థానిక బలగమెట్టు దగ్గర 1988లో సత్యసాయి నగర్ పేరుతో లేఅవుట్ వేశారు. దీని మీద నుంచే ఆ తర్వాత సిద్ధిపేటకు కూడా రోడ్డు వేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, పూర్తి చేశారు. ఈ సత్యసాయి నగర్ లేఅవుట్‌నే స్థానికంగా వరం కాలనీ అని పిలుస్తారు. ఎందుకంటే.. ఈ లేఅవుట్ వేసింది అంధవరపు గోవిందరాజులు (గోవు), అతని సోదరులు. అంటే శ్రీకాకుళం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పని చేసి కరోనాలో మరణించిన వరం కూడా గోవిందరాజులు సోదరుడు కావడంతో రాజకీయంగా వరం ఫెమిలియర్ కావడం వల్ల ఇది వరం కాలనీగా గుర్తింపు పొందింది. ఇప్ప్పుడు సరిగ్గా అదే వరం కాలనీలో సర్వే నెంబరు 35/13లో 84, 85, 86 ప్లాట్లను కట్టా కనకలింగేశ్వరరావు కొన్నారు. కుమారుడి ఉద్యోగం రీత్యా ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఇప్ప్పుడు ఇదే స్థలంలో ప్రహరీ నిర్మిస్తూ సీతారాం కుటుంబం పోలీసులకు చిక్కింది.
ఈ లేఅవుట్ వేసిన అంధవరపు గోవిందరాజులు (గోవు) మరణించారని, ఆయనకు ఒకే ఒక్క వారసురాలు అంధవరపు రజనీ ఉందని, ఆమె నుంచి తాము 2023 ఏప్రిల్ 13న 570 గజాలు, 2023 ఆగస్టు 23న 352 గజాలు మొత్తం 922 గజాల స్థలాన్ని సీతారాం తనయుడు నాని పేరుతో జీపీ చేయించుకున్నారు. ఇక్కడే అసలు లాజిక్‌ను సీతారాం మిస్సయ్యారు. అంధవరపు గోవు కుటుంబం రాజకీయాల్లోనే ఉంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే పరామర్శకు వెళ్లేంత సాన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా గోవు సోదరుడు సూరిబాబు వైకాపాలో సీతారాంకు కూడా కావాల్సిన మనిషిగా కొనసాగుతున్నారు. అటువంటి గోవిందరాజులు మరణించాడని, ఆయనకు ఒకే కుమార్తె ఉందని, ఆమెకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉండటం వల్ల ఆమె నుంచి ఈ స్థలం కొనుగోలు చేస్తున్నట్లు చూపించారు. కేవలం రజనీ పేరుతో ఒక్క అమ్మాయే ఉన్నట్టు చూపించి, ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికెట్ దఖలుపడినట్లు సృష్టించి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం బయల్దేరడం పెద్ద తప్ప్పు. ఈ స్థలానికి, సీతారాం కుటుంబానికి ముందు నుంచి ఏ సంబంధం లేదనే కాసేపు అనుకుందాం. కానీ అంధవరపు గోవిందరాజులు, ఆయన ఏడుగురు సోదరులు కలిసి ఈ లేఅవుట్ వేశారని, ఈ మÖడు ఫ్లాట్లు ఆయన ఆధీనంలోనే ఉన్నాయని మధ్యవర్తులు అమ్మజూపినప్ప్పుడు అంధవరపు కుటుంబం అనగానే సీతారాం ఆరా తీయాల్సింది. కానీ అలా కాకుండా ఎవరో అమ్మజూపితే కొన్నామని చెప్పడం నమ్మశక్యంగా ఉండదు. పోనీ గోవిందరాజులుకు ఒక్క కూతురే ఉందని సీతారాం కుటుంబం భావించినా, ఆమె పేరు అంధవరపు రజనీ కావాలి గాని అడబాల రజనీ ఎలా అవుతుందన్న ప్రశ్న తలెత్తకపోవడం విడ్డూరం. ఏకంగా ఆమె పేరు మీద సృష్టించిన ఆధార్ కార్డు మీద అంధవరపు, అడబాల అనే ప్రస్తావన లేకుండా కేవలం ఇనీషియల్ ‘ఎ’ అని వేసినప్ప్పుడు ఆధార్‌లో ఇలా ఉండదని స్పీకర్‌గా పని చేసిన సీతారాంకు తెలియదనుకోలేం. అన్నింటికీ మించి పోలీసులు నిందితులుగా ప్రకటించిన ముఠాలో ఏ`2గా ఉన్న తెలుగు సతీష్‌కు జిల్లాలో ఎక్కడ సుదీర్ఘ కాలం ఖాళీగా కనిపించిన స్థలం ఉన్నా చేతులు దురద పుడుతుంతాయి. రూ.4 కోట్లు విలువైన భూమిని రూ.1.50 కోట్లకే సీతారాం కుటుంబానికి అమ్మజూపినట్టు ఓ ప్రచారం ఉంది. అయితే రిజిస్ట్రార్ ఆఫీసులో ఇంత పెద్ద ట్రాన్జాక్షన్‌కు ఒక చెక్ ఉండాలి. అది ఎక్కడా కనిపించడంలేదు. అందుకే అప్పటి ఆమదాలవలస రిజిస్ట్రార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ`2గా ఉన్న తెలుగు సతీష్‌కుమార్ తెర మీదకు తెచ్చిన అడబాల రజనీ అల్లుడే సాలిపిల్లి లక్ష్మణరావు. సతీష్ ఎక్కడ భూములను అమ్మినా, దానికి సాక్షి సంతకం లక్ష్మణరావు పెడుతుంటారు. ఈయనది రాగోలు. శ్రీకాకుళం నెహ్రూ రోడ్డులో టైలరింగ్ చేస్తుంటాడు. తెలుగు సతీష్ అమ్మిన ప్రతి దొంగ డాక్యుమెంట్ భూమికీ ఈయనే సాక్షి సంతకం చేస్తుంటాడు. ఈ విధంగా 77 సంతకాలు లక్ష్మణరావు చేసినట్లు తెలుస్తుంది. అంటే.. ఇప్ప్పుడు ఈ భూములు ఎవరివి, ఎవరి చేతిలోకి వెళ్లిపోయాయన్నదానిపై ఆందోళన మొదలైంది.
అంధవరపు గోవిందరాజులు వేసిన లేఅవుట్‌లో హైదరాబాద్‌లో ఉంటున్న కట్టా కనకలింగేశ్వరరావు మÖడు ప్లాట్లు కొనుగోలు చేస్తే, కనకలింగేశ్వరరావు దగ్గర్నుంచి కొనుక్కున్నట్లు దొంగడాక్యుమెంట్లు సృష్టించాలి గాని లేఅవుట్ ఓనర్ గోవిందరాజులు చనిపోయాడని, ఆయన కుమార్తె రజనీ ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ ద్వారా తమకు ఆ భూమి దఖలు పడినట్లు ఎందుకు చెప్పారు? వాస్తవానికి సతీష్ బృందం కనకలింగేశ్వరరావు డాక్యుమెంట్లే ఫోర్జరీ చేసివుండేది. కాకపోతే ఏళ్లతరబడి ఆ స్థలం తమది అంటూ ఎవరూ రాకపోవడంతో అది లేఅవుట్ వేసిన ఓనర్ వాటాకే వచ్చివుంటుందని భావించి గోవిందరాజులు చనిపోయినట్టు సృష్టించారు. అందుకోసం పాత లింక్ డాక్యుమెంట్‌ను సంపాదించారు. వరం కాలనీలో ప్లాట్ కొనుక్కున్న ప్రతీవారికి ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్ అదే కాబట్టి ఈజీగా దొరికేసింది. దాన్ని పట్టుకొని చనిపోయినట్టు మున్సిపల్ ఆఫీసులో ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ తీసుకొని, ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో గోవిందరాజులు వారసురాలంటూ ఎ.రజనీని ప్రవేశపెట్టి ఒక ఫేక్ ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ తీసుకొని ఈ తతంగం నడిపారు. వాస్తవానికి ఈ మÖడు ప్లాట్లలో సీతారాం కుటుంబం తరఫున ప్రహరీ కడుతున్నప్ప్పుడే హైదరాబాద్‌లో ఉన్న కనకలింగేశ్వరరావుకు కబురందింది. సివిల్ మేటర్ కాబట్టి, అందులోనూ పెద్ద తలకాయలున్నాయని కొందరు సలహా ఇవ్వడంతో కోర్టుకు వెళ్లారు. మరోవైపు సీతారాం తనయుడు కూడా పోలీసులు తమపై చర్యలు తీసుకోకూడదంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇది కేవలం భూమికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు. ఇందులో క్రిమినల్ చర్యలు కూడా ఉన్నాయి. బతికున్న వ్యక్తి చనిపోయినట్టు సర్టిఫికెట్ పుట్టించడం, కాని కూతుర్ని తీసుకువచ్చి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించడం వంటివి క్రిమినల్ ఇంటిమిడేషన్ కిందకు వస్తుంది. అందుకే పోలీసులు ఈ కోణంలో వారిని మాత్రమే ఆదివారం అరెస్టు చేశారు.
ఇక ఇదే తెలుగు సతీష్ అండ్ బ్యాచ్ రాగోలులో సర్పంచ్ గేదెల చెంగలరావు సోదరి ధర్మాన పద్మావతికి చెందిన భూమి మీద కూడా ఇటువంటి పన్నాగమే వేసి గ్రామస్తులకు దొరికిపోయారు. ధర్మాన పద్మావతికి బదులుగా గేదెల భానుమతి అనే ఒకామెను సృష్టించారు. ఆమె చనిపోయినట్టు ఒక డెత్ సర్టిఫికెట్ తెచ్చారు. భానుమతి వారసుడిగా గేదెల షన్ముఖ అనే వ్యక్తిని తెర మీదకు తెచ్చారు. ఆయన కూడా చనిపోయినట్టు మరో డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. వీరిద్దరికీ ఆధార్‌లు పుట్టించి, డెత్ సర్టిఫికెట్లు సృష్టించి, వారి నుంచి కొనుగోలు చేసినట్టు చూపించి పద్మావతి భూమి మీదకు వచ్చి దొరికిపోయారు. ఇక్కడా అదే చేశారు. అంధవరపు గోవిందరాజులు చనిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకొని, కుమార్తె రజనీ పేరుతో ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకొని, దాన్ని తమ్మినేని కుటుంబానికి అమ్మినట్టు చూపించారు. ఈ కథలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. అంధవరపు గోవిందరాజులు కూతురి పేరు రజనీ కాదు. ఆమె పేరు సునీత. ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఇదే గోవిందరాజులుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో సత్యనారాయణ అమెరికాలో స్థిరపడగా, మరో కొడుకు నగేష్ శ్రీకాకుళంలోనే తండ్రి వ్యాపారాలు చూసుకుంటున్నారు. పోనీ గోవిందరాజులు చనిపోయారని సీతారాం భావించినా, కుమారులు ఉన్నారా? లేరా? ఒకవేళ కుమార్తె ఒక్కరే ఉంటే ఆమె పేరేంటి? అనే విషయాలు ఆరా తీయకుండా పవరాఫ్ అటార్నీలు, కొనుగోళ్లు జరిపారంటే నమ్మేట్టు ఉండాలి కదా..!






Comments