‘అమృత’మే విషమైంది..!
- NVS PRASAD

- 22 minutes ago
- 3 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఫొటోలు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. కాలువేదో, పైప్‌లైన్ ఏదో కనిపించడంలేదు కదూ..! ఇది నిజమే. దీనికోసం చెప్ప్పుకోవాలంటే.. రాజుగారి కొడుకులు ` ఏడు చేపల కథ చెప్ప్పుకోవాలి. అంత ఉపోద్ఘాతం కంటే నగరంలో పారిశుధ్యం మెరుగుపడకపోవడానికి కారణం మున్సిపల్ హెల్త్ అధికారులదేనని చెప్పడం సులువు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని అమృత్ పథకం శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎప్ప్పుడు వచ్చిందో అప్పట్నుంచే కాలువల్లోకి తాగునీటి గొట్టాలొచ్చాయి. గొట్టాలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి కాలువలు క్లీన్ చేయలేకపోతున్నామనేది శానిటేషన్ విభాగం వాదన. ఇంటిముందు కాలువ ఉంది కాబట్టి పైప్‌లైన్‌కు మరో మార్గం లేదనేది ఇంజినీరింగ్ విభాగం వెర్షన్. ఏది ఏమైనా పై మూడు ఫొటోలు చూస్తే, మురుగు, నీరు ఎలా సహజీవనం చేస్తున్నాయో.. కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అలాగే సహజీవనం చేస్తున్నాయి.

డయేరియా పుణ్యమాని గోల్కొండరేవు పరిసర ప్రాంతాలు అద్దంలా తయారయ్యాయి. ఒకప్ప్పుడు మురికివాడగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఇప్ప్పుడు శుభ్రంగా దర్శనమిస్తుంది. ఇదే పని ముందు నుంచి చేయడానికి సలుపా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అమత్ పథకంలో వైట్ రేషన్‌కార్డు ఉన్నవారికి ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సిరావడంతో దరఖాస్తు చేసుకున్నవారందరికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఇందులో 90 శాతం మురుగు కాల్వల మీదుగానే వెళ్లాయి. శానిటేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పైపై చెత్తను తీయడం తప్ప చిన్నచిన్న కాలువలను క్లియర్ చేసే పనిని ఏరోజూ ఎంహెచ్‌వో పెట్టుకోలేదు. అందుకు సాక్ష్యం ఈ ఫొటోలే. ఇలా ఉన్నప్ప్పుడు ఈ`కోలీ కాకపోతే, మన పేగుల్లోకి గుడ్‌బ్యాక్టీరియా ఎలా చేరుతుంది? దమ్మలవీధి పరిసర ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంకుల ఔట్‌లెట్ కాలువల్లోకి ఇచ్చారని చెప్ప్పుకున్నాం. కానీ నగరంలో పశువుల మలమూత్రాలన్నింటికీ మన కాలువలే ఔట్‌లెట్. ఈ ఫొటోలో కుళాయిగొట్టాల మీద ఉన్నది ఆ పశువుల మలమూత్రాలే. ఇది ఎక్కడో కాదు.. నగరం నడిబొడ్డున ఉన్న బాకర్‌సాహెబ్‌పేటలో దశ్యాలు. ఊరిలోకి డయేరియా రాగానే మెయిన్ పైప్‌లైన్లు శుభ్రమైపోయాయి. కానీ కాలువలు మాత్రం ఇంకా ఎక్కువ శాతం అలాగే కనిపిస్తున్నాయి. ఆమధ్య.. అంటే కరోనా తర్వాత సచివాలయ సిబ్బంది కాలువల మీద ఉన్న పైప్‌లైన్లను ఎత్తులో వేయడమో, లేదూ అంటే ఎత్తు చేయించుకోండని నోటీసులు ఇవ్వడమో చేశారు. కానీ అనేకచోట్ల గొట్టాలు కాలువల్లోనే ఉన్నాయి. నాగావళి ఇన్‌ఫిల్ట్రేషన్ ట్యాంకులకు వెళ్లే నీటిలో సెప్టిక్ ట్యాంకులను క్లీన్‌చేసే ట్యాంకర్లు జరిపినాయుడుపేట వద్ద మనుషుల మలమూత్రాలను కలిపేస్తున్నాయని కథనాలు వచ్చినా ఇంతవరకు యంత్రాంగం అటువైపు ఒక అడుగు వేయలేదు. డయేరియా కట్టడైపోయింది కాబట్టి మరి అవసరం లేదనుకున్నారో, ఏమో? అయితే తెలుగుదేశం ఆరోపించినట్టు ఈ పైప్‌లైన్ల పాపం ఇప్పటిది కాదు. అమత్ పథకం అమలులోకి వచ్చిననాటి నుంచి ఉంది. అలా అని నీరే రాని ఊరికి 24 గంటలూ నీటిని అందించిన ధర్మాన ప్రసాదరావుదే ఈ పాపమనడం కూడా తప్ప్పు. ఎందుకంటే.. 2014`19లో టీడీపీ అధికారంలో ఉంది. మళ్లీ రెండేళ్లుగా కూటమి పరిపాలిస్తుంది. అప్ప్పుడైనా ఆవైపు దష్టి సారించివుంటే ఈ సమస్య వచ్చివుండేది కాదు. పాలకవర్గం లేని మున్సిపాలిటీ అంటే తల్లి లేని పిల్లాడిగా మారిపోయింది. ఎవరైనా చేరదీస్తే అన్నం, లేదంటే సున్నం లాగ పరిస్థితి ఉంది. వాస్తవానికి మొత్తం కార్పొరేషన్‌లో అతి పెద్ద మెకానిజం ఉన్నది హెల్త్ విభాగానికే. అటు మేన్‌పవర్‌లో గాని, ఇటు మిషినరీలో గానీ హెల్తాఫీసర్ కంట్రోల్‌లో ఉన్నన్ని ఆస్తులు మరో విభాగానికి లేవు. అయితే దాన్ని ఎలా వాడుకోవాలో హెల్తాఫీసర్ అలాగే వాడుకున్నారు తప్ప శానిటేషన్ కోసం మాత్రం పెద్దగా దష్టి పెట్టలేదు. నేరుగా రాజకీయ సిఫార్సుతో వచ్చిన ఆయన మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడం, కమిషనర్లకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఆయనే అన్నీ అయి వ్యవహరించారు. ఇప్ప్పుడు ఇంత జరిగిన తర్వాత తనకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదనే డాంభికాలు పలుకుతున్నారు. నగరంలో ఎక్కడికక్కడ రోడ్లపైనే పశువులను పెంచుతున్నారు. వాటి మలమూత్రాలన్నీ స్థానికులవి, పాలు, పెరుగు మాత్రం ఓనర్లవి. దీనిని ఎక్కడైనా స్థానికులు ప్రశ్నించి ఇదేం పద్ధతని అడిగితే తిరగబడుతున్నారు. మున్సిపల్ యంత్రాంగం కల్పించుకొని చర్యలు తీసుకోవాల్సిందిపోయి సినిమా చూడటం వల్లే కాలువల్లో ఈ పూడిక పెరిగిపోయింది. శంకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత వర్షపు నీరు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా నిల్వ ఉండకుండా మెయిన్ రోడ్డులో కాల్వలను క్లీన్ చేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియగా మారింది. ఒకసారి సిల్ట్ తొలగించిన కొద్ది రోజులకే అదే కాల్వల్లో అంతే మొత్తంలో చేరిపోతుందంటే కారణం పిల్లకాల్వల్లో వేసిన పేడమేటలు దాటి ప్రధాన కాలువల్లో చేరడమే. శ్రీకాకుళంలో కాలువలు శుభ్రపడ్డాయని భావించిన ఎమ్మెల్యే నగరానికి ఆనుకొని ఉన్న కాలనీలు ముంపునకు గురవుతుండటంతో మిర్తిబట్టి, రామిగెడ్డలో ఆక్రమణలు తొలగించి వారికో దారి చూపించాలనే చిత్తశుద్ధితో ఉన్నారు. కానీ వీధుల్లో ఉన్న కాలువల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్న విషయం ఆయన దష్టికి ఒకరోజు కూడా హెల్తాఫీసర్ తీసుకువెళ్లిన దాఖలాలు లేవు. దమ్మలవీధిలో ఎలా అయితే యుద్ధప్రాతిపదికన వందల మంది ఉద్యోగులను దించి శుభ్రం చేశారో, ప్రతీ డివిజన్‌లోనూ ఇటువంటి పనులే చేపట్టాలి. ఒకసారి ఆల్‌క్లియర్ అయిన తర్వాత కార్యాచరణ ఏమిటనేది ఆలోచించాలి. అంతవరకు ఇటువంటి డయేరియాలు పునరావతమవుతునే ఉంటాయి. అమత్ పథకంలో కుళాయి కావాలని దరఖాస్తు చేసుకున్నవారు కాలువ మీద నుంచి పైప్‌లైన్ కాకుండా ఆల్టర్నేటివ్ చూపిస్తేనే కనెక్షన్ ఇస్తామన్న నిబంధన పెట్టాలి. నగరంలో పశువుల సంచారాన్ని నిషేధించాలి. కొన్నిచోట్ల అసలు కాలువ ఉందని కూడా స్థానికులకు తెలియదు. ఎందుకంటే దానికి ఆనుకొని ఉన్నవారు tపూర్తిగా ర్యాంపులు వేసుకోవడం వల్ల అవి ఒక్కసారి కూడా క్లీన్ అయినట్లు చరిత్రలో లేదు. ఆ మాటకొస్తే ఆ ఏరియా శానిటరీ ఉద్యోగులకు కూడా అక్కడ కాలువ ఉందని తెలియదు. అటువంటి చోట్ల భూతద్దంతో వెతికి మరీ కాలువలను క్లియర్ చేస్తే, దానికి ఆనుకొని ఉన్న పిల్లకాలువల పరిస్థితి బాగుపడుతుంది.







Comments