top of page

ఇలియానా అంత పని చేసిందా?

  • Guest Writer
  • Sep 17, 2025
  • 3 min read

ఇలియాన తనకు బాగా డిమాండ్‌ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. ఇలియానా చేసిన ఓ పని వల్ల ఆమెను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా బ్యాన్‌ చేశారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నటి ఇలియానా ఓ తమిళ సినీ నిర్మాత నుంచి రూ.40 లక్షలు అడ్వాన్స్‌ గా అందుకుంది. కానీ డేట్స్‌ మాత్రం ఇవ్వలేదు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఆ నిర్మాత మాకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ చేసి విచారించాం. అప్పుడు ఇలియానా మాట్లాడుతూ.. ‘నేను డేట్స్‌ ఇచ్చాను.. కానీ నా డేట్స్‌ ఉపయోగించలేదు. తర్వాత నిర్మాతల సంఘం లాగ్‌ షీట్స్‌ అన్నీ బయటకి తీస్తే.. అడ్వాన్స్‌ తీసుకున్న నిర్మాతలకు ఇచ్చిన డేట్స్‌ లో ఇలియానా మరో సినిమాలో నటించిందని తెలిసింది. వెంటనే ఆ నటిపై నిషేధం విధించాం.’ మా రూల్‌ ప్రకారం అడ్వాన్స్‌ తీసుకున్న తర్వాత సినిమా సెట్‌ కు వచ్చి నటించాలి. అప్పుడే నటిస్తున్నట్టు. కానీ అడ్వాన్స్‌ తీసుకుని సినిమా స్టార్ట్‌ కాలేదు, ఆర్టిస్టులు సినిమా సెట్‌ కి రాలేదు కాబట్టి వచ్చిన అడ్వాన్స్‌ డబ్బు తిరిగి ఇచ్చేయాలి, ఇదే రూల్‌’’ అన్నారు. అడ్వాన్స్‌ తీసుకుని డేట్స్‌ ఇచ్చి అదే తేదీకి వేరే సినిమాలో నటించడం నేరమని నిర్మాత అన్నారు.ఇలియానా నిషేధానికి గురైనప్పుడు, ఆమె విజయ్‌ తమిళ చిత్రం ‘నన్బన్‌’లో నటిస్తోంది. తమిళంలో ఆమెకు అదే ఆఖరి చిత్రమని, ఆమెపై నిషేధం విధించామని నిర్మాత తెలిపారు. 2012 తర్వాత ఆరేళ్ల పాటు ఏ తెలుగు, తమిళ సినిమాలోనూ నటించలేదు ఇలియానా. ఆ తర్వాత 2018లో రవితేజ నటించిన ‘అమర్‌ అక్బల్‌ ఆంటోని’ సినిమాలో నటించింది. ఇప్పటివరకు మరో సౌత్‌ ఇండియన్‌ సినిమాలో నటించలేదు. ఇలియానా భారత పౌరసత్వాన్ని వదులుకుని 2014లో పోర్చుగల్‌ పౌరసత్వం పొందింది. 2023లో ఇలియానా మైఖేల్‌ డోలన్‌ అనే అమెరికన్‌ నటుడిని పెళ్లాడిరది. వీరికి బాబు జన్మించాడు. ప్రస్తుతం ఇలియానా కేవలం హిందీ సినిమాల్లోనే నటిస్తోంది.

సొంత బ్యానర్‌ ను ఎస్టాబ్లిష్‌ చేసే పనిలో హీరో

ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వారిలో టాలీవుడ్‌ యంగ్‌ టాలెంట్‌ కిరణ్‌ అబ్బవరం కూడా ఒకరు. రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కిరణ్‌ అబ్బవరం ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. అయితే కిరణ్‌ అబ్బవరం ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అతనికి సాలిడ్‌ సక్సెస్‌ ను అందించిన సినిమా మాత్రం క మూవీనే.

అక్టోబర్‌ లో కె ర్యాంప్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు..

క సినిమా సక్సెస్‌ కిరణ్‌ కు చాలా రిలీఫ్‌ ను ఇచ్చింది. క సినిమా తో సక్సెస్‌ ను అందుకున్న కిరణ్‌, దాని తర్వాత పలు సినిమాలను లైన్‌ లో పెట్టారు. అందులో భాగంగానే ప్రస్తుతం కిరణ్‌ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కె ర్యాంప్‌ సినిమాను పూర్తి చేసిన కిరణ్‌, ఆ సినిమాను అక్టోబర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అది కాకుండా కిరణ్‌ చేతిలో కొన్ని కొత్త ప్రాజెక్టులున్నాయి.

కేఏ ప్రొడక్షన్స్‌ పేరుతో కొత్త బ్యానర్‌

ఆల్రెడీ చెన్నై లవ్‌స్టోరీ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లిన కిరణ్‌ అబ్బవరం చేతిలో మరో 5 కొత్త సినిమాలుండగా అవి ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్నాయి. అయితే కిరణ్‌ రీసెంట్‌గా కేఏ ప్రొడక్షన్స్‌ అనే కొత్త బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి అందులో తిమ్మరాజుపల్లి టీవీ అనే టైటిల్‌తో ఓ చిన్న సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా రిలీజ్‌ కానుంది.

నిర్మాతగా రెండో సినిమాను సెట్‌ చేసుకున్న కిరణ్‌

ఆల్రెడీ మొదటి సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్న కిరణ్‌ ఇప్పుడు నిర్మాతగా రెండో సినిమాను మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే కిరణ్‌ బ్యానర్‌లో నిర్మించబోతున్న రెండో సినిమాలో తనే హీరోగా ఓ కొత్త డైరెక్టర్‌తో తెరకెక్కనుందని సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందట. మొత్తానికి కిరణ్‌ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు తన నిర్మాణ సంస్థలో వరుస ప్రాజెక్టులను లైన్‌ లో పెడుతూ తన బ్యానర్‌ ను ఎస్టాబ్లిష్‌ చేసే పనిలో ఉన్నారు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

‘కోర్ట్‌’ జంటతో.. బ్యాండ్‌ మేళం

కోర్ట్‌’ సినిమాతో ఆకట్టుకొన్న జంట.. రోషన్‌, శ్రీదేవి. వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. అదే ‘బ్యాండ్‌ మేళం’. సతీష్‌ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. రోషన్‌, శ్రీదేవి జంట చూడముచ్చటగా ఉంది. వాళ్ల డైలాగుల్లో తెలంగాణ యాస బాగా పలికింది. టైటిల్‌ ని బట్టి ఈ చిత్రంలో సంగీతానిది ప్రధాన పాత్ర అని అర్థం అవుతోంది.

‘కోర్ట్‌’తో పోలిస్తే రోషన్‌, శ్రీదేవిలకు విభిన్నమైన పాత్రలు లభించాయి. వాళ్ల కెమిస్ట్రీ, తెలంగాణ నేటివిటీ, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చిత్రబృందం చెబుతోంది బేబీతో ఓ సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకొన్న విజయ్‌ బుల్గానిన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈమధ్య తెలంగాణ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు, అందులోనూ యూత్‌ ఫుల్‌ స్టోరీలకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. పాటలు బాగుండి, కాస్తో కూస్తో ప్రమోషన్లు చేసుకోగలిగితే.. అదే ప్లస్‌ పాయింట్‌. కోన వెంకట్‌ కు తన సినిమాలను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో బాగా తెలుసు. ‘బ్యాండ్‌ మేళం’తో కూడా ఆయన తన సౌండ్‌ గట్టిగా వినిపించే ఛాన్సుంది.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page