top of page

ఉచితానికి చెల్లు.. ఇక UPI బాదుడు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 days ago
  • 3 min read

పూర్వం జేబులో నిండుగా డబ్బులు ఉంటే తప్ప బజారు చేయడం సాధ్యమయ్యేది కాదు. కాలక్రమేణా డబ్బుతో పనిలేకుండా పోయింది. నగదు స్థానంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ (ఏటీఎం) కార్డులు ఉంటే మార్కెట్‌లో పెద్దపెద్ద లావాదేవీలను ఇట్టే చక్కబెట్టేసే సౌలభ్యం ఏర్పడింది. ఇక ఆధునిక యుగంలో కరెన్సీతో పాటు కార్డుల అవసరం కూడా లేకుండాపోయింది. యÖనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెల్లింపు వ్యవస్థ అంతా మన సెల్‌ఫోన్లలోకి వచ్చేసింది. జేబులో సెల్‌ఫోన్ అందులో యÖపీఐ చెల్లింపులు జరిగిపే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే వంటి యాప్‌లలో ఏదో ఒకటి, దాంతోపాటు మన బ్యాంకు అకౌంట్ లేదా సదరు యాప్ వాలెట్‌లో తగిన నగదు నిల్వలు ఉంటేచాలు దర్జాగా మార్కెట్ చేయవచ్చు, షాపింగ్ చేయవచ్చు, టూర్లకు వెళ్లవచ్చు.. చివరికి చిల్లర ఖర్చులకు ఐదు, పది రూపాయల చెల్లింపులను కూడా UPI ద్వారా జరిపేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చేసింది. చిల్లర కొట్లు, పాన్‌షాపులు, కూరగాయల షాపుల వద్ద కూడా క్యూఆర్ కోడ్‌లు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ తరహా చెల్లింపులదే రాజ్యం. దీనివల్ల చిల్లర సమస్య కూడా పరిష్కారం కావడంతో చిరువ్యాపారులు కూడా ఈ చెల్లింపుల వ్యవస్థనే ఫాలో అయిపోతున్నారు. నగదు చెలామణీని తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వమే UPI (క్యాష్‌లెస్) పేమెంట్లను ప్రోత్సహించింది. తీరా ఇప్పుడు అది మన ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా పాతుకుపోయిన తర్వాత కేంద్రం బాదుడు ప్రారంభించింది. UPI చెల్లింపులు పూర్తిగా ఉచితమని ఊరించి, ప్రజలకు దాన్ని అలావాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్నుంచి ఆదాయం పిండుకునే ప్రణాళికలు రచిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. UPI ద్వారా యుటిలిటీ బిల్స్, బీమా ప్రీమియమ్‌లు, ఫోన్ రీఛార్జ్‌లు.. ఇలా అన్ని రకాల పేమెంట్స్ చేయవచ్చంటూ గేట్లు తెరిచిన ప్రభుత్వం మెల్లగా పలు రకాల బిల్లుల చెల్లింపులకు ఉపయోగించే యాప్ నిర్వాహకులు సర్వీసు ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు మరికాస్త ముందుకు వెళ్లి ఒక పరిమితికి మించిన చెల్లింపులను స్వీకరించిన వారి నుంచి నిర్ణీత రుసుము వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తున్నది. అయితే ఒకేసారి అందరి మీదా కాకుండా విడతలవారీగా ఈ వడ్డన చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. మొదట పెద్ద వ్యాపార సంస్థల్లో జరిగే లావాదేవీలపైనే యÖపీఐ వడ్డన ఉంటుంది. ఏడాదికి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్న్ ఉన్న వ్యాపార సంస్థలకు మొదట దీన్ని వర్తింపజేయనున్నారు. అది కూడా రూ.2వేలకు మించి జరిగే లావాదేవీలకే ఈ రుసుమును విధించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల చిన్న వ్యాపారులు, సామాన్య వినియోగదారులపై ఎటువంటి భారం పడదని, వారంతా ఇప్పట్లాగే యÖపీఐ సేవలను వినియోగించుకోవచ్చని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఇలా వసూలుచేసే రుసుమునే మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అని అంటున్నారు. దీని వసూలు ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. ఒక వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువులు లేదా పొందిన సేవలకు డిజిటల్ పద్ధతిలో చేసే చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి, ఆ మేరకు ఆ సమాచారాన్ని UPI ప్లాట్‌ఫారాల నుంచి సంబంధిత బ్యాంకుకు సమాచారం పంపడం, ఆ మేరకు బ్యాంకులు వినియోగదారుడి అకౌంట్ నుంచి నిర్ణీత మొత్తాన్ని డెబిట్ చేసి.. ఆ మొత్తాన్ని అతడు లావాదేవీ జరిపిన వ్యాపార సంస్థకు బదిలీ చేయడం వంటి సేవలు అందించినందుకే ఈ ఎండీఆర్ వసూలు చేయాలని ఆర్థిక శాఖ ప్రతిపాదిస్తున్నది. ఇదేమీ కొత్తది కాదు. గతంలో ఉండేది. కానీ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2020 జనవరిలోనే ఎండీఆర్ రుసుమును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఇప్పుడు అదే ప్రభుత్వం మళ్లీ ఆ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. ఎండీఆర్ రద్దు వల్ల దేశవ్యాప్తంగా నిత్యం కోట్లాది నగదు లావాదేవీలను ఉచితంగా నిర్వహించడం వల్ల బ్యాంకులు, పేమెంట్ కంపెనీలపై తీవ్ర ఆర్థికభారం మోపిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఏమాత్రం సరిపోవడంలేదని బ్యాంకులు చాలాకాలంగా వాపోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) గణాంకాల ప్రకారం.. 2017 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల వరకు ఉన్న వార్షిక UPI లావాదేవీల 2026 నాటికి ఏకంగా 24,200 కోట్లకు ఎగబాకాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.314 లక్షల కోట్లు. ఇంత పెద్దఎత్తున జరుగుతున్న యÖపీఐ లావాదేవీల నుంచి నిర్వహణ ఖర్చులు రాబట్టుకునేందుకే ప్రభుత్వం ఎండీఆర్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే కనీసం ఎండీఆర్‌ను 0.05 నుంచి 0.07 పాయింట్లుగా నిర్ణయించే అవకాశం ఉంది. ఎన్‌పీసీఐ బడా వ్యాపార సంస్థల నుంచి 0.30 పాయింట్ల ఎండీఆర్ వసూలు చేయాలని సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం అంత పెద్దస్థాయిలో భారం మోపడానికి సుముఖంగా లేదు. ఈ కొత్త రుసుమును బడా వ్యాపారులపైనే, అది కూడా రూ.2వేలకు మించిన లావాదేవీలపైనే విధిస్తున్నందున సామాన్య వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అలాగే దేశంలో దాదాపు 90 శాతం మంది చిన్న వ్యాపారులు, చిన్న వాణిజ్య సంస్థల కేటగిరీలోకే వస్తారు కాబట్టి వారి స్థాయిలోనూ ఎటువంటి ఆర్థికభారం పడుతుందంటున్నారు. అది నిజమే.. వినియోగాదారులపై దీనివల్ల ప్రత్యక్షంగా ఎటువంటి భారం పడదు. కానీ ఒక విషయం గమనార్హం. ప్రభుత్వాలకు, బడా కార్పొరేట్ సంస్థలకు ఒక అýవాటు ఉంది. మొదట ఒక వ్యవస్థలను ఉచితం అంటు అంటగట్టి అýవాటు చేస్తారు. జనం దానికి ఎడిక్ట్ అయిన ఆర్థికభారం మోపుతుంటారు. UPI ఛార్జీల విషయంలోనూ అది తప్పదేమో!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page