ఎచ్చెర్ల టీడీపీలో ఇన్‌ఛార్జి ‘రణం’
- SATYAM DAILY
- 2 days ago
- 1 min read
భానోజీనాయుడు పేరుపై భగ్గుమంటున్న శ్రేణులు
అధికారంలో ఉన్నప్పుడు చెట్టపట్టాలు.. ఇప్పుడు పదవులా?
వైకాపా ఎమ్మెల్యేతో సాన్నిహిత్యంపై కేడర్ తీవ్ర ఆగ్రహం
సర్పంచ్ గెలుపుపై నాడు వివాదాస్పద వ్యాఖ్యలు.. దెబ్బతిన్న పార్టీ ఆత్మగౌరవం
పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి ప్రాధాన్యత ఇస్తే ఒప్పుకోం
అధిష్ఠానానికి సోషల్ మీడియా వేదికగా నిరసన పోస్టుల హోరు

(సత్యంన్యూస్, ఎచ్చెర్ల)
ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌ఛార్జిని నియమించే విషయంలో ఇప్ప్పుడు ఆ పార్టీ ‘రణ’స్థలమైంది. రణస్థలం మాజీ సర్పంచ్ పిన్నింటి భానోజీనాయుడు పేరును ఆ పార్టీ పెద్దలు ప్రతిపాదిస్తున్నారనే వార్తలు రావడంతో ఇప్ప్పుడు రణస్థలం భగ్గుమంటోంది. ఇందుకు కారణం భానోజీరావు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో చెట్టపట్టాలేసుకొని తిరగడమే. మరీ ముఖ్యంగా 2019`24 మధ్యకాలంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో సాన్నిహిత్యంగా ఉంటూ టీడీపీకి తిలోదకాలివ్వాలని చూశారని, అటువంటి వ్యక్తికి పార్టీ పెద్దలు, ఇన్‌ఛార్జి మంత్రులు నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టాలని చూడటం సరికాదంటూ ఎచ్చెర్ల టీడీపీ సీనియర్లు సోషల్‌మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. నిజమైన కార్యకర్తలను, నాయకులను పక్కన పెట్టి గతంలో పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత సర్పంచ్ ఎన్నికý సమయంలో భానోజీనాయుడు తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే విజయం సాధించారు. కానీ ఆ తర్వాత టీడీపీ వల్ల తాను సర్పంచ్‌ను కాలేదని, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మద్దతుతో గెలిచానని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపాలోకి అధికారికంగా చేరేందుకు భానోజీనాయుడుపై అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారని, ఆ సమయంలోనే అప్పటి ఎంపీటీసీ మజ్జి రమేష్ వైకాపాలోకి వెళ్లడంతో అక్కడ ప్రాధాన్యత తగ్గుతుందనే ఉద్దేశంతో భానోజీనాయుడు ఆగిపోయారు తప్ప ఆయనకు పార్టీ కమిట్‌మెంట్ లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుండా తటస్థంగా ఉండిపోయారు తప్ప, ఏనాడూ తెలుగుదేశం పార్టీ కోసం గాని, కార్యకర్తల కోసం గాని పట్టించుకోలేది సోషల్‌మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. కార్యకర్తల ఆత్మగౌరవంపై దెబ్బతీసి ప్రతిపక్షంలో ఉన్నప్ప్పుడు అధికార పక్షంతో అంటకాగిన భానోజీనాయుడుకు పదవి ఇవ్వడమంటే రక్తం చిందించి పనిచేసిన శ్రేణులను అవమానించడమేనని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. భానోజీనాయుడును ఇన్‌ఛార్జిగా నియమించకూడదని పెద్ద ఎత్తున వీరు పార్టీ హైకమాండ్‌కు పోస్టులు పెడుతున్నారు.






Comments