top of page

పోలీస్-వైకాపా పోరుకు కౌంట్‌డౌన్!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 3 hours ago
  • 2 min read
  • చింతాడ కోసం పోలీసుల వేట

  • ఎస్పీ కార్యాలయం ముట్టడికి వైకాపా అల్టిమేటం

  • ‘నేను జిల్లాలోనే ఉన్నా..’ వీడియోతో పోలీసులపై పెరిగిన ఒత్తిడి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వైకాపా ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ వ్యవహారాన్ని ఇటు పోలీసులు, అటు పార్టీ సీరియస్‌గానే తీసుకున్నట్టున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని లేనిపోని కేసులు బనాయించి జగన్మోహన్‌రెడ్డి పర్యటనలో పాల్గొన్న నాయకులను వేధించాలని చూస్తే, ఎస్పీ కార్యాలయం ముందే వైకాపా శ్రేణులతో ధర్నా చేయడానికి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్తిబాబు సిద్ధపడుతున్నట్టు భోగట్టా. జైలులో ఉన్న అప్పలరాజును పరామర్శించడానికి జగన్మోహన్‌రెడ్డి వచ్చినప్ప్పుడు పోలీసు నిబంధనలను ఉల్లంఘించి మరీ జనసమీకరణ చేపట్టారంటూ వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో సహా నియోజకవర్గాల వైకాపా ఇన్‌ఛార్జిలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. చింతాడ రవికుమార్ ఎసఐ ప్రవళ్లిక పట్ల దురుసుగా ప్రవర్తించారన్న వీడియోలో ఎక్కడ ఆ మేరకు కనిపించిందో చూపాలనే డిమాండ్‌ను వైకాపా తెర మీదకు తీసుకువచ్చింది. ప్రవళ్లిక చుట్టూ రవికుమార్‌తో కూడిన వైకాపా శ్రేణులు ఉన్నప్ప్పుడు పోలీస్ యÖనిఫాంలో ఉన్న కొందరు వైకాపా కార్యకర్తలను ఎసఐ మీదకు నెట్టే వీడియోలు, ఫొటోలను వైకాపా సోషల్ మీడియా రెండు రోజుల క్రితం విడుదల చేసింది. అలాగే జగన్ టూర్‌లో పాల్గొనని వారి పేర్లను కూడా ఎఫఐఆర్‌లో ఇరికించడాన్ని ఇప్ప్పుడు బొత్స సత్యనారాయణ సీరియస్‌గానే పరిగణిస్తున్నారని భోగట్టా. అదే సమయంలో పోలీసులు కూడా చింతాడ రవికుమార్‌ను బెయిల్ రాకముందే అరెస్టు చేయాలన్న కోణంలో పని చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ ప్రమేయం ఉన్న కేసుల్లో యాంటిస్పేటరీ వచ్చేవరకు పోలీసులు వేచిచూసే ధోరణిని అవలంభిస్తారు. ఇదే ఆమదాలవలస నియోజకవర్గంలో వైకాపా నాయకుడు తమ్మినేని సీతారాం మీద శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినప్ప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చేవరకు వేచిచూశారు. అలాగే పలాస ఘటనలో సీదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్‌కు అప్లై చేసిన తర్వాత కోర్టు దాన్ని రిజక్ట్ చేసేవరకు ఆగారు. కానీ చింతాడ రవికుమార్ వ్యవహారం మాత్రం పోలీసులు సీరియస్‌గానే పరిగణిస్తున్నారు. కారణం తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మహిళా ఎసఐ పట్ల అనుచితంగా ప్రవర్తించడం మాత్రం కాదు. ఇది పొలిటికల్ గేమ్‌లో భాగంగా నమోదు చేయాల్సివచ్చిన కేసేనని పోలీసులకు తెలుసు. కానీ చింతాడ రవి కోసం వెతుకుతున్నామని, ఇంకా దొరకలేదని పోలీసులు చెప్ప్పుకునే అవకాశాన్ని రవి ఇవ్వలేదు. చింతాడ రవి పరారీలో ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత తానెక్కడికీ పోలేదని, జిల్లాలోనే ఉన్నానని, తన అనుచరులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తేస్తే తాను లొంగిపోతానని చింతాడ ఒక వీడియో సందేశాన్ని వదిలారు. దీంతో జిల్లాలో ఉన్నానంటూ సవాల్ విసిరిన రవికుమార్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేయకపోవడంపై పొలిటికల్ ప్రెజర్ మరింత పెరిగింది. అసలే ఆమదాలవలస నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఎప్పట్నుంచో చింతాడ రవి కొరకరాని కొయ్యగా మారారు. 2014-19 మధ్య కూన రవి ఎమ్మెల్యే అయినప్ప్పుడు, చివరకు 2019-24 మధ్య కూన రవి ప్రతిపక్షంలో ఉన్నా కూడా చింతాడ రవి కూన కేంద్రంగానే విమర్శలు, ప్రెస్‌మీట్‌లు ఉండేవి. జగన్ పర్యటనకు కొద్ది రోజుల ముందే గెడ్డపోరంబోకును కూన రవి ఆక్రమించుకున్నారంటూ చింతాడ రవి ఓ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్ప్పుడు అదే చింతాడ రవి తాను పరారీలో లేనని, అనుచరులపై కేసులు ఎత్తివేయాలని ప్రకటించడంతో ఉదాశీనంగా ఉండాలన్న అధికార పార్టీలో ఉన్నవారు ఆ అవకాశం పోలీసులకు ఇవ్వరు. కాబట్టి చింతాడను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చూపించాలని పోలీసులు వేట ముమ్మరం చేశారు. మరోవైపు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసుల్లో పోలీసులు ఎక్కువగా స్పందిస్తున్నారంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యేమార్గంగా చింతాడ రవిని పార్టీ అప్పగిస్తే, జిల్లాలో మిగిలినవారి మీద కేసులు లేకుండా చూస్తారన్న ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు డాక్టర్ సీదిరి అప్పలరాజు డిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించడం, చింతాడ రవి మీద నమోదైన సెక్షన్లు వంటి అంశాలను పరిశీలిస్తే.. రవి లొంగిపోయినా బెయిల్ రావడం కష్టమనే భావనను వైకాపా లీగల్ టీమ్ వ్యక్తం చేస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page