కుక్క కావాలీ!
- DV RAMANA

- 4 hours ago
- 3 min read
హైదరాబాద్ టూ ఆస్ట్రేలియా వయా దుబాయ్
ఓ శునకరాజం ఆసక్తికర ప్రయాణం
దాని పెంపుడు తల్లిదండ్రుల ఆరునెలల కఠోర శ్రమ
రూ.15 లక్షల ఖర్చుకూ వెనుకాడని దంపతులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
జంతువులను ప్రేమించడం, వాటిని ఉనికిని పరిరక్షించడం ఎంతగా ప్రాచుర్యం పొందిందో.. జంతువులను పెంచుకోవడం కూడా అంతే విస్తతంగా కనిపిస్తుంటుంది. వన్యమగాలు, సాదు జంతువులు అన్న తేడా లేకుండా అన్నింటినీ కాపాడటానికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ, స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాయి. చాలామంది వ్యక్తిగతంగానూ జంతు ప్రేమికులుగా వ్యవహరిస్తుంటారు. పెంపుడు జంతువుల మాటెలా ఉన్నా.. వీధికుక్కల విషయంలో ఈమధ్య కాలంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేసు నడుస్తోంది. వీధికుక్కల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటి దాడికి గురై పిల్లలు, వద్ధులు ప్రాణాపాయ స్థితిలో పడుతున్నందున జనావాసాలకు దూరంగా షెల్టర్లు ఏర్పాటు చేసి.. అక్కడికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాలతో జంతు ప్రేమికులు తీవ్రంగా విభేదిస్తున్నారు. ఈ వాదనలు, పరిణామాలతో నిమిత్తం లేకుండా కుక్కలను పెంచడమే కాకుండా వాటిని అమితంగా ప్రేమిస్తూ.. వాటిని తమ బిడ్డల్లా చూసుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. తమ పెంపుడు కుక్కల కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు, ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటంలేదు. ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్న ఓ కుటుంబం ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను తమతోపాటు తీసుకెళ్లేందుకు పడిన శ్రమ, అనుభవించిన వేదన, చేసిన ఖర్చు చూస్తే.. చిత్రం అనే సినిమాలో కుక్క కోసం చిన్నపిల్లాడు ‘కుక్క కావాలీ’ అంటూ చేసే మారాం గుర్తుకొస్తుంది. సినిమా వరకు అది ఫన్నీగా అనింపించినా.. ఈ దంపతుల విషయంలో అది ఎమోషన్‌తో కూడుకున్నది. కుక్కల విషయంలో వివాదాలు నడుస్తున్న తరుణంలో ఈ ఉదంతం చూస్తే కుక్కలను ఇంతగా ప్రేమించేవారు కూడా ఉంటారా అనిపించకమానదు.
ఆరునెలలు ఆజ్ఞాతవాసం
కుక్కలను పెంచుకునేవారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో.. ఈ హైదరాబాదీ దంపతులు పోరాటం చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా కుక్కలను పెంచుకునేవారు వాటితో అనుబంధం పెంచుకుంటారు. తమ ఇళ్లలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించడం, వాటితో ఆడుకోవడంతోపాటు బయటకు వెళ్లినప్పుడు తమతోపాటు వాటినీ తీసుకెళ్తుంటారు. కానీ ఈ దంపతులు దానికి మించి అన్నట్లు తమ పెంపుడు కుక్క కోసం ఏకంగా ఆరునెలలకుపైగా పోరాటం చేయడమే కాకుండా సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ విషయంలో తమ అనుభవాలను, శ్రమను వివరిస్తూ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్టు చేసిన స్టోరీ ఆలోచింపజేసేదిగా, కదిలించేదిగా ఉంది. దంపతుల పేర్లు వివరాలు లేకుండా కహానీ ఆఫ్ టేల్స్ పేరుతో ఉన్న ఖాతాలో ఉన్న ఈ పోస్టు వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన సదరు దంపతులు తమ ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దానికి స్కై అని పేరు పెట్టి సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. కాగా వారు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. తమ వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లాలని భావించారు. వివరాల కోసం ఆరా తీస్తే ఇది చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నదని తెలిసింది. అయినా వారు వెనుకాడలేదు. తమ కుటుంబ సభ్యురాలిగా భావించి పెంచుకుంటున్న కుక్కను ఎలాగైనా తమ వెంట తీసుకెళ్లాలన్న కతనిశ్చయంతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఏకంగా రూ.15 లక్షలు ఖర్చు చేయడమే కాకుండా దేశం కాని దేశం దుబాjáYTలో ఆ కుక్కతోపాటు నెలరోజులు గడిపారు. ఇంత శ్రమ, ఖర్చు భరించే బదులు ఈ కుక్కను ఇక్కడే వదిలేసి, ఆస్ట్రేలియాలో వేరే కుక్కను పెంచుకోవచ్చు కదా.. అని చాలా మంది బంధువులు , స్నేహితులు సూచించినా వారు అంగీకరించలేదు. ఎందుకంటే అది తాము పెంచుకున్న కుక్క మాత్రమే కాదు.. అది తమ బిడ్డ అని ఆ దంపతులు స్పష్టం చేశారు.
ఆరు నెలల రేబిస్ లేని దేశంలో..
కుక్కను నేరుగు ఆస్ట్రేలియా తీసుకెళ్లడానికి ఆ దేశ నిబంధనలు అంగీకరించవని తెలుసుకుని హతాశులయ్యారు. అనేక కఠిన నిబంధనలు పాటించి, భారీగా ఫీజులు చెల్లిస్తే తప్ప ఇతర దేశాల నుంచి ఆస్ట్రేలియాలోకి కుక్కలను తీసుకురానివ్వరు. ముందుగా సదరు శునకాన్ని ర్యాబిస్ వ్యాధి అసలు లేని దేశంలో కనీసం ఆరు నెలలపాటు ఉంచి, ఆ మేరకు ఆ దేశం నుంచి సర్టిఫికెట్ తీసుకుని వస్తేనే ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కుక్కలను తమ దేశంలోకి అనుమతిస్తారు. ఈ విషయం తెలిసి చాలా బాధపడినా.. చివరికి బిడ్డలాంటి తమ స్కై కోసం కష్టమైనా అందుకు సిద్ధపడ్డారు. ఎంక్వైరీ చేసి దుబాjáYT ర్యాబిస్ రహిత దేశంగా గుర్తింపు పొందిన విషయం తెలుసుకుని తమ శునక బిడ్డను ఆరునెలలు ఆ దేశంలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఆరు నెలలపాటు దుబాjáYTలో తమకు తెలిసినవారిని ఒప్పించి అక్కడికి కుక్కను తీసుకెళ్లారు. కొత్త వాతావరణానికి అది అలవాటు పడేవరకు ఈ దంపతులు కూడా నెలరోజులు అక్కడే ఉన్నారు. తాము లేకపోయినా అది ఉండగలదని నమ్మకం కుదిరిన తర్వాతే ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ కూడా అది లేని లోటును భరిస్తూ ప్రతిరోజూ వీడియో కాల్స్ ద్వారా కుక్కతో ముచ్చట్లాడుతూ తమ భారం దించుకోవడమే కాకుండా దాని బెంగ తీర్చేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆరు నెలల అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని స్కై తమ వద్దకు చేరుకోవడంతో ఆ జంట ఆనందంతో మురిసిపోయింది. ఇందుకోసం రూ. 15 లక్షలు ఖర్చు అయ్యాయని చెబుతూనే ఆ ఖర్చు కంటే స్కైని తాము ఆరు నెలలు మిస్ కావడమే తమకు అత్యంత భారంగా, కష్టంగా అనిపించిందని ఆ జంట పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ పోస్టును చదివిన నెటిజన్లు ఆ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది డబ్బుల గురించే ఆలోచిస్తారని.. కానీ ఈ జంట తమ ప్రియమైన స్కై కోసం సాహసం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.










Comments