కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బై ఎస్ఎస్ భూషణ్
- Prasad Satyam
- Apr 8
- 3 min read
కంప్లైంట్‌లోనే కాదు.. పుస్తకాల్లోనూ కాపీ పేస్ట్ బాపతు
శశి గ్యారేజ్ చేసిన ఫిర్యాదుల్లో అడ్రస్ లేనివారే అధికం
పాఠాలు చెప్పకుండా పుస్తకాలమ్ముకొని వ్యాపారం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఫొటోలో కనిపిస్తున్నది డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్`1,2లకు సంబంధించిన ఇంగ్లీష్ టెక్ట్స్ ప్లస్ గైడ్. దీన్ని రచించింది ఎస్ఎస్ భూషణ్ అని ఉంది. ఈ ఎసఎస్ భూషణ్ మరెవరో కాదు.. ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేస్తున్న ఎస్.శశిభూషణే. కళాశాలలో పాఠాలు చెప్పకుండా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక గైడ్‌లు, టెస్ట్‌పేపర్లు సేకరించి, దానిలో కాపీ పేస్ట్‌లు చేసి, ఈయన పేరు మీద ఒక పుస్తకం మార్కెట్‌లోకి గత ఐదేళ్లుగా విడిచిపెడుతున్నారు. సార్.. పాఠాలు చెప్పండి అని విద్యార్థులు అడిగితే, మార్కెట్‌లో తాను రాసిన పుస్తకాలున్నాయని, వాటిని కొనుక్కుని చదివితే 60 శాతం మార్కులు ఖాయమని ఈయన అభయమిస్తారు. ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్న బీద బిక్కీ విద్యార్థులు మార్కెట్‌లో ఈయన పుస్తకాలు కొనుక్కునే పరీక్షలకు వెళ్తున్నారు. లెక్చరర్ శశిభూషణ్‌కు బినామీ పేర్లతో అధికారుల మీద ఫిర్యాదులు చేయడం మినహా పాఠాలు చెప్పే తీరిక లేదు. అలాంటప్ప్పుడు పుస్తకాన్ని రాసే సమయమెక్కడుందని అనుమానం కలగొచ్చు. అందుకే ఆయనే మార్కెట్‌లో ముందుండాలనే లక్ష్యంతో ఆదరాబాదరాగా అనేక పుస్తకాలు వచ్చేశాయని, అందుకే తాను ఒక పుస్తకాన్ని తయారుచేశానని ఆ పుస్తకానికి వెనుకపేజీలో రాసుకొచ్చారు. దీని ధర 112 రూపాయలు. గవర్నమెంట్ లెక్చరర్‌గా ఉంటూ, అదే విద్యార్థులకు గైడ్‌లు తయారుచేసి అమ్మడం నేరం. ఇలా చేయాలంటే ఆయన ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఇలా చేసినట్టు ఆయన పనిచేసిన కాలేజీలో ఎక్కడా రికార్డులు లేవు. అయినా ఉన్నతాధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడంలేదు. ఇదే ఆర్ట్స్ కాలేజీలో మిగిలిన కొందరు ఇంగ్లీష్ లెక్చరర్లు మెటీరియల్ సొంతంగా తయారుచేసి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. కానీ మనోడు సీనియర్ కాబట్టి 112 రూపాయలు పెట్టి పుస్తకం కొనుక్కోవాలని చెబుతున్నారు. జాతీయ నూతన విద్యావిధానం అమలులోకి వచ్చినప్ప్పుడు ఈయన ఈ పుస్తకాలు తయారుచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సిలబస్‌లో అనేక మార్పులు వచ్చాయి. కానీ మాస్టారు మాత్రం మార్కెట్‌లో మిగిలిపోయిన ఆ పుస్తకాలే కొనుక్కొని చదవాలని చెబుతున్నారట. అంటే.. శశిభూషణ్ ఇంకా అప్‌డేట్ అవ్వలేదన్నమాట. ఎప్ప్పుడైనే క్లాసులో పాఠాలు చెబితే సిలబస్ ఏం మారిందో తెలిసుండేది. ఆ అవసరం లేదు కాబట్టి ఇంకా పాత పుస్తకాలతోనే ఈయన కాలం వెల్లబుచ్చుతున్నారు. బహుశా అప్పట్లో శశి గ్యారేజ్ స్థాపించలేదు కాబట్టి అంతో ఇంతో పుస్తకంలో మెటీరియల్ సమకూర్చడానికి సమయం ఉండివుంటుంది. కానీ ఆ తర్వాత ఆయనే షాడో ఎమ్మెల్సీ, ఆయనే బినామీ ప్రిన్సిపాల్ వంటి పదవుల్లో అనధికారికంగా కొనసాగుతుండటం వల్ల కొత్త పుస్తకాలకు సమయం సరిపోయినట్టు లేదు. గైడ్‌లు కొనుక్కోవడం కాదు.. పాఠాలు చెప్పాలని అప్పటి ప్రిన్సిపాల్ పెంకి సురేఖ ప్రశ్నించినందుకే ఆమెను ఆర్ట్స్ కాలేజీ నుంచి బదిలీ అయ్యేవరకు శశిభూషణ్ గ్యారేజ్ నకిలీ ఫిర్యాదులు వండి వార్చినంత వరకు నిద్రపోలేదు. పోనీ శశిగ్యారేజ్ నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏవైనా నిరూపితమయ్యాయా? అంటే.. ఏ పేరు మీద అయితే ఫిర్యాదులు వెళ్లాయో వారే ఆ అడ్రస్‌లో లేరని విచారణ అధికారులు తేల్చేశారు. అటువంటప్ప్పుడు ఈ ఫిర్యాదులు ఎవరు చేసుంటారు? అంటే.. అన్ని వేళ్లూ శశిగ్యారేజ్ వైపే చూపిస్తున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.

(ఫిర్యాదు చేసిన రామారావు ఎవరో బయటకు రాలేదంటూ ఇచ్చిన నివేదిక)
2024 ఎన్నికలలో కోడ్ అమలులో ఉంటుండగానే ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న సురేఖ అప్పటి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును కళాశాలకు పిలిచి సన్మానించారని, ఆయన్ను ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించారంటూ నగరంలో సోడా లేఅవుట్ (పీఎన్ కాలనీకి ఆనుకొని)లో ఉన్న ఎస్.రామారావు అనే వ్యక్తి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టాలంటూ రిటర్నింగ్ అధికారి స్పెషల్ తహసీల్దార్ (గెయిల్) ఆర్.ఈశ్వరమ్మను ఆదేశించారు. ఆమేరకు విచారణ చేపడితే.. ఫిర్యాదుదారుడు అందజేసిన ఆధారాలు ఎన్నికల కోడ్‌కు ముందువని, ఎన్నికలకు, వారు సమర్పించిన ఫొటోలకు ఏమాత్రం సంబంధం లేదని నివేదిక రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఫిర్యాదుదారుడి నుంచి మరింత సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తే, ఎస్.రామారావు ఆచూకీ లభించలేదని, ఫిర్యాదులో ఫోన్ నెంబరైనా ప్రస్తావించకపోవడంతో ఆయన్ను ఫోన్‌లో సంప్రదించలేకపోయామని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇప్ప్పుడు అసలు విషయానికి వస్తే ఆర్ట్స్ కళాశాలలో ఎన్నికల ట్రైనింగ్ ప్రొగ్రాం జరుగుతుంటే ధర్మాన ప్రసాదరావును సురేఖ తీసుకొచ్చారంటూ సబ్మిట్ చేసిన ఫొటో 2022లోనిది. దాన్ని ఎన్నికలకు ముడిపెట్టి ఎస్.రామారావు పేరుతో ఫేక్ ఫిర్యాదును శశిగ్యారేజ్ విజయవంతంగా లాంచ్ చేసింది. ఎప్ప్పుడైతే ఇది అవాస్తవమని తేలిపోయిందో, ఆ తర్వాత ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం గ్రామానికి చెందిన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కె.వి.వి.సత్యనారాయణ పేరుతో ఎలక్షన్ కమిషన్‌కు ఒక సుదీర్ఘ ఫిర్యాదు వెళ్లింది. దీనిపై కూడా యథావిధిగానే ఎన్నికల కమిషన్ విచారణ జరిపించింది. ఇందులో భాగంగా సత్యనారాయణ పెట్టిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు ఏవైవ సాక్ష్యాలుంటే కావాలని విచారణాధికారులు అడిగారు. తనవద్ద అటువంటివేవీ లేవని సత్యనారాయణ చేతులెత్తేశారు.

(తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని కేవీవీ సత్యనారాయణ ఇచ్చిన వాంగ్మూలం)
అక్కడితో ఆగితే బాగుండేది. ఆర్ట్స్ కళాశాలలో తన మిత్రులు కొంతమంది ఉన్నారని, వారు ఇచ్చిన సమాచారంతోనే ఫిర్యాదు చేశానంటూ నేరుగా ఆయనే విచారణాధికారులకు ఒక లేఖ రాసిచ్చేశారు. ఇప్ప్పుడు సోడా లేఅవుట్‌లో రామారావు గాని, ఎస్.ఎం.పురంలో కేవీవీ సత్యనారాయణ గాని ప్రాథమికంగా ఫిర్యాదు ప్రతికి జతచేసినవి ఒకే తరహా కాగితాలు. ఇవి ఆర్ట్స్ కాలేజీ కార్యాలయంలో ఫొటో తీసి, ఆ తర్వాత జిరాక్స్ ప్రతులుగా మార్చినవి. ఇవి కళాశాల బయటనున్న వీరికి ఎలా వచ్చిందో వేరేగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ రెండు ఫిర్యాదులూ తేలిపోయాయని భావించిన శశిగ్యారేజ్, అంతకు ముందు ధర్మాన ప్రసాదరావును కాలేజీకి తెప్పించి రాజకీయం చేస్తున్నారని రాసిన ఫిర్యాదును మళ్లీ కాపీ చేసి అక్కడ ధర్మాన ప్రసాదరావు అనే పేరున్నచోట గొండు శంకర్ అని ఒకసారి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అంటూ మరోసారి సురేఖ మీద ఫిర్యాదు చేశారు. వాస్తవానికి 2023లో గొండు శంకర్ తన నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ టీచర్స్‌డే సందర్భంగా మెమొంటోలిచ్చి సన్మానించారు. అధ్యాపకులను గౌరవించినందుకు శంకర్‌ను కూడా సురేఖతో పాటు మిగిలిన లెక్చరర్లు గౌరవించారు. ఆ ఫొటోను తీసుకువచ్చి ఎన్నికల్లో గొండు శంకర్‌కు సురేఖ పని చేశారంటూ ఒక ఫిర్యాదును పంపారు. ఆ తర్వాత పట్టభద్రుల కోటా నుంచి వేపాడ చిరంజీవిరావు ఎన్నికయ్యారు. ఆయన తనకు ఓట్లేసి గెలిపించినందుకు కతజ్ఞతగా ఆర్ట్స్ కళాశాలకు వచ్చారు. ఆయనకు శాలువ కప్పిన ఫొటో తీసి ఇది కూడా ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ మరో ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపైనా విచారణలు జరిగాయి. అన్నీ ఫేకని తేలాయి. అయినా సురేఖ మీద రోజూ ఏదో ఒక ఫిర్యాదు, ఏదో ఒక కథనం రావడంతో నిజానిజాలు పక్కనపెట్టి ఈ తýనొప్పి లేకుండా ఉండటం కోసం ఆమెను శ్రీకాకుళం నుంచి బదిలీ చేశారు. ఇప్ప్పుడు శశిగ్యారేజ్‌కు ఫిర్యాదు ఆర్డర్లు తగ్గిపోవడంతో చేతులకు దురదెక్కువైపోయి సమగ్రశిక్ష కార్యాలయంలో అధికారులను కదిపేయడానికి ఫేక్ ఫిర్యాదులు తయారవుతున్నాయి. ఏపీసీ మీద మొదట్లో బాణాలు ఎక్కుపెట్టినా, అవి గురి కుదరకపోవడంతో సమగ్రశిక్షలో అంతర్గత చిచ్చుపెట్టి దాన్ని పరిష్కరించలేని చేతకాని ఏపీసీ ఉన్నాడనే కలరింగ్ ఇచ్చి, ఇక్కడి నుంచి పంపేయడానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బై ఎస్ఎస్ భూషణ్ సినిమా ప్రస్తుతం నడుస్తోంది.






Comments