top of page

గ్రేటర్ నికోబార్‌పై గోలెందుకు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ీVAరు ముగియడంతో ఇప్పుడు మన జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి అండమాన్ నికోబార్ దీవుల పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన విహారయాత్ర అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ పర్యటనలోనూ ఆయన ప్రభుత్వ వ్యతిరేక గళమే వినిపించారు. మొదట నికోబార్ దీవుల్లోని మారుమÖల ప్రాంతాలను చుట్టేసి వచ్చిన ఆయన అక్కడి అరుదైన పర్యావరణ వ్యవస్థను, జీవజాతులను, ప్రిమిటివ్(ఆదిమ) జాతుల మనుగడను రక్షించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంతకూ ఆ జీవజాతులకు, ఆదిమ తెగలకు వచ్చిన ప్రమాదం ఏమిటంటే.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు వల్ల ఆ దీవుల్లో జీవవైవిధ్యం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటాయని, పురాతన వ్యవస్థలు ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న రాహుల్.. ఆ కారణంతోనే గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టును పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన తల్లి సోనియాగాంధీ సైతం దీనిపై ఓ పత్రికకు రాసిన పెద్ద వ్యాసంలో కూడా పర్యావరణాన్ని నాశనం చేసే ఆ ప్రాజెక్టు నుంచి కేంద్రం వెనక్కి రావాల్సిందేనని నొక్కి వక్కాణించారు. అయితే వీరి డిమాండ్‌కు పూర్తి విరుద్ధమైన అభిప్రాయాలు కూడా దేశంలో వినిపిస్తున్నాయి. పైగా దేశరక్షణ, సారభౌమత్వ, స్వావలంభన పరిరక్షణకు ఉద్దేశించిన బృహత్ ప్రాజెక్టును పర్యావరణం కోసం త్యాగం చేయాలా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతవరకు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఫక్తు బిజినెస్ చేసే కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాత్రమే ఇలాంటి వ్యాసాలు రాస్తున్నాయి. డిబేట్లు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు సోనియా, రాహుల్‌గాంధీలు వారి పక్షాన చేరారు. తాజా వివాదానికి కారణమైన గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు దేనికి ఉద్దేశించింది? దానివల్ల నికోబార్ జీవావరణ వ్యవస్థలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో అర్థం చేసుకుంటే.. ఈ ప్రాజెక్టు అవసరం ఏమిటి? దాన్ని రద్దు చేయాలనడం న్యాయమో కాదో ఎవరికివారు తెలుసుకోవచ్చు. అండమాన్ దీవుల్లో భాగమైన గ్రేటర్ నికోబార్ దీవులు మలక్కా జలసంధికి సుమారు 40 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉన్నాయి. హర్మూజ్ మాదిరిగానే ఈ జలసంధి వెడల్పు కూడా 2.8 కిలోమీటర్లే ఉంది. ఆసియాలో అత్యంత కీలకమైన మలక్కా జలసంధిపైనా చైనా తన చమురు దిగుమతులు, ఇతర వాణిజ్య రవాణా అవసరాలకు ఆధారపడుతుంటుంది. ఆ దేశం సాగించే ఐదు ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ వ్యాపారంలో 80 శాతం ఈ జలసంధి గుండానే సాగుతుంది. అంటే చైనా ఆర్థికానికి ఇది అత్యంత కీలకమైనది కావడమే కాకుండా దాని కదలికలు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటాయన్నది సుస్పష్టం. అలాంటి వ్యూహాత్మక ప్రాంతంలో చైనా కదలికలపై నిరంతరం నిఘా ఉంచాల్సి అవసరం ఉంటుంది. దానికి అనువైన ప్రాంతం నికోబార్ దీవులు మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకునే భారత ప్రభుత్వం రూ.85 వేల కోట్లతో గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు చేపట్టింది. ¹ దీనివల్ల చైనా నౌకలపై నిఘా ఉంచొచ్చు. ఇక్కడి నుంచి సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక సమాన దూరంలో ఉంటాయి. దాంతోపాటు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్(ప్రత్యేక ఆర్థిక మండలి) ఉంటుంది. పైగా గ్రేటన్ నికోబార్ ప్రాజెక్టు ద్వారా 200 కిలోమీటర్ల పరిధిలోని సముద్ర సంపద భారత్‌కు చెందుతుంది. కొన్ని దశాబ్దాల క్రితమే మలక్కాపై చైనా కన్నుపడింది. 2003లో ఆ దేశాధ్యక్షుడు హూ జింటావో మాలక్కా జలసంధిపై చైనా ఆధిపత్యం ఉండాలని, అది దేశానికి చాలా కీలకమని కూడా ఉవాచించారు. కానీ వాజ్‌పేయి ప్రభుత్వం వచ్చే వరకు మనదేశ పాలకులు హిందూ మహాసముద్రంలో చైనా ముప్పును గుర్తించలేదు.. పట్టించుకోలేదు. వాజ్‌పేయి ప్రభుత్వ హయంలో నికోబార్ దీవులు కేంద్రం మలాక్కపై నిఘాకు చర్యలు చిన్నగా మొదలయ్యాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక అవి జోరందుకున్నాయి. ఫలితంగానే గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నికోబార్‌లో ట్రాన్షిప్‌మెంట్ పోర్టు, ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మిస్తారు. ఇవి ఉభయతారకంగా ఉంటూ వాణిజ్య, సైనిక అవసరాలను తీరుస్తాయి. మన యుద్ధవిమానాలు అక్కడ ల్యాండ్ అవుతాయి. షిప్పులకు మరమ్మతులు కూడా ఇక్కడే చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ చైనాతో యుద్ధం వస్తే ఇవి కీలకంగా మారతాయి. ఇటు చైనా, అటు అమెరికాల జోరుకు అడ్డుకట్ట వేయడానికి గ్రేటర్ నికోబార్ ఉపకరిస్తుంది. భారతదేశం చుట్టూ ఉన్న ఇతర దేశాల్లో ముత్యాలహారంలా చైనా పోర్టులు నిర్వహిస్తోంది. దీనికి చెక్ పెట్టడానికి నికోబార్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి భారత్ సింగపూర్, కొలంబో వంటి పోర్టులపై ప్రస్తుతం ఎక్కువగా ఆధారపడుతున్నది. గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు ఈ విషయంలో దేశాన్ని చాలావరకు స్వయం సమృద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే 2022లో పర్యావరణ, అటవీ, తీరప్రాంతా భద్రతకు సంబంధించిన క్లియరెన్స్‌లు లభించాయి. 42 షరతులతో ఆయా మంత్రిత్వశాఖలు అనుమతులు జారీ చేశాయి. వీటి ప్రకారం 2052 వరకు ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే జంతువులు, పక్షులు, పర్యావరణం, ఆదిమ జాతులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వంటి వాటికి ఈ ప్రాజెక్టు ద్వారా బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (జాతీయ హరిత ట్రిబ్యూనల్) కూడా దీనికి అనుమతి ఇచ్చింది. నికోబార్ ప్రాజెక్టును కొన్ని పర్యావరణ సంస్థలు, సంఘాలు సవాల్ చేసినప్పటికీ ట్రిబ్యూనల్ వాటిని కొట్టివేసింది. నికోబార్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తగిన కారణమేదీ కనిపించడంలేదని ఆ సంస్థ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే సరే కొన్ని పర్యావరణ సంస్థలు, కాంగ్రెస్‌లాంటి పార్టీలు దేశభద్రతకు కీలకమైన ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తెలిసో తెలియకో చైనా ఉచ్చులో చిక్కుకుంటున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page