top of page

సీఎంలను ఎంపిక చేసిన నేతకే అందని పదవి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 5 hours ago
  • 2 min read

గత నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఈ నెల నాలుగో తేదీన ఫలితాలు వెలువడ్డాయి. వాటి ఆధారంగా మÖడు నాలుగు రోజుల వ్యవధిలో మెజారిటీ సాధించిన పార్టీలు లెజిస్లేచర్ పార్టీ సమావేశాలు జరిపి తమ నేతను ఎన్నుకుని గవర్నర్ ద్వారా అతన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలి. ఆ ప్రక్రియ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు సజావుగానే జరిగిపోయింది. చివరికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ ఏ పార్టీకీ లభించని తమిళనాడులో గవర్నర్ పెట్టిన సవాలక్ష షరతులను నెరవేర్చి.. ఇతర పార్టీల మద్దతు సాధించి కొత్త పార్టీ టీవీకే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో బలనిరూపణ తంతు కూడా పూర్తి చేసుకుంది. కానీ దాని పొరుగునే ఉన్న కేరళంలో మెజారిటీ స్థానాలు సాధించిన UDF కూటమి మాత్రం ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత తీవ్ర తర్జనభర్జన అనంతరం ఈ కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడమే ఈ జాప్యానికి కారణం. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం ముగ్గురు ఆశావహులు తీవ్రంగా పోటీపడటం.. అది చాలదన్నట్లు వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఢిల్లీ అధిష్టానం నేతలు కూడా విడిపోవడం.. వెరసి ఎప్పట్లాగే కాంగ్రెస్ సంస్కృతిని మరోసారి గుర్తుచేస్తూ సీల్డ్ కవర్ పద్ధతిలోనే ఎట్టకేలకు యÖడీఎఫ్ సీఎం అభ్యర్థిగా గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వి.డి.సతీశన్‌ను ఖరారు చేసింది. అయితే ఈ విషయంలో అటు ఢిల్లీ స్థాయిలోనూ.. ఇటు రాష్ట్రస్థాయిలోనూ కాంగ్రెస్‌తోపాటు యÖడీఎఫ్ కూటమిలోనూ అనేక పరిణామాలు, బలప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. సీఎం పదవి కోసం సతీశన్‌తోపాటు అధిష్టానం వద్ద మంచి పట్టున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితల తీవ్రంగా పోటీపడ్డారు. ఒకదశలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం.. ముఖ్యంగా నెహ్రూ`గాంధీ కుటుంబంలోనే ఈ ముగ్గురికి అనుకూలంగా చీలిక ఏర్పడి త్రిముఖ పోటీ ఏర్పడిందని ఢిల్లీవర్గాల సమాచారం. వేణుగోపాల్‌ను రాహుల్‌గాంధీ సమర్థించగా, సీనియారిటీ ఆధారంగా సోనియాగాంధీ రమేష్ చెన్నితలవైపు మొగ్గు చూపారు. ఇక మÖడో అధికార కేంద్రంగా ఉన్న ప్రియాంక గాంధీ మాత్రం రాష్ట్రస్థాయిలో కీలకంగా ఉన్న సతీశన్‌కు అండగా నిలిచినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. చివరికి రాష్ట్రస్థాయిలో పరిణామాలను, పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ నాయకత్వం సతీశన్ పేరును ఓకే చేసింది. కేరళం పేరుతో జరిగిన ఈ పోటీ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రియాంక ప్రాధాన్యత పెరుగుతున్నదనడానికి సంకేతంగా నిలుస్తున్నది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో రాహుల్ స్థానంలో నానమ్మ ఇందిరను తలపించే ప్రియాంక గాంధీకి ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచనలు చాలాకాలం నుంచే వినిపిస్తున్నాయి. ప్రస్తుత కేరళం రాజకీయంతో అది నిజమవుతున్నదా అన్న చర్చ మొదలైంది. సీనియర్ నాయకుడైన రమేష్ చెన్నితల విషయాన్ని కాసేపు పక్కన పెడితే గత కొన్నేళ్లుగా జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేసీ వేణుగోపాల్‌ను, ఆయనకు రాహుల్ మద్దతును పక్కనపెట్టి సతీశన్‌కు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ శ్రేణులే పెద్ద విశేషంగా చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జాతీయస్థాయి పార్టీ వ్యవహారాల్లో వేణుగోపాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పార్టీ అంతర్గత సమస్యలను, వివాదాలను పరిష్కరిస్తూ ట్రబుల్ షూటర్‌గా పేరొందారు. అన్నింటికీ మించి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులను స్వయంగా ప్రకటించిన ఈయన ఇప్పుడు తనకు మాత్రం ఆ పదవి ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. సతీశన్‌తో చివరి వరకు తీవ్రంగా పోటీపడి విఫలమయ్యారు. అధిష్టానానికి సన్నిహితుడిగా, జాతీయస్థాయి పార్టీ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న వేణుగోపాల్‌ను కాదని సతీశన్ వైపు మొగ్గు చూపిన కాంగ్రెస్ నాయకత్వం ఆయనలో ఏ ప్రత్యేకతలను చూసిందన్న చర్చ జరుగుతోంది. అసలు సతీశన్ ఎవరు.. అన్న ఆరాలు కూడా పెరిగాయి. వి.డి.సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. 1964 మే 31న నెట్టూరులో జన్మించిన ఆయన తల్లిదండ్రులు విలాసిని అమ్మ, దామోదర మీనన్. నాయర్ల కుటుంబానికి చెందిన సతీశన్ ఉన్నత విద్యావంతుడు. సోషల్‌వర్క్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడంతోపాటు న్యాయశాస్త్రంలో ఎలఎల్‌బి, ఎలఎలఎం పట్టాలు అందుకున్నారు. ఆయన సతీమణి లక్ష్మీప్రియ. ఈ దంపతులకు ఉన్నిమాయ ఏకైక సంతానం. రాజకీయాల్లోకి రాకముందు సతీశన్ కేరళ హైకోర్టులో పదేళ్లపాటు లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేశారు. కాగా సతీశన్ కుటుంబానికి మొదటినుంచీ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయనే స్వయంగా తన పొలిటికల్ కెరీర్‌ను నిర్మించుకున్నారు. న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందిన తర్వాత ప్రజాసేవపై ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో మొదటిసారి పరవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. కానీ 2001లో మొదటిసారి విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసే అవకాశం లేకుండాపోయింది. ప్రతిసారి విజయం సాధిస్తూ.. ప్రజాప్రతినిధిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కేరళ కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆ మేరకు సతీశన్‌ను ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతాలు చేసింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ కూటమిని నిన్నటి ఎన్నికల్లో ఓడించింది. సతీశన్ ఆరోసారి పారావూర్ అసెంబ్లీ నుంచి విజయం సాధించారు. సుదీర్ఘ చర్చల అనంతరం సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం కేరళ సీఎంగా ఖరారు చేసింది.కూటమిలో కీలకమైన ఐయÖఎంఎల్ సమర్థించడం సతీశన్‌కు కలిసివచ్చింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page