top of page

గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.10.87 కోట్లు

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 18 hours ago
  • 1 min read
  • గార, శ్రీకాకుళం మండలాలకు ప్రయోజనం

  • ఫలించిన ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రయత్నాలు

  • త్వరలో మొదలుకానున్న పనులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి రూ.10.87 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జీవోఆర్టీ 64 ద్వారా పంచాయతీరాజ్ శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న పలు రోడ్లను పటిష్టపర్చడం, వెడల్పు చేయడం, పునర్నించడం వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ స్ట్రెంగ్తెనింగ్ ప్రాజెక్టు (ఏపీఆరఆరఎస్‌పీ)లో భాగంగా పీఆరఆర్ గ్రాంట్‌గా మంజూరైన ఈ నిధులతో నియోజకవర్గంలోని గార మండల పరిధిలో సీఎస్పీ రోడ్డు నుంచి కె.సైరిగాం, రాఘవపురం, దువ్వుపేట, రామకృష్ణాపురం, రాళ్లపేట, తాళ్లవలస గ్రామాల మీదుగా జీసీరోడ్డు నుంచి అరంగిపేట వరకు తొమ్మిది కీలక రహదారులకు మోక్షం లభించనుంది. అలాగు శ్రీకాకుళం రూరల్ మండలంలో శ్యాంపాలెం, పరదేశిపాలెం, బావాజీపేట, నారాయణపురం, లింగాలవలస, కనుగులవానిపేట గ్రామాల రోడ్లను పునర్నిర్మించనున్నారు.

వాస్తవానికి జీవోఆర్టీ 970 ప్రకారం గత ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీనే రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 4007 కి.మీ. నిడివిన ఉన్న 1299 రోడ్లు అభివద్ధికి రూ.2123 కోట్లతో పరిపాలన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రతిపాదనలు, సవరణల ప్రకారం ఆ జీవోలో మంజూరైన 253 రోడ్ల అభివద్ధి పనులను రద్దు చేస్తూ వాటి స్థానంలో 148 పనులను మార్చడం, 346 ప్రత్యామ్నాయ పనులను గుర్తిస్తూ.. వాటిని చేరుస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈ ఏడాది జనవరి 13న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పరిశీలన అనంతరం ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపడంతోపాటు జీవో 970లో సవరణలు చేస్తూ తాజాగా జీవోఆర్టీ నెం. 64 జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రూ.2123 కోట్లతో మొత్తం 1392 రోడ్లను అభివద్ధి చేయనున్నారు.

సీఎం, డిప్యూటీ సీఎంలకు కతజ్ఞతలు

తాజా జీవో ప్రకారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లకు రూ.10.87 కోట్లు మంజూరుయ్యాయి. ఈ పనులు పూర్తి అయితే నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడం సులభతరమవుతుంది. ఈ పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌లకు ఆయన కతజ్ఞతలు తెలిపారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page