top of page

గ్రీవెన్స్‌లో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • May 5
  • 1 min read
  • కలెక్టర్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకున్న బాధితురాలు

  • భూ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆవేదన

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

జెడ్పీ సమావేశ మందిరింలో సోమవారం కలెక్టర్‌ నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాకర్‌సాహెబ్‌పేటకు చెందిన వృద్ధురాలు లొట్టి మంగమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిరది. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఎదుటే తనతో పాటు బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ ఒంటిపై వేసుకుంది. దీన్ని గమనించిన కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు స్పందించి అక్కడే ఉన్న మహిళా పోలీసులను అప్రమత్తం చేయించి బాధితురాలి నుంచి బాటిల్‌ తీసుకున్నారు. వృద్ధురాలిని కలెక్టర్‌ సముదాయించి తనతో పాటు సమావేశ మందిరంలో ఉన్న ఛాంబర్‌కు తీసుకువెళ్లి సమస్యను తెలుసుకున్నారు. తహసీల్దార్‌ గణపతిని పిలిపించి సమస్యకు పరిష్కారం చూపించే చర్యలు చేపట్టారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని 14 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా భూసమస్యకు పరిష్కారం చూపించకపోవడంతోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు వృద్ధురాలు తెలిపింది. పాత్రునివలస రెవెన్యూ పరిధి 301`2, 302`2, 303`2, 304`2, బలగ రెవెన్యూ పరిధి 307`9లో వారసత్వంగా వచ్చిన భూమిని న్యాయస్థానం ఆదేశాల ప్రకారం తనకు ఏడోవంతు వాటాను అప్పగించాలని వృద్ధురాలు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయితే ఆమె చూపించిన భూమి ప్రస్తుతం లే`అవుట్‌ వేసి క్రయవిక్రయాలు జరిగిపోయి, ఆవాసాలుగా మారిపోయాయి. బాధితురాలి అన్నదమ్ములు విక్రయించిన భూమి వారసత్వంగా వచ్చినది కాదని, స్వార్జితమని వారి వద్ద ఉన్న పత్రాలు, రికార్డుల ప్రాప్తికి రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న భూములన్నీ క్రయవిక్రయాలు జరిగిపోయాయని, దీనిపై న్యాయస్థానంలో కేసు పెండిరగ్‌లో ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకువెళ్లారు. న్యాయస్థానంలో వివాదం పెండిరగ్‌లో ఉన్నందున దీనిపై రెవెన్యూపరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని రెవెన్యూ అధికారులు చేతులెత్తేశారు.

ree

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page