top of page

చిరంజీవిపై బాలకృష్ణ సెటైర్స్‌!

  • Guest Writer
  • 2 days ago
  • 2 min read


ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసిపోయారు కానీ, గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం అధిపత్య పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కసును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

రాజకీయాలు అంటే ఎమోషన్‌ కాదు. అమితాబ్‌ బచ్చన్‌ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. గొప్ప నాయకుడిని ఓడిరచి పార్లమెంట్‌కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్‌ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు. మా బ్లడ్‌ వేరు బ్రీడ్‌ వేరు...అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబు అప్పట్లో గట్టిగానే కౌంటరిచ్చేవారు.

బ్లడ్‌, బ్రీడ్‌ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్‌, చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు. 2014 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ సాయంతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్‌ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటైర్లు వేశారు. జనసేన సభలకు వెళ్లే వారు అలగాజనం అంటూ బాలకృష్ణ హేళనగా మాట్లాడారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. అయితే తాజాగా బాలకృష్ణ మరోసారి తన నోటికి పని చెప్పారు. పద్మభూషణ్‌ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా మాదిరిగానే ఇలా 50 ఏళ్లు హీరోగా నటించిన వారు ఎవరూ లేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీపై కూడా మాట్లాడారు.

రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చారు.నామరూపాలు లేకుండా పోయారు. అడ్రస్‌ లేకుండా పోయారని చెప్పి కాస్తా ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశించి చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన తన పార్టీని ముందుకు నడిపించలేకపోయారు. దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత చిరంజీవి క్రియాశీల రాజకీయల నుంచి తప్పుకున్నారు. దీనిలో భాగంగానే చిరంజీవిని ఉద్దేశించే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

` వన్‌ ఇండియా.కామ్‌ సౌజన్యంతో...

యుద్ధం హడావుడిలో ఇవాళ ఆత్రేయ జయంతి అని గుర్తొచ్చింది..

భ్రమలో లేపిన తొలి జాములకు

సమయం కుదిరిన సందె వెళలకు

నిన్నూ నన్ను కన్న వాళ్ళకు

నిన్నూ నన్ను కన్న వాళ్ళకు

మనకై వేచే ముందు నాళ్ళకు

కోటి దండాలు శతకోటి దండాలు..

రాసిన ఆత్రేయకూ కోటి దండాలే..

బాగా పెద్ద వర్షం కాదు కానీ చినుకుల్లా వర్షం పడుతుంటే.. కార్లో డ్రైవర్‌తో అతను కబుర్లు చెప్తూ రోడ్డు వేపు చూసేసరికి ఒక జంట గబగబా దగ్గరగా ఉన్న చెట్టు దగ్గరకి వెళ్లి నిలబడటం చూసి...’’చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే .’’.అనే పదాలతో ఒకపాట పుట్టించేసాడతను.

నేనైతే ఏ పచ్చిమిరపకాయ బజ్జిలో,పకోడీ లో కొనుక్కు తినాలనుకుంటా.

వెన్నెల్లో ఉన్న చందమామకు ,దూరం గా ఉన్న గాళ్‌ ఫ్రెండ్‌ కి సంబంధం కుదిర్చి ‘‘జాబిల్లికోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై’’అని పాడిరచేసాడతను..

ుష్ట్రవ వీశీశీఅ ఱం జుaత్‌ీష్ట్రఃం శీఅశ్రీవ అa్‌బతీaశ్రీ ంa్‌వశ్రీశ్రీఱ్‌వ ఒక్కటే కాదురా తింగర సన్నాసీ అదో అద్భుతం అని డిప్ప మీద నాలుగు తగిలించి చెప్పకుండా పాట లా రాయడం మాత్రమే తెలిసిన భాషాభిమాని.

ఇక మనసు అనే పదం తో బోల్డన్ని ప్రయోగాలు చేశారాయన.

చాలా గొప్ప మనసున్న పాటలు ,ఒక మూడు తరాలు మర్చిపోలేని పదాలు అందించి 70 ల్లో యువతకి కావాల్సినంత స్టఫ్‌ ఇచ్చేసిన అతనే సుకవి ‘‘ఆచార్య ఆత్రేయ’’..

మా కాలేజ్‌ రోజులు రెహ్మాన్‌ సునామీలో కొట్టుకున్నా... చలిలో, వర్షంలో తోడుకి మాత్రం ఆత్రేయ మాతో ఉండాల్సిందే..

వేంకటేశ్వరుడికి జోలపాట ‘‘శేషశైల వాస శ్రీవేంకటేశ ‘‘అంటూ రాసి అది ఘంటసాల గారు పాడితే చిన్న పిల్లాడిలా సంతోషపడ్డారట ఆత్రేయ..

‘‘నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు

నను వలచావని తెలిపేలోగా నివురై పోతాను’’...

‘‘మనసు మాసిపోతే మనిషే కాదని

కటికరాయికైనా కన్నీరుందని

వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని

గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని’’

‘‘చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టేను... పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పేను

యశోదను కానురా నిను దండిరచ... సత్యను కానురా నిను సాధించ.’’.

ఇలాంటి బరువైన సాహిత్యం రాసిన ఆచార్య ఆత్రేయ తెలుగువారి ఆస్తి

ఫేస్‌బుక్‌ సౌజన్యంతో...

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page