top of page

చీరకట్టులో అనసూయ.. స్టన్నింగ్‌ స్టిల్స్‌!

  • Guest Writer
  • Jul 29, 2025
  • 2 min read

టాలీవుడ్‌లో యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్‌ ఇప్పుడు మరోసారి తన ట్రెడిషనల్‌ లుక్స్‌తో ఎట్రాక్ట్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ కలర్‌ చీరకట్టులో అనసూయ పోస్ట్‌ చేసిన తాజా ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మురారి చెప్పమ్మ పాటను బ్యాక్‌డ్రాప్‌ మ్యూజిక్‌గా ఎంచుకుని పోస్ట్‌ చేసిన ఈ ఫోటోలు ఆమె అందం, ఎమోషన్‌, క్లాస్‌ను బాగా చూపిస్తున్నాయి. వింటేజ్‌ అండ్‌ ట్రెడిషనల్‌ లుక్‌ మిక్స్‌ లో కనిపించే ఈ చీర అనసూయ అందాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. మినిమల్‌ మేకప్‌, జుమ్కాలు, గాజుల హంగు ఇవన్నీ ఆమె లుక్‌ని మరింత రిచ్‌గా మార్చాయి. ఎక్స్‌ప్రెషన్‌ నుంచి ఎలిగెన్స్‌ వరకూ, అనసూయ తన స్టన్నింగ్‌ స్టైలింగ్‌తో మరోసారి ప్రూవ్‌ చేసింది.

అనసూయ కెరీర్‌ విషయానికి వస్తే, ఆమె మొదట టీవీ యాంకర్‌గా పాపులర్‌ అయినా, తర్వాత జబర్దస్త్‌ షోతో ఓ భారీ క్రేజ్‌ సంపాదించింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన, రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో నటించి వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమెకి వచ్చిన గుర్తింపు ఇప్పుడు కూడా చర్చలో ఉంటుంది. తాజాగా అనసూయ వెబ్‌సిరీస్‌లలో కూడా కనిపిస్తూ నటనకు విభిన్న రంగులు జోడిస్తోంది. ఆమె సెలెక్ట్‌ చేసుకునే పాత్రలు, సోషల్‌ మీడియాలో ఉండే యాక్టివ్‌ నేచర్‌, మరియు స్టైలిష్‌ ఫొటోషూట్లు ఆమెను కంటెంట్‌ క్రియేటర్లకు, ఫ్యాషన్‌ ఫాలోవర్లకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫోటోషూట్లు ప్రతి ఒక్కటీ ప్రత్యేకతను చూపించడంలో విజయవంతం అయ్యాయి. ఈ ట్రెడిషనల్‌ లుక్‌లో అనసూయ అందం మాత్రమే కాదు, ఆమె ఫొటోషూట్స్‌ కూడా స్పెషల్‌ గా నిలుస్తున్నాయి.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

ఏజ్‌ గ్యాప్‌: కస్సుమన్న శృతిహాసన్‌

ఇండస్ట్రీలో హీరోలకి ఉన్నంత లాంగ్‌ కెరీర్‌ హీరోయిన్స్‌కి ఉండదు. చాలామంది హీరోయిన్స్‌ ఒక 10 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగి ఆటోమేటిగ్గా ఫేడ్‌ అవుట్‌ అయిపోతారు. హీరోలు మాత్రం జనరేషన్స్‌ కి కథానాయకులుగా కొనసాగుతుంటారు. అందుకే కథానాయిక విషయంలో ఎప్పుడూ ఏజ్‌ గ్యాప్‌ అనేది ఉండనే ఉంటుంది. దీనిపై ట్రోల్స్‌ కూడా సర్వసాధారణంగానే జరుగుతుంటాయి.

ఇటీవల థగ్‌ లైఫ్‌ సినిమాలో కమల్‌ హాసన్‌, త్రిషతో రొమాన్స్‌ చేయడం సోషల్‌ మీడియాలో చాలా హాట్‌ టాపిక్‌ అయింది. డైరెక్టర్‌ మణిరత్నం దీనిపై స్పందిస్తూ ’’మీరు రెండు పాత్రలనే చూడండి. కమలహాసన్‌, త్రిషని ఎందుకు చూస్తున్నారు. ఆ ఏజ్‌ గ్యాప్‌ రిలేషన్‌షిప్‌ మన సొసైటీలో ఉన్నాయి. సొసైటీలో ఉన్న పాత్రలనే తెరమీద చూపించడం జరుగుతుంది’’ అని సమాధానం ఇచ్చారు.

తాజాగా శృతిహాసన్‌కి ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురైంది. కూలీ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తుంది శృతి. ఆమెది హీరోయిన్‌ పాత్ర కాదు అయినప్పటికీ రజినీకాంత్‌ ఉండడంతో ఆటోమేటిక్‌గా అలాంటి ప్రశ్న ఒకటి తలెత్తుతుంది. ఇదే ఏజ్‌ గ్రూప్‌ గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేసింది.

’’నాకు ఎవరి సంగతి తెలియదు. నేను ఏజ్‌ సంగతి పట్టించుకోను. మాట్లాడుకునే వాళ్లు బోలెడు మాట్లాడుకుంటారు. నా వరకు నాకు వచ్చిన పాత్రను చేయడమే నాకు తెలుసు. ఒక పాత్రనే చూస్తాను తప్పితే అందులో ఏజ్‌ ని చూడను’’ అని కాస్త కరుకుగానే సమాధానం చెప్పింది శృతి.

కూలీలో స్ట్రాంగ్‌ విమెన్‌ క్యారెక్టర్‌ చేసిందట శృతి. లోకేష్‌ కనకరాజు సినిమాలన్నీ చాలా డార్క్‌ జానర్లో, అలాగే కేవలం మగవాళ్లకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందులో శృతిహాసన్‌కి మాత్రం చాలా బలమైన ఒక స్త్రీ పాత్రని చేసే అవకాశం దొరికిందట. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేసిందట. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

-తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...


సిద్ధు.. మాంగల్యం కట్టే సమయం

డీజీ టిల్లు ఇచ్చిన జోరుకి జాక్‌ అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ నుంచి మరో కొత్త సినిమా ముస్తాబౌతోంది. స్టైలిస్ట్‌ నీరజా కోన తొలిసారి మెగాఫోన్‌ పట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌ లో తెలుసు కదా సినిమా రెడీ అవుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. థమన్‌ మ్యూజిక్‌. తాజాగా ఈ సినిమా నుంచి మల్లికా గంధ పాటని రిలీజ్‌ చేశారు.

తమన్‌ మంచి మెలోడీ చేసి చాలా కాలమైయింది. ‘కళావతి’ పాట తర్వాత మళ్ళీ అంతటి వైరల్‌ మెలోడీ రాలేదు. ఇప్పుడు తెలుసు కదా కోసం ఆ దారిలో ఓ ట్యూన్‌ ప్రయత్నించాడు. సిద్‌ శ్రీరామ్‌ తో పాడిరచారు. ట్యూన్‌ క్యాచి గానే వుంది. సిద్ధు, రాశీ ఖన్నా కెమిస్ట్రీ కొత్తగా అనిపించింది.

-తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page