top of page

లుక్‌తో అంచనాలు పెంచుతున్న చైతూ

  • Guest Writer
  • 4 hours ago
  • 4 min read

‘తండేల’ సినిమా సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్య కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఎంపిక కూడా అలాగే అనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న నాగచైతన్య మూవీ అప్‌డేట్ వచ్చింది. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వృషకర్మ రూపొందుతున్న విషయం తెల్సిందే. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ పై ఇటీవలే క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు చైతన్యను చూడని విధంగా దర్శకుడు కార్తీక్ చూపించబోతున్నాడు. అంతే కాకుండా నాగ చైతన్య యొక్క గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. విరూపాక్ష సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కార్తీక్ ఈ సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.

నాగ చైతన్య సోషల్ మీడియా పోస్ట్.. తాజాగా నాగ చైతన్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీయింగ్ అర్జున్ అంటూ జిమ్‌లో డంబెల్స్‌తో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేయడంతో పాటు, ఆన్ సెట్ ఫోటోలు, సినిమాలోని లుక్ ను రివీల్ చేయడం ద్వారా నాగ చైతన్య మరోసారి సినిమా గురించి చర్చ జరిగేలా చేశాడు. అర్జున్ పాత్ర కోసం నాగ చైతన్య ఎంతగానో కష్టపడుతున్నాడు. జిమ్‌లో ఆయన వర్కౌట్స్ గంటల పాటు సాగుతున్నట్లు ట్రైనర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే నాగ చైతన్య సిక్స్ ప్యాక్ బాడీతో చాలా ఫిట్ గా కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ఫిట్‌గా నాగ చైతన్య కనిపిస్తున్నాడు అంటూ ఈ ఫోటోలకు అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య లుక్ కి అంతా ఫిదా కావడం మాత్రమే కాకుండా వృషకర్మ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

తండేల్ సినిమా తర్వాత.. సాధారణంగా నాగ చైతన్య అనగానే ఒక సాఫ్ట్ కార్నర్ కుర్రాడు గుర్తుకు వస్తాడు. కానీ ఈ సినిమా తర్వాత మొత్తం మారబోతుంది. తండేల్‌తో కొంత వరకు తన ఇమేజ్‌ను మార్చుకున్న నాగ చైతన్య ఇప్పుడు పూర్తిగా తన ఇమేజ్ ను మార్చుకునే పనిలో ఉన్నాడట. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలు గతంలో చేసిన నాగ చైతన్య, అందుకు తగ్గ ఫిజిక్ ను ట్రై చేయలేదు. కానీ ఈసారి పాత్రలకు తగ్గట్లుగా ఫిజిక్ ను రెడీ చేసుకుంటూ, తన అభిమానులను నూటికి నూరు శాతం సంతృప్తి పరచడం కోసమే అన్నట్లుగా నాగ చైతన్య సినిమాలకు రెడీ అవుతున్న తీరు చూస్తుంటే ముచ్చటేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నాగ చైతన్య సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ క్వాలిటీ పెంచాడనే టాక్ కూడా ఉంది. మరో వంద కోట్ల మూవీ లోడ్ కావాలి అంటే ఇంతకు మించి అన్నట్లుగా నాగ చైతన్య కష్టపడాల్సిందే అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ మూవీ.. వృషకర్మ సినిమా నిర్మాణంలో సుకుమార్ భాగస్వామ్యం కావడంతో పాటు, ఆయన స్క్రిప్ట్ వర్క్ సలహాలు కచ్చితంగా వర్కౌట్ అవుతాయనే విశ్వాసంను అంతా వ్యక్తం చేస్తున్నారు. విభిన్న చిత్రాలతో దర్శకుడు కార్తీక్ దండు ముందు ముందు స్టార్ దర్శకుల జాబితాలో చేరబోతున్నాడనే విశ్వాసం కూడా వ్యక్తం అవుతోంది. మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో నాగ చైతన్య బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటడం ఖాయం. వంద కోట్లతో మరోసారి బాక్సాఫీస్ ను నాగ చైతన్య షేక్ చేయాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు చైతూ జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

- తుపాకి.కామ్ సౌజన్యంతో...


‘రామాయణ 2’.. నితేష్ తివారీ ధీమా.?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందంటేనే ఎన్నో లెక్కలు ఉంటాయి. అలాంటిది పార్ట్ 1 విడుదల కాకముందే, రెండో భాగం షూటింగ్ మొదలుపెట్టడం అనేది మామూలు విషయం కాదు. గతంలో రాజమౌళి ‘బాహుబలి’కి, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన’కు ఇలాంటి సాహసమే చేశారు. ఇప్పుడు నితేష్ తివారీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ విషయంలో అదే బాటలో పయనిస్తున్నారు. అసలు మొదటి భాగం ఫలితం తెలియకుండానే రెండో భాగంపై ఇంతటి ధీమా చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ?దీనికి ప్రధాన కారణం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక ప్రత్యేక స్క్రీనింగ్ అని తెలుస్తోంది. పార్ట్ 1 కి సంబంధించిన రఫ్ కట్‌ను అక్కడ ప్రదర్శించగా, విజువల్స్ కథా గమనం చూసి మేకర్స్ షాక్ అయ్యారట.

హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో సినిమా అద్భుతంగా వచ్చిందనే నమ్మకం కలగడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్ట్ 2 పనులను వేగవంతం చేశారు. రన్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ఇప్పటికే తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడంతో, అదే ఫ్లోలో లంక ప్రయాణానికి సంబంధించిన కీలక ఘట్టాలను కూడా పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు.?ఇలా రెండు భాగాలను ఏకకాలంలో ప్లాన్ చేయడం వెనుక ఒక బలమైన ప్లస్ పాయింట్ ఉంది. నటీనటుల లుక్స్ వారి బాడీ లాంగ్వేజ్‌లో ఎటువంటి తేడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా రామాయణం లాంటి ఇతిహాసాన్ని వెండితెరపై చూపిస్తున్నప్పుడు కంటిన్యూటీ చాలా ముఖ్యం. లంక వైపు సాగే ప్రయాణం, హనుమంతుడిగా సన్నీ డియో ఎంట్రీ వంటి కీలక సీన్లు పార్ట్ 2 లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒక షెడ్యూల్ పూర్తి కాగానే వెంటనే రెండో భాగం సెట్స్‌ను సిద్ధం చేసి, షూటింగ్ గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు.

అయితే ఇందులో రిస్క్ కూడా లేకపోలేదు. సుమారు రూ. 4000 కోట్ల భారీ పెట్టుబడితో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ 1 ఫలితంపైనే పార్ట్ 2 భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మొదటి భాగానికి ఆశించిన స్పందన రాకపోతే రెండో భాగం పరిస్థితి ఏంటనే ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ రామాయణంకు ఉండే బజ్ వేరు, దాన్ని సరైన పద్ధతిలో విజువల్ వండర్‌గా చూపిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనేది మేకర్స్ నమ్మకం. పైగా యాష్ లాంటి స్టార్ రావణుడిగా నటిస్తుండటం సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో పెద్ద క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది.

ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షెడ్యూల్‌లో రాముడి వనవాసం తర్వాత జరిగే కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. సీతమ్మ అపహరణ తర్వాత రాముడిలోని అలజడి, ఆపై హనుమంతుడిని కలవడం వంటి భావోద్వేగ సీన్లతో పాటు భారీ యుద్ధ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేశారు. టెక్నాలజీ పరంగా కూడా ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సలహాలతో విజువల్ ఎఫెక్ట్స్‌ను రూపొందిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం విడుదల చేసేలా మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. ‘రామాయణ’ టీమ్ చేస్తున్న ఈ సాహసం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా కనిపిస్తోంది. మరి 2027లో రాబోయే రెండో భాగం నాటికి మొదటి భాగం ఎటువంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.?

-తుపాకి.కామ్ సౌజన్యంతో...

2028 సంక్రాంతి ప్లానుల్లో మెగాస్టార్

2026 సంక్రాంతి సీజన్ మొన్నే గడిచింది. 2027 సంక్రాంతికి ఇంకా 10 నెలల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే 2028 సంక్రాంతి స్కెచ్‌లు వేసుకోవడంలో టాలీవుడ్ బిజీ అయిపోయింది.

సంక్రాంతి సీజన్ అనేది బంగారు బాతు అనే సంగతి టాలీవుడ్ కి అర్థమైంది. రెండు మూడేళ్ల నుంచి సంక్రాంతి బాక్సాఫీస్ చాలా రష్ గా కనిపిస్తోంది. యావరేజ్ సినిమాలు సైతం సంక్రాంతి దగ్గర భారీ వసూళ్లు మూటగట్టుకొంటున్నాయి. అందుకే సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది టాలీవుడ్. 2027 సంక్రాంతి బెర్తులు అప్పుడే నిండుకున్నాయి. ఏఏ సినిమాలు రాబోతున్నాయి అనే విషయంలో దాదాపు ఓ స్పష్టత వచ్చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు 2027ని టార్గెట్ చేసేశారు.

2028 సంక్రాంతికి ఎలాంటి సినిమాలు రావాలి అనే విషయంలో ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలెట్టేశారు. ఈ సంక్రాంతికి చిరు నుంచి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వచ్చింది. 2027 సంక్రాంతికి బాబి సినిమా రిలీజ్ చేస్తారు. ఆ తరవాత.. శ్రీకాంత్ ఓదెల సినిమా మొదలవుతుంది. 2027లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ తరవాత చిరు చేయబోయే సినిమా విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చిరుకి ఓ కథ చెప్పారని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కథ చిరంజీవికి బాగా నచ్చిందని, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాని 2028 సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నారట. ఒకవేళ శ్రీకాంత్ ఓదెల సినిమా ఆలస్యమైతే, అప్పుడు శ్రీనివాస్ సినిమా ముందుగా మొదలెడతారు. కాకపోతే శ్రీకాంత్ ఓదెల కథ ముందు ఒప్పుకొన్నారు కాబట్టి, ఆ ముందు ప్రాజెక్టే సెట్ అయ్యే ఛాన్సుంది.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...




Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page