top of page

జీఎస్టీ తగ్గినా.. ధరలెందుకు తగ్గలేదు?

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Jan 28
  • 2 min read
  • గతం కంటే పెరిగిన నూనె ధరలు

  • మందుల ఎమ్మార్పీ యధాతథం

  • అపరాల మీద తగ్గినా కనపడని ప్రభావం

  • కాస్మోటిక్స్ ధరలు తగ్గించకుండా ఆఫర్ల మాయాజాలం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ స్లాబ్ రేట్లు గణనీయంగా తగ్గించారంటూ కూటమి ప్రభుత్వ నేతలు అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి వారం రోజుల పాటు ప్రచారాన్ని ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో జీఎస్టీ లేని వస్తువుల ధరలు తగ్గుదల ఫలితం సగటు వినియోగదారుడికి ఎక్కడా కనిపించడంలేదు. నలుగురు ఉండే ఒక కుటుంబంలో పండగకో, పబ్బానికో కిరాణా పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతీనెల తాము తెస్తున్న నిత్యావసర వస్తువుల ఓవరాల్ బిల్లులో ఏమాత్రం తేడా కనిపించకపోవడంతో జీఎస్టీ తగ్గిందా? లేదా ప్రచారార్భాటంలో భాగంగా ప్రభుత్వం ఇలాంటి పనికి పూనుకుందా అనే అనుమానం వినియోగదారుడికి కలుగుతోంది. వాస్తవానికి జీఎస్టీతోనే దేశం నడుస్తున్నా రాష్ట్రంలో కొన్ని వస్తువుల మీద సుంఖాన్ని జీరో శాతం చేశారు. వీటిపై గతంలో 5 శాతం జీఎస్టీ ఉండేది. అంటే.. రూ.100 వస్తువు రూ.105కు అమ్మేవారు. కానీ ఇప్ప్పుడు జీఎస్టీ తగ్గిన తర్వాత వంద రూపాయలకు దొరకాల్సిన ఆ వస్తువు గతంలో మాదిరిగానే రూ.105కు అమ్ముతున్నారు. స్థానికంగా హÃల్‌సేలర్లు దీని మీద సమాధానం దాటవేస్తున్నారు.

ఎప్ప్పుడైతే జీఎస్టీ తగ్గిందో వెంటనే వంటనూనెల ధరలు అమాంతం పెంచేశారు. యుద్ధాలు, క్రూడాయిల్ ధరలు వంటివి ఇంతకు ముందు ఎలా ఉందో జీఎస్టీ తగ్గించినప్పటికీ అలాగే ఉంది. అయినా కూడా ఆయిల్ కంపెనీలు ఈ ధరలు పెంచేశాయి. అంతవరకు రూ.120 నుంచి రూ.128 వరకు లభించిన వివిధ కంపెనీల ఆయిల్ ప్యాకెట్లు ఇప్ప్పుడు జీఎస్టీ తగ్గిన తర్వాత రూ.140 దాటిపోయాయి. ఇదేమంటే.. ఇందులో జీఎస్టీ లేదని, కేవలం ఎమ్మార్పీ మాత్రమేనని వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతికి వంటనూనె వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్ప్పుడే దీన్ని పెంచేశారు. సాధారణంగా ఆయిల్ ప్యాకెట్ మీద ఎమ్మార్పీ స్టాంప్ వేసుకోడానికి వీలుగా ప్యాకేజ్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది వ్యాపారులు జీఎస్టీ తగ్గిన వెంటనే తమ దగ్గర ఉన్న స్టాకును తక్కువ ధరకు అమ్మలేక అప్ప్పుడే ఎమ్మార్పీ పెంచి స్టాంప్ కొట్టేశారు. దీన్నే ఆ తర్వాత కాలంలో ఆయిల్ కంపెనీలు కూడా ఫాలో అయిపోయాయి. ఇక పప్ప్పులు, ఉప్ప్పులు, పంచదార వంటి వాటి మీద కూడా జీరో శాతం సుంకం ఉంది. దీన్ని గ్రేడింగ్‌ల పేరుతో జీఎస్టీ 5 శాతం ఉన్నప్ప్పుడు ఎంత ధర ఉందో, ఇప్ప్పుడూ అంతే ధరకు అమ్ముతున్నారు, లేదా ఒక రూపాయి ఎక్కువకే అమ్ముతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే, గతంలో మూడో రకం కందిపప్ప్పు మార్కెట్‌లోకి వచ్చేదని, ఇప్ప్పుడు మొదటిరకం అమ్ముతున్నామంటూ దబాయిస్తున్నారు. సగటు మహిళ పప్ప్పును ఉడకబెట్టినప్ప్పుడే దాని సత్తాను పోల్చేయగలదు. కానీ వ్యాపారులు మాత్రం దీనికి రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇందుకు కారణం.. ధరలు తగ్గించడం ఇష్టంలేకే. ఇక టూత్‌పేస్టులు, సబ్బులు, స్నోలు, పౌడర్లు వంటి కాస్మోటిక్స్ మీద జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల ఒక పేస్టు మీద ఎంత తగ్గుతుందో సాధారణ వినియోగదారుడు తెలుసుకునే పరిస్థితి లేకుండా కంపెనీలు చేశాయి. ఎలా అంటే ఆఫర్లు పెట్టి, వన్ ప్లస్ వన్ అనో, టూ ప్లస్ వన్ అనో ఆయా బ్రాండ్ల బట్టి బలవంతంగా ప్రొడక్ట్‌ను పుష్ చేస్తున్నారు. దీంతో ఒక్క పేస్టో, ఒక్క సబ్బో ఎంతకొస్తుందో ఎమ్మార్పీ లెక్క కట్టడం సాధ్యపడటంలేదు. ఎందుకంటే జీఎస్టీ అనే పద్ధతి లేకముందే ఏడాదిలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి కాస్మోటిక్ కంపెనీలు ఆఫర్లు ఇస్తునే ఉంటాయి. అటువంటి ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చినవో, జీఎస్టీ తగ్గించి ఇచ్చినవో చెప్పడం వ్యాపారస్తులకు కూడా చేతకావడం లేదు. పంచదార దగ్గర్నుంచి ఉప్ప్పు వరకు జీఎస్టీ తగ్గిన ఫలితం కనిపించడంలేదు. ఇక బీపీ, షుగర్, కొలస్ట్రాల్ వంటి మందుల విషయంలో జీఎస్టీ గణనీయంగా తగ్గింది. కానీ పాత స్టాకు ఉందనే కారణంతో ఇప్పటికీ అవే ధరలకు మందులు విక్రయిస్తున్నారు. ఎందుకంటే.. మార్చి 31 వరకు పాత స్టాకును అమ్ముకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జీఎస్టీ తగ్గించేనాటికి ఏ ఉత్పత్తిదారుడి దగ్గరైనా నెల రోజులకు సరిపడే స్టాకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత తగ్గిన జీఎస్టీతో ఎమ్మార్పీ ముద్రించాలి. ఎలాగూ మార్చి 31 వరకు టైముంది కాబట్టి ఇప్పటికీ కొత్త స్టాక్‌కు కూడా పాత రేట్లే ముద్రింది మార్కెట్‌లోకి వదులుతున్నారన్న ఆరోపణలున్నాయి. మెడికల్ షాపులు విక్రయించే హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా లాంటి ఫుడ్ పౌడర్స్ ధరలు మాత్రం 18 నుంచి 12 శాతం జీఎస్టీకి రావడంతో గణనీయంగా తగ్గాయి. ఎందుకంటే.. వీటికి ఎక్స్‌పెయిరీ డేట్ తక్కువ. లోపల పౌడర్ గడ్డ కట్టేయకుండా వీలైనంత వేగం వదిలించుకోవాలి. ఇలా నిత్యం అవసరమైన వాటిపై కాకుండా సంబంధం లేనివాటి ధరలు మాత్రమే జీఎస్టీలో తగ్గినట్లు కనిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page