top of page

టౌన్ ప్లానింగ్‌పై ఏసీబీ పంజా

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 3 hours ago
  • 1 min read
  • రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో దాడులు

  • అందులో భాగంగా శ్రీకాకుళంలో సోదాలు

  • కంప్యూటర్లు, రికార్డుల పరిశీలన, వివరాల సేకరణ

  • అవినీతి ఆరోపణలపై ఫిర్యాదుల ఫలితమేనని చర్చ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు పరిశీలించి వాటి ఆధారంగా అధికారులు, సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక, పురపాలక సంఘాý టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సీఐలు ఎస్‌వీ రమణ, భాస్కరరావు ఆధ్వర్యంలో మందుగా ఆ విభాగంలోని అధికారులు, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హాజరు పట్టీని పరిశీలించారు. దాడులు చేసే సమయానికి హాజరుపట్టీలో సంతకాలు చేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం విభాగాధిపతి, టౌన్ సŸర్వేయర్, సెక్షన్ సీనియర్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది వద్ద ఉన్న రికార్డులను పరిశీలించారు. జాబ్‌చార్ట్ ప్రకారం విధులు నిర్వహిస్తున్నారా లేదా అని ఆరా తీసి, రికార్డులను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హర్డ్ డిస్క్‌ల్లో ఉన్న డేటాను తమ వెంట తెచ్చిన ల్యాప్‌టాప్‌లకు అనుసంధానం చేసి వివరాలు పరిశీలించారు. ఈ దాడులను సాయంత్రం వరకు కొనసాగించారు.


నగరపాలక సంస్థలో అవినీతికి, అక్రమాలకు ఎక్కువ ఆస్కారం ఉన్న టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు కొత్తేమీ కాదు. ఈ విభాగం ఉద్యోగుల అవినీతి కారణంగా భవన నిర్మాణాల్లో నిuంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుందన్న ఆరోపణలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. అక్రమ నిర్మాణదారులతో అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు పెద్దసంఖ్యలో అందుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా అందే అన్ని రకాల సేవల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్న వైనం అనేక సందర్భాల్లో వెలుగు చూసింది. ఏసీబీ దాడులు చేసి టౌన్ ప్లానింగ్ ఈ విభాగంలో అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని బదిలీలతో సరిపెట్టేశారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న దాడులపై స్పందించడానికి ఏసీబీ అధికారులు నిరాకరించారు. రాష్ట్రస్థాయి ఆదేశాలతో రికార్డులు పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్పారు. దాడులు, సోదాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page