top of page

టాలీవుడ్‌ కి దూరమవనున్న శ్రీలీల..?

  • Guest Writer
  • Jun 16, 2025
  • 3 min read

టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రీలీల ఈమధ్య కాస్త దూకుడు తగ్గించినట్టు కనిపించినా మళ్లీ అమ్మడు ఫాం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఐతే ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్‌ లో అమ్మడు ఆషికి 3 సినిమాలో నటిస్తుంది. అనురాగ్‌ బసు డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తుండగా శ్రీలీల లక్కీ ఛాన్స్‌ అందుకుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్‌ ఇంప్రెస్‌ చేసింది.

ఆషికి 2 సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అవ్వగా ఆషికి 3 సినిమా అంతకుమించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఐతే ఆషికి లవ్‌ స్టోరీస్‌ కి బాలీవుడ్‌ లో సూపర్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆషికి 2 తర్వాత శ్రద్ధ కపూర్‌ టాప్‌ రేంజ్‌ కి వెళ్లింది. ఐతే ఇప్పుడు ఆషికి 3 చేస్తున్న శ్రీలీలకు కూడా బీ టౌన్‌ స్టార్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆషికి 3 సినిమా అనుకున్న విధంగా యూత్‌ ఆడియన్స్‌ కి ఎక్కేస్తే మాత్రం శ్రీలీల అక్కడ స్టార్‌ డం తెచ్చుకున్నట్టే. సౌత్‌ లో ఆల్రెడీ తన మార్క్‌ నటనతో అలరిస్తూ వస్తున్న శ్రీలీల బాలీవుడ్‌ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ లో చేస్తున్న తొలి సినిమానే ఒక బ్లాక్‌ బస్టర్‌ ఫ్రాంచైజీ అవ్వడం తో అమ్మడి మీద అందరి దృష్టి ఉంది.

తప్పకుండా ఆషికి 3 సినిమా సక్సెస్‌ అయితే మాత్రం శ్రీలీలని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. అంతేకాదు హిందీ పరిశ్రమలో బిజీ అయితే మాత్రం కచ్చితంగా టాలీవుడ్‌ కి శ్రీలీల దూరమయ్యే అవకాశం ఉంది. తెలుగులో ప్రస్తుతం శ్రీలీల రవితేజతో మాస్‌ జాతర, పవన్‌ కళ్యాణ్‌ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలు చేస్తుంది. తమిళ్‌ లో కూడా శివ కార్తికేయన్‌ పరాశక్తి లో నటిస్తుంది. సో ఆషికి 3 సక్సెస్‌ని బట్టి హిందీలో శ్రీలీల కెరీర్‌ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. శ్రీలీల కేవలం యాక్టింగ్‌ తోనే కాదు తన డ్యాన్స్‌ తో కూడా మెస్మరైజ్‌ చేస్తుంది. బాలీవుడ్‌ ఆడియన్స్‌ డ్యాన్స్‌ ప్రియులు కాబట్టి శ్రీలీల డ్యాన్స్‌ లకు కూడా వాళ్లు ఎట్రాక్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంటుంది. ఆషికి 3 టైంలోనే కార్తీక్‌ ఆర్యన్‌తో క్లోజ్‌ గా ఉంటున్న శ్రీలీలని చూసి కార్తీక్‌ తో ఆమె డేటింగ్‌ లో ఉందంటూ హడావిడి చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ ఒక సూపర్‌ క్లాసిక్‌ సినిమాతో జరగడం ఆమె లక్కీ అని చెప్పొచ్చు.


చెత్తకుప్పలో దొరికిన పిల్లను హీరోయిన్‌ చేశాడు!!

మిథున్‌ చక్రవర్తి ఓ రోజూ టీ తాగుతూ పేపర్‌లో కనిపించిన ఆర్టికల్‌ చదువుతున్నారు. అందులో ఓ చిన్నారి ఏడుస్తూ చెత్తడబ్బా దగ్గర కనిపించింది. ఆ పాపని గమనించి ఒకరు ఇంటికి తీసుకెళ్లారు అని ఉంది. అది చదవగానే ఆ పాపని తాను తీసుకోవాలనుకున్నాడు మిథున్‌. పాపకు, తనకూ ఏదో తెలియని అనుబంధం ఉందనిపించింది. అంతే భార్య యోగితా బాలితో మాట్లాడి ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తరువాత గవర్నమెంట్‌ రూల్‌ ప్రకారం దత్తత కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు మిధున్‌ దంపతులు. ఆ చిన్న పిల్ల నేటి ప్రముఖ నట దిశాని చక్రవర్తి.

దిశానీ చక్రవర్తి న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ నుండి యాక్టింగ్‌ కోర్సును నేర్చుకొని. సోదరుడు ఉష్మే చక్రవర్తి దర్శకత్వం వహించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘‘హోలీ స్మోక్‌’’తో నటిగా రంగ ప్రవేశం చేసింది. దిశ ‘‘అండర్‌ పాస్‌’’, ‘‘సబ్టిల్‌ ఏషియన్‌ డేటింగ్‌ విత్‌ పిబిఎమ్‌’’ వంటి లఘు చిత్రాలలో కూడా కనిపించింది.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...


గేర్‌ మార్చిన స్వీట్‌ బ్యూటీ అనుష్క!!

అనుష్క మళ్లీ జోరు పెంచింది. కెరీర్‌ పీక్‌ లో వున్నప్పడే సినిమాలకి విరామం ఇచ్చింది స్వీటీ. ‘సైజ్‌ జీరో’ సినిమా తర్వాత శరీరంలో వచ్చిన మార్పుల వల్ల అనూహ్యంగా బరువు పెరిగింది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్లీ మామూలు స్థితికి రాలేకపోయింది. దీంతో చాలా విరామం తీసుకున్న అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రంతో తిరిగి వచ్చింది. అందులో కూడా ఆమె బొద్దుగా కనిపించింది. ఆ తర్వాత ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంలో నటించింది. ఆ సినిమా డీసెంట్‌ విజయం సాధించింది. ఇప్పుడు ‘ఘాటి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఇంతవరకు ప్రతి సినిమా మధ్య సుమారు రెండేళ్ల విరామం తీసుకుంటూ వచ్చిన ఆమె, ఇకపై అలాంటి తీరుకు గుడ్‌బై చెబుతోంది. వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో కొత్త కథలు వినడం ప్రారంభించింది. ‘జైలర్‌ 2’లో అనుష్క కీలక పాత్రలో కనిపించనుందని టాక్‌. అలాగే లోకేష్‌ కనగరాజ్‌ యూనివర్స్‌లో వచ్చే ఓ సినిమాలో కూడా ఆమె ఉంటుందని సమాచారం. మరోవైపు ‘భాగమతి 2’ చాలా కాలంగా వార్తల్లో వుంది. ఈ ఏడాదిలో ఆ సీక్వెల్‌ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. సోలోగా 50 కోట్లు కలెక్ట్‌ చేయగల హీరోయిన్‌ అనుష్క. ఇప్పుడు ఆమె సినిమాల జోరు పెంచడం ఇండస్ట్రీకి ప్లస్సు.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...


ప్రకృతి పావని తన నీలి బికినీ చిత్రంతో ఈ వేసవిలో అందరి దృష్టిని ఆకర్షించనుంది. పచ్చని చెట్లతో చుట్టుముట్టబడిన కొలను దగ్గర, నేపథ్యంలో నీటి అందమైన దృశ్యాన్ని చూస్తూ ఈ గ్లామరస్‌ నటి నమ్మకంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది. ప్రకృతి పావని భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఆమె చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న పేరు, సినిమాలు మరియు టీవీ షోలలో తన పాత్రలకు కీర్తిని సంపాదించుకుంది. హౌ డస్‌ ఇట్‌ ఫీల్‌ (2023) మరియు ఓయిజా (2019) చిత్రాలలో తన నటనకు నటి మంచి గుర్తింపు పొందింది.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page