top of page

డీఎంహెచ్‌వో అనితకు బదిలీ

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 1 day ago
  • 2 min read
  • కొత్త అధికారిపై వీడని సస్పెన్స్

  • సిక్కోలుకు రావడానికి భయపడిపోతున్న సివిల్ సర్జన్లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణిగా పని చేస్తున్న డాక్టర్ అనితను బదిలీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు బహిర్గతం కావాల్సి ఉంది. రిమ్స్‌లో సీఎసఆరఎంవోగా పని చేస్తున్న అనితను తీసుకువచ్చి డీఎంహెచ్‌వోగా కొద్ది కాలం క్రితం నియమించారు. అంతవరకు ఇక్కడ డీఎంహెచ్‌వోగా పని చేసిన అధికారి ఏసీబీ ట్రాప్ కావడంతో రిమ్స్ నుంచి అనితను ఇక్కడకు బదిలీ చేశారు. ఇప్ప్పుడు తాజాగా ఈమెను కాకినాడ బదిలీ చేసినట్లు తెలుస్తుంది. ఆమె కూడా ఎప్పట్నుంచో కాకినాడ గాని, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు గాని డీఎంహెచ్‌వోగా బదిలీ కావాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆమెను కాకినాడకు బదిలీ చేశారని తెలుస్తుంది. అయితే అక్కడ ఆరఎంవోగా పోస్టింగ్ ఇస్తున్నారా? లేదూ డీఎంహెచ్‌వోగా బదిలీ చేస్తున్నారా? అనేది ఇంకా తేలలేదు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా డాక్టర్ ప్రభావతిని ప్రభుత్వం నియమించింది. కాకపోతే ఆమె శ్రీకాకుళం రావడానికి ఇష్టపడటంలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభావతి మÖడు జిల్లాల జోనల్ మలేరియా కార్యాలయానికి అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆమె శ్రీకాకుళం రావడానికి ససేమిరా అనడంతో కొత్తవారిని నియమించడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వైద్యఆరోగ్యశాఖామంత్రి శుక్రవారం విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో ఉండటంతో ఆయన్ను కలిసి ప్రభావతి తన అభ్యర్థనను ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జిల్లా నుంచి మంత్రి కార్యాలయం బెండి పద్మజ పేరును ప్రతిపాదించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో విజయలక్ష్మి అనే మరో సివిల్ సర్జన్‌ను కూడా సిఫార్స్ చేశారని భోగట్టా. అందరూ శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా రావడానికి భయపడిపోతున్నారు. ఇక్కడ విపరీతమైన కలక్షన్లు ఉండటం, దీనికి తోడు వైద్యఆరోగ్యశాఖలోనే ఉద్యోగులు రాజకీయాలు చేస్తుండటంతో పాటు ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన దాదాపు ఏడుగురు డీఎంహెచ్‌వోలు ఇప్పటికీ పింఛన్లు తీసుకోని విధంగా కేసులు ఉండటంతో వీరంతా భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఉన్న గ్రూపుతగాదాలు ఇక్కడ డీఎంహెచ్‌వో మెడకు చుట్టుకుంటున్నాయి. వాస్తవానికి ఈ నెల 5వ తేదీలోగా బదిలీలు పూర్తికావాలి. అంటే.. మధ్యలో శనివారం ఒక్కరోజే వర్కింగ్ డే ఉంది. ఈలోగా బదిలీ ఉత్తర్వులు వెలువడితే పైన పేర్కొన్న విధంగా పోస్టింగులు ఉంటాయి. లేదూ అంటే ఈసారికి ఇంతే సంగతులు. లేదూ అంటే రాష్ట్రంలో అర్హులైన కొత్త డీఎంహెచ్‌వోలు, రీజనల్ డైరెక్టర్ల పోస్టుల కోసం పదిమంది సివిల్ సర్జన్ల జాబితా తయారుచేశారు. ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీలు, డీఎంహెచ్‌వోలు క్వాలిఫైడ్ లేరు. కానీ బదిలీల ప్రక్రియ అంటూ జరిగితే, ఈ నెల 5వ తేదీలోపే జరగాలి. లేదంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మేరకు నిలిచిపోతాయి. రాష్ట్రంలో నాలుగు మల్టీజోన్లను ఏర్పాటుచేసి, ఆ పరిధిలో పని చేసే ఉద్యోగులను గుర్తించి, ఆ జోన్‌లోనే వారి సర్వీసును వాడుకునే విధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. దీనికి ఈ నెల 5వ తేదీ వరకు గడువు విధించారు. ఈలోగా బదిలీలు జరగాలి. లేదూ అంటే ఎక్కడివారు అక్కడే ఉండిపోతారు. ఇందుకు ఉదాహరణే టెక్కలి డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరీ కేథరిన్ రాజమండ్రి బదిలీ చేయించుకున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page