డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
- SATYAM DAILY
- 4 hours ago
- 2 min read
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా
అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత
బెంగాల్ మోడల్‌నే బోర్డర్‌లో వాడే అవకాశం

(సత్యండెస్క్, శ్రీకాకుళం)
గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతిపక్ష హÃదా లేకుండా చేశారంటే నమ్మలేం. కానీ అదే వాస్తవం. వెస్ట్‌బెంగాల్ మాదిరిగానే అసోం కూడా పొరుగు దేశంతో సరిహద్దు పంచుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా నియోజకవర్గాల పునర్విభజనను తెర మీదకు తీసుకువచ్చి తనకు అనుకూలంగా విభజన చేయడం ద్వారా ముస్లింల ప్రభావాన్ని కొద్ది నియోజకవర్గాల మీద కాకుండా పెద్ద ఎత్తున చీలికలు తేవడం ద్వారా విపక్షాలకు కనీస సీట్లు రాకుండా చేయగలిగారు. దేశవ్యాప్తంగా భూముల రీసర్వేకు ఆమధ్య నియోజకవర్గాల పునర్విభజన అంశానికి హిమంత బిశ్వశర్మే.
2011లో ఈ ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు శర్మ ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే 2015లో పార్టీ మారిన తర్వాత, ఆయన కేవలం అసోంలోనే కాకుండా పరిసర రాష్ట్రాల్లో కూడా బీజేపీకి కేంద్ర బిందువుగా మారారు. 2001లో కాంగ్రెస్ టికెట్‌పై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఒకే అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన ఆయన, బీజేపీలో చేరి 2021లో ముఖ్యమంత్రయ్యారు. అప్పటి నుంచి తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యం, మతపరమైన వ్యాఖ్యలు, అధికార యంత్రాంగాన్ని పక్షపాత ధోరణితో ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చేశారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు
ముఖ్యంగా మహిళలకు నేరుగా నగదు బదిలీ చేసే ‘అరుణోదోయ’ పథకం, భూ రికార్డులను డిజిటలైజ్ చేస్తూ భూ హక్కులను రక్షించే ‘మిషన్ బసుంధర’ వంటివి బీజేపీ విస్తరణకు తోడ్పడ్డాయి. వీటితో పాటు 2023లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి చర్యలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ఈ మొత్తం ప్రక్రియకు శర్మ సృష్టికర్తగా, ప్రధాన లబ్ధిదారుడిగా నిలిచారు.
అసోంలో బీజేపీ విజయం జాతీయ స్థాయిలో పార్టీ అంతర్గత అధికార సమీకరణలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. హిమంత బిశ్వ శర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడుతున్నారు. 126 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండగా, అధికార కూటమి బలం 102. బీజేపీ కేవలం ప్రతిపక్షాలనే కాకుండా, ప్రాంతీయ పార్టీలను కూడా నామరూపాలు లేకుండా చేసింది. ముక్కలుగా ఉన్న సామాజిక వర్గాలను ఏకం చేస్తూ, రాష్ట్రంలోని భాషా, జాతి రాజకీయాల ప్రభావాన్ని తగ్గించింది.
అయితే, ఈ క్రమంలో అసోంను మతపరంగా తీవ్రంగా విభజించింది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ముస్లింల ప్రాతినిధ్యాన్ని అణచివేసేలా మార్పులు చేయడంతో, కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోరు హిందూ-ముస్లిం వైరుధ్యంగా ప్రతిబింబిస్తోంది. ఇక ఆక్రమణల తొలగింపు పేరుతో చేపట్టిన డ్రైవ్‌లు ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లిం వర్గాలనే లక్ష్యంగా చేసుకున్నాయి. కేవలం 2025లోనే 40వేల మంది నిరాశ్రయులయ్యారు. అసోం ఒక సున్నితమైన సరిహద్దు ప్రాంతం, కాబట్టి అక్కడ పాలన కూడా అంతే సున్నితంగా ఉండాలి. ఎన్నికల్లో గెలవడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్ని పార్టీలకు హక్కు ఉంటుంది. కానీ అది దేశ ప్రయోజనాలను, రాజకీయ వ్యవస్థ దీర్ఘకాలిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జరగాలి.






Comments