top of page

‘‘తమ్ముడు హరికృష్ణ అన్న ఎన్టీఆర్‌..’’

  • Guest Writer
  • Sep 3, 2025
  • 3 min read

నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరులో తాతయ్య దగ్గర నడిచింది. తాత గారికి హరికృష్ణను హీరో చేయాలి అని కోరిక. నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడుగా కృష్ణావతారం తల్లా పెళ్ళామా సినిమాల్లో నటించారు. అయితే హీరో కావాలి కదా అనేది ఎన్టీఆర్‌ తండ్రి గారి అభిప్రాయం. అదే మాట ఆయన తన కుమారుడు ఎన్టీఆర్‌కు చెప్పారు. ఎన్టీఆర్‌ నవ్వి ఊరుకున్నారు తప్ప స్పందించలేదు. దీంతో ఆయనకు తిక్క రేగి ఇలా లాభం లేదని తనే నిర్మాతగా మారాలనుకున్నారు. అనుకోవడం ఏమిటి వెంటనే రచయిత డీవీ నరసరాజు గారిని పిల్చి అయ్యా నా మనవడు హీరోగా నా కొడుకు ప్రధాన పాత్రలో ఓ కథ కావాలి. నేనే నిర్మాతను. అని అడ్వాన్స్‌ హరికృష్ణ చేతుల మీదుగా ఇప్పించేశారు. నరసరాజు గారు కథ రాసేసారు. టైటిల్‌ ‘‘తమ్ముడి పెళ్లి మామ భరతం ‘‘తమ్ముడు హరికృష్ణ అన్న ఎన్టీఆర్‌..’’ ఇది లైను.

కథ రాయడం పూర్తి అయ్యాక ఎన్టీఆర్‌ గారి ఇంటికి వెళ్లారు రాజుగారు. ఆయన వెళ్లేసరికి ఎన్టీఆర్‌ ఇంట్లో ఉన్నారు. ఏమిటి విషయం రాజుగారు ఇలా వచ్చారు అని అడిగారు అన్నగారు రాజుగారిని. అయ్యా మీరు ప్రధాన పాత్రలో మీ అబ్బాయ్‌ హరికృష్ణ హీరోగా ఓ కథ కావాలి అన్నారు మీ నాన్నగారు. తనే నిర్మాతను అనికూడా చెప్పారు. అడ్వాన్స్‌ ఇచ్చారు. స్క్రిప్ట్‌ పూర్తి అయ్యింది.

ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు రాజుగారు. ఎన్టీఆర్‌ పెద్దగా నవ్వి మా నాన్న గారి అభిప్రాయం ఏమిటో తెల్సా రాజుగారూ అంటూ మొదలుపెట్టారు అన్నగారు.

తన మనవడిని హీరో చేయడం నాకు ఇష్టం లేదని ఆయన భావన. అంతే కాదు వాడు హీరో అయితే నా అవకాశాలు పోతాయ్‌ అని భయపడి సినిమా తీయడం లేదని కూడా ఆయన ఫీలవుతున్నారు తెల్సా? అని ఆపారు ఎన్టీఆర్‌.

ఆశ్చర్యంగా ఉందండి అన్నారు రాజు గారు. ఆశ్చర్యం ఎందుకు మనవడి మీదున్న నమ్మకం... సరే మీకు బ్యాలెన్స్‌ ఎంత ఇవ్వాలి అని అడిగి చెక్‌ ఇచ్చేసి ఆ స్క్రిప్ట్‌ తన టేబుల్‌ సొరుగు లో పెట్టి లాక్‌ చేశారు అన్నగారు.

ఆ సొరుగు ఎన్టీఆర్‌ కన్నుమూసిన తర్వాత ఓపెన్‌ చేశారు పిల్లలు. అందులో... ‘తమ్ముడు పెళ్లి మామ భరతం’ స్క్రిప్ట్‌ చూసి ఆశ్చర్యపోయి బాలకృష్ణకు ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకుని హైదరాబాద్‌ వచ్చిన తర్వాత నరసరాజు గారి ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వబోయరట. బాబూ ఈ స్క్రిప్ట్‌కు సంబంధించిన డబ్బులు మీ తాతగారు తండ్రి గారు కలసి ఇచ్చేసారు. అది మీదే... మీ దగ్గరే ఉంచండి అని చెప్పి పంపారట. ఇది కథ... ఆ హరికృష్ణ గారు తర్వాత చైతన్యరథ సారధై అన్నగారిని ముందుకు నడిపాడు.

- రంగావర్జుల భరద్వాజ



అందాల శ్వేత కవ్వింపులు

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్వేతాబసు ప్రసాద్‌. మొదటి సినిమాలో క్యూట్‌గా డైలాగ్‌లు చెబుతూ, అందంగా అలరించిన శ్వేతా బసు టాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. బుల్లి తెర, వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ శ్వేత బసు కనిపించి కన్నుల విందు చేసింది. కొత్త బంగారు లోకం తర్వాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన శ్వేతా బసు ప్రసాద్‌ కెరీర్‌ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. తెలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తున్న శ్వేత బసు ఆ మధ్య కొన్ని కారణాల వల్ల వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడిరది. వాటి నుంచి మెల్లమెల్లగా బయటకు వస్తున్న శ్వేతబసు ప్రసాద్‌ మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది.

శ్వేతాబసు కొత్త లుక్‌ ఈ మధ్య కాస్త సన్నగా కనిపించిన శ్వేతా బసు ప్రసాద్‌ ఇటీవల బరువు పెరిగిందనే వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో శ్వేత బసు ప్రసాద్‌ హీరోయిన్‌గా సినిమాలు ఏమీ చేయడం లేదు. అయినా కూడా సోషల్‌ మీడియాలో వరుసగా ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. గతంతో పోల్చితే శ్వేతా బసు ప్రసాద్‌ మరింత అందంగా కనిపిస్తుందని, కొత్త బంగారు లోకం సినిమాలో ఎలా అయితే ఫ్రెష్‌ గా కనిపించిందో ఇప్పుడు అలాగే కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. శ్వేతా బసు ప్రసాద్‌ యొక్క అందాల ఆరబోతకు ఈ ఫోటోలు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేస్తూ ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తూ లైక్‌ చేస్తున్నారు. క్లీవేజ్‌ షో తో కవ్విస్తున్న అందాల శ్వేత ఫోటోలు చూపు తిప్పనివ్వడం లేదు.

కొత్త బంగారు లోకం హీరోయిన్‌ శ్వేతా బసు ప్రసాద్‌ 2002లో మక్దీ అనే సినిమాలో నటించడం ద్వారా ఉత్తమ బాల నటిగా జాతీయ చలనచిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇక్బాల్‌ సినిమాలో కాస్త పెద్ద అమ్మాయిగా నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. 2008 సంవత్సరంలో కొత్త బంగారు లోకం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఆకట్టుకుంది. అదే సమయంలో హిందీలోనూ ఈమె సినిమాను చేయాలని భావించింది. కానీ హిందీలో ఈమెకు చిన్నప్పుడు వచ్చిన తరహాలో సినిమా ఆఫర్లు రాలేదు. దాంతో సౌత్‌లోనే ఈమె హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈమధ్య కాలంలో వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించడం ద్వారా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page