నాలాంటివాళ్లు ఎవ్వరూ ఉండరు: ఇళయరాజా
- Guest Writer
- 2 days ago
- 2 min read

‘‘ఏ సంగీతకారుడినైనా తీసుకోండి. వాళ్లు తప్పనిసరిగా సంగీతం నేర్చుకుని ఉంటారు, లేదంటే ఎవరిదగ్గరైనా శిష్యరికం చేసి ఉంటారు. నేను మాత్రం ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోలేదు. నాకు ఆ దేవుడే ఈ వరాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. నాలాంటివాళ్లు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. గతంలోనూ లేరు, భవిష్యత్తులోనూ రారు’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆయన ఇటీవల తెలుగు చిత్రం ‘షష్టిపూర్తి’కి స్వరాలు సమకూర్చారు. రూపేశ్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రమిది. రాజేంద్రప్రసాద్, అర్చన కీలక పాత్రలు పోషించారు. పవన్ ప్రభ దర్శకుడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇళయరాజాతో, గీత రచయిత చైతన్యప్రసాద్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ భేటీలో ఇళయరాజా పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిరచారు.
‘‘నేను ఎక్కడో ఓ చిన్న గ్రామంలో పుట్టాను. అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు కూడా ఉండరు. చిన్నప్పుడు మా అన్న పాటలు పాడుతుండేవారు. అలా ఆ పాటలు వింటూ నేను ఏదో ఒకటి వాయిస్తూ ఉండేవాడిని. అలాంటి చోటు నుంచి ఈ స్థాయికి వచ్చాను. అసలు నాకు సంగీతం ఎలా వచ్చింది? నా నుంచి పాటలు ఎలా ఉద్భవిస్తాయో కూడా నాకు తెలియదు. మా అన్న పాడిన పాటలకు నేను సంగీతం వాయిస్తే, అప్పుడు అందరూ చప్పట్లు కొడుతుండేవారు. ఆ చప్పట్లు వింటే నాకు గర్వం పెరుగుతూ వచ్చేది. అయితే వాళ్లు చప్పట్లు కొట్టేది నేను వాయించినందుకా లేక, ఆ సంగీతానికా? అనే ప్రశ్న మొదలైంది. సంగీతానికి కొడుతున్నారని తెలిశాక, నేనూ అలా సంగీతం కంపోజ్ చేయాలని దానిపై దృష్టిపెట్టా. అలా సంగీత దర్శకుడినయ్యా’’ అన్నారు ఇళయరాజా.
ఏఐ సాంకేతికత గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ట్రెండ్ అనే మాట నాకు అర్థం కాదు. పాట బాగుంటే ఎప్పుడైనా వింటారు. అందులో ట్రెండ్ అనేది ఏదీ ఉండదు. ఏఐ (కృత్రిమమేధ) అనేది స్వతహాగా ఏమీ చేయలేదు. మనిషి మెదడు లక్ష ఏఐలతో సమానం. మనిషి ఏఐని కనిపెట్టాడు కానీ, ఏఐ మనిషిని కానీ, మానవ మెదడునికానీ సృష్టించలేదు’’ అన్నారు. కొత్తగా వస్తున్న తరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ చేశానని చెప్పారు ఇళయరాజా. ‘‘మంచి కథ ఉందా లేదా? అనేదే చూస్తాను. స్టార్స్ ఉన్నారా? లేదా అనేది ఎప్పుడూ పట్టించుకోను. నా కెరీర్ ఆరంభం నుంచీ కొత్తవాళ్లని ప్రోత్సహిస్తూ వస్తున్నా. భారతీరాజా, మణిరత్నం... ఇలా అందరూ అప్పట్లో కొత్తవాళ్లే. నాతో సినిమాలు చేశాక వారికి ఆ స్టార్డమ్, గుర్తింపు వచ్చింది’’ అన్నారు.
‘మా’ పూనుకుని రాజేంద్రప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!

రాజేంద్రప్రసాద్ అలా మాట్లాడకపోతేనే వార్త.. ఈమధ్య ఎవరు అతిథిగా పిలిచినా సరే వెళ్లి, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏదో అయ్యింది తనకు.. అందుకే తేడా కొడుతోంది.
రాను రాను ఎవరు తనల్ని ఏ ఫంక్షన్‌కు పిలవాలన్నా సరే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలి, లేదా ఏదో ఓరకంగా పిచ్చి కూతలతోనైనా ప్రచారం తీసుకువస్తున్నాడు కదా అనుకుంటే తప్ప.. తనొక మంచి వక్తను అనే భ్రమల్లో బతుకుతున్నాడు ఫాఫం.. అయిదు తరాల నటులతో పనిచేశాను, ఆఫ్టరాల్ వీళ్లంతా ఎంత అనే యాటిట్యూడ్ భీకరంగా కనిపిస్తోంది. కానీ తన నాలుక మీద తనకు అదుపు లేదని.,. ఫ్లోలో సిగ్గూశరం, సంస్కారం, హుందాతనం, పెద్దరికం, వయస్సు అన్నీ మరిచిపోతున్నాననే సోయి లేదు తనకు.. తనేం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు. అంత పొంతన లేకుండా ఉంటాయి వాక్యాలు.. ఎటు నుంచి ఎటు పోతున్నాడో తెలియదు. తను చెప్పదలుచుకున్నది సూటిగా, అర్థమయ్యేలా చెప్పడం చేతకాని అవస్థ ఇది!!
ఆమధ్య ఏదో ఫంక్షన్లో (హరికథ వెబ్ సీరీస్) మాట్లాడుతూ బన్నీని కించపరిచేలా ఇప్పుడు చందనం దొంగలు హీరోలు అన్నాడు. సరే, తన పాజిటివ్ పాత్రను హైలైట్ చేసుకోవడానికి ఇప్పటి నెగెటివ్ హీరో పాత్రలను కంట్రాస్టుగా ఏదో చెప్పబోయి, అది సరిగ్గా చెప్పలేక బోల్తాకొట్టాడు అనుకుందాం..
క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి ఓ బూతు వదిలాడు. కుసంస్కారి.. తరువాత అందరూ బూతులు తిట్టేసరికి లెంపలేసుకుని, నాలుక కర్చుకుని సారీ చెప్పాడు.. ఏం మనిషో..
ఇప్పుడు మళ్లీ ఎస్వీ కృష్ణారెడ్డి బాపతు ఏదో ఫంక్షన్లో కమెడియన్ ఆలీని ఉద్దేశించి రాయడానికి వీల్లేని బూతు వదిలాడు. ఎంత చనువు ఉన్నా, ప్రైవేటుగా మాట్లాడుకుంటున్నప్పుడో, మందు కొట్టినప్పుడో ఎవరు ఏమని పిలుచుకున్నా అది వేరు. కానీ బహిరంగంగా, వేదికల మీద మాట్లాడేటప్పుడు కాస్త డీసెన్సీ, సంస్కారం గట్రా అవసరం.. అది లోపించింది ఈ మనిషిలో..
ఫాఫం ఆలీ ఏమీ అనలేడు, అక్కడికి వచ్చినవాళ్లు కూడా విస్తుపోయారు. ఒరేయ్, ఏం కూతలురా అని అనలేరు కదా.. ఏమో, టీవీ చానెళ్లు, ఇతర మీడియా రాజేంద్రప్రసాద్ బూతుల మీద నెగెటివ్‌గా రియాక్టయి అసలు ఏం మనిషి అతను అన్నట్టుగా రాస్తున్నారు కదా.. రేపోమాపో మరో వీడియో రిలీజ్ చేస్తూ సారీ చెబుతాడేమో..
అడుసు తొక్కుతూనే ఉంటాడు, కాళ్లు కడుగుతూనే ఉంటాడు.. ఆ తోక ఎప్పుడూ వంకరే.. ఎవరో తిక్కరేగి, అక్కడే, ఆ వేదిక మీదే ఉగ్రరూపం దాల్చి ఏమైనా తీవ్ర స్పందన కనబరిచేవరకూ తను అంతేనేమో..!!
ముచ్చట సౌజన్యంతో...
Comments