top of page

నగుబాటును చెరిపేసే దిద్దుబాటు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 1 day ago
  • 3 min read
  • కూర్మారావుకు మళ్లీ కమిషనర్ సీటు

  • ముఖ్యమంత్రిని ఒప్పించిన గొండు శంకర్

  • క్షేత్రస్థాయిలో ఫైల్ నడిపిన మంత్రి

  • ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై హర్షం

  • ‘సత్యం’ ఇంతకుముందే చెప్పినట్లు నడిచిన పరిణామాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మన తప్ప్పు ఉందా.. లేదా? అనేది వేరే విషయం. విధుల్లో చేరి ఎన్ని రోజులైంది? వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన డ్యామేజ్ ఎంత? ఇవన్నీ లెక్కలేసుకుంటే తగిన సమాధానం రావచ్చు. కానీ పాలనాపరమైన విధానాల్లో వరుసగా అడ్డంకులు ఎదురైనప్పుడు ఎవరో ఒకరు బలికాక తప్పదు. రోడ్డు ప్రమాదాల్లో కూడా సాధారణంగా మనం ఇటువంటి సంఘటనలే చూస్తుంటాం. వేగంగా బైక్ నడిపింది ఒకరైతే.. దుర్మరణం పాలయ్యేవారు వేరొకరు ఉంటారు. ఇక్కడ నేరమెవరిది? శిక్షెవరికి? అనే ప్రశ్నకంటే.. బాధితులెవరు? ఆ కుటుంబానికి వారెంత అవసరమన్నదే లెక్క. నగరంలో డయేరియా ప్రబలినప్ప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. అప్ప్పుడప్ప్పుడే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంతో పాటు మరికొన్ని పాజిటివ్ సంకేతాలు ఇస్తున్న సమయంలో రాజమండ్రిలో కల్తీపాలు తాగి ప్రజలు చనిపోవడం ప్రారంభమైంది. ఇది ఒకవైపు పతాక శీర్షికలను ఆక్రమిస్తున్నప్పుడే కాకినాడ సమీపంలోని వేట్లపాలెంలో మందుగుండు సామగ్రి పేలి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇది కూడా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రీకాకుళంలో డయేరియా ప్రబలింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యే లోపే కొన్ని మరణాలు కూడా సంభవించాయి. (ప్రభుత్వం చాలావాటిని గుర్తించలేదన్నది వేరే విషయం.) ఇటువంటి సమయంలో ఏ ప్రభుత్వమైనా తమకు ప్రజారోగ్యమే ముఖ్యమని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా అదే పని చేసింది. కాకపోతే దీనికి అప్పటికి 14 రోజుల క్రితమే విధుల్లో చేరిన కమిషనర్ హనుమంతు కూర్మారావు బలైపోయారు. ఇక్కడివరకు అందరికీ తెలిసిన కథే. అయితే ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను తిరిగి ప్రభుత్వమే రద్దు చేసి, మళ్లీ అదే సీటులో కూర్చోబెట్టడం అనేది చిన్న విజయం కాదు. అలా అని హనుమంతు కూర్మారావు రాష్ట్ర సచివాలయంలో చక్రం తిప్పే అధికారి కూడా కాదు.. మరి ఇదెలా సాధ్యమైంది?

మళ్లీ క్రీజ్‌లోకి తీసుకురావడమెలా?

శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీపాల మరణాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నప్ప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మున్సిపల్ కార్పొరేషన్‌లో కమిషనర్లు సరిగ్గా పని చేయడంలేదని, ఎవరో ఒకరి మీద వేటు వేస్తే గానీ వ్యవస్థ చక్కబడదని భావించడంతో ఆయనే కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని సూచించారు. ఆ సమయంలో చంద్రబాబుకు గానీ, ఆయన ఆదేశాలు అమలు చేయాల్సిన అధికారులకు గానీ కూర్మారావు వచ్చి 14 రోజులు కూడా కాలేదన్న విషయం తెలియదు. దీంతో రాత్రికి రాత్రే కూర్మారావును సస్పెండ్ చేశారు. అయితే ఆ తర్వాత అన్ని విషయాలు ఒక్కొక్కటిగా మీడియా ద్వారా బయటకొచ్చాయి. అప్ప్పుడే మొదలయ్యాయి దిద్దుబాటు చర్యలు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒక కమిషనర్‌ను సస్పెండ్ చేశామన్న ప్రభుత్వం ఆతర్వాత తప్పయిపోయింది అని ఒప్ప్పుకోవడం కుదిరే పని కాదు. శ్రీకాకుళం కమిషనర్‌గా కూర్మారావు ఉండాలనేది ఇక్కడి తెలుగుదేశం నాయకుల అభిమతం కావచ్చు. కానీ ప్రభుత్వానికి ఏ అధికారైనా ఒకటే. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ కూర్మారావును ఎలా వెనక్కు తీసుకురాగలిగారు? దాని వెనుక జరిగిన పరిణామాలు, ఇబ్బందులను కూటమి నేతలు ఎలా అధిగమించగలిగారు? ఇక్కడే విజయసూత్రం అమలైంది.

శంకర్‌దే తారకమంత్రం

ముఖ్యమంత్రే సస్పెండ్ చేయాలని సిఫార్సు చేయడం వల్ల ఆయన దష్టికే ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. కానీ ఆ పని ఎవరు చేస్తారు? నేరుగా సీఎం వద్దకు వెళ్లి మనం తప్ప్పు చేశామని ఎవరు చెబుతారు? మొదట్లో కూర్మారావును శ్రీకాకుళం కమిషనర్‌గా నియమిస్తూ ప్రత్యేక జీవో తేవడంలో మంత్రిగా అచ్చెన్నాయుడు కీలక భూమిక పోషించి ఉండొచ్చు. ఎందుకంటే.. ఆయన పేరెంట్ డిపార్ట్‌మెంట్ మున్సిపల్ శాఖ కాదు. ఆయన డీఈ క్యాడర్ అధికారి. అటువంటి కూర్మారావును శ్రీకాకుళం కమిషనర్‌గా తేవాలంటే అచ్చెన్నాయుడో, రామ్మోహన్‌నాయుడో అటు ముఖ్యమంత్రికి, ఇటు మున్సిపల్ మంత్రికి ఒక మాట చెప్పాలి. ఆ తర్వాత సదరు ఫైల్‌కు సెక్రటేరియట్‌లో సంబంధిత శాఖల క్లియరెన్స్ తీసుకోవాలి. సరిగ్గా అదశలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఎంటరయ్యారు. రాష్ట్ర, కేంద్ర మంత్రుల అభీష్టం మేరకు ఆర్థిక, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల వద్దకు దగ్గరుండి ఫైల్‌ను నడిపించి ఆర్డర్ తెప్పించుకున్నారు. అక్కడికి 14 రోజుల్లోనే కూర్మారావు సస్పెండ్ అయ్యారు. ఇప్ప్పుడు మళ్లీ ఆయన్ను వెనక్కు తీసుకురావాలంటే అధికార పార్టీ ముందు కనిపిస్తున్న ఏకైక తురుపుముక్క గొండు శంకరే. మళ్లీ అన్ని డిపార్ట్‌మెంట్లలో కథ నడపడానికి మంత్రులైతే సిద్ధంగా ఉన్నారు కానీ.. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి తన నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సస్పెండ్ కావడం పార్టీకి మైనస్ అని చెప్పగలగాలి. అది కేంద్రమంత్రో, రాష్ట్రమంత్రో చెబితే పర్సనల్ ఇంట్రస్ట్. అదే స్థానిక ఎమ్మెల్యే చెబితే లోకల్ ఇంట్రస్ట్. అందువల్ల మళ్లీ చంద్రబాబు వద్దకు శంకరే వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం కలుసుకుని కూర్మారావు శ్రీకాకుళానికి రావాల్సిన అవసరాన్ని చంద్రబాబుకు వివరించారు. ఆ తర్వాత మరోసారి ప్రత్యేకంగా విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రిని, మున్సిపల్ మంత్రిని కలిసి సస్పెన్షన్ రివోక్ చేయమని కోరారు. ఈలోగా కూర్మారావు సస్పెన్షన్ కులం కోణాన్ని పులుముకుంది. ఆ విషయం పార్టీకో, ప్రభుత్వానికో తెలిస్తే ప్రిస్టేజ్‌కు పోతుందేమోనన్న భయం. అలా అని కూర్మారావును వెనక్కు తీసుకురాలేకపోతే ప్రభుత్వానికే చెడ్డపేరు. ఈ సందిగ్ధంలోనే పొరపాట్ల మీద పొరపాట్లు జరిగిపోయాయి. కూర్మారావు సస్పెండైన వెంటనే నల్లనయ్యను తీసుకురావడం, ఆయన టౌన్‌లో అడుగుపెట్టకముందే రాముకు బాధ్యతలు అప్పగించడం, పూర్తి అదనపు బాధ్యతలు జేసీ ఫర్మాన్ అహ్మద్‌కు ఇవ్వడంతో కూర్మారావు ఇక రారనే ప్రచారం జరిగింది. బయటి నుంచి చూసేవారికి అదే వాస్తవమని కూడా అనిపించింది. కానీ సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ మాత్రమే కూర్మారావు మళ్లీ వస్తారని ధైర్యంగా ప్రకటించింది. జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినప్ప్పుడు కూడా బిల్లుల చెల్లింపులకు సంతకాలు అవసరం కాబట్టి ఎఫఏసీ ఇచ్చారని, కూర్మారావు మళ్లీ వస్తారని మరోసారి సాధికారికంగా ‘సత్యం’ ప్రకటించింది. ఇప్ప్పుడదే జరిగింది. కూర్మారావు కార్పొరేషన్ కమిషనర్‌గా వస్తారన్నప్ప్పుడే ఆయనకన్నా పెద్దస్థాయి ఇంజినీరింగ్ అధికారి ఎంఈ ఉన్నప్ప్పుడు డీఈ స్థాయి అధికారిని కమిషనర్‌గా ఎలా నియమిస్తారని మున్సిపల్ శాఖలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిని పక్కన పెట్టి మరీ పాలన గాడిలో పెట్టడానికి అచ్చెన్నాయుడు కూర్మారావును ఎంచుకున్నారు. తీరా ఆయన సస్పెండ్ కావడంతో మళ్లీ ఇదే అభిప్రాయం ఎంఏయూడీలో వ్యక్తమైంది. కానీ వాటిని ఒకటికి పదిసార్లు క్లారిఫై చేస్తూ అడ్డొచ్చిన చోట అచ్చెన్నాయుడును వాడుతూ కూర్మారావును మళ్లీ వెనక్కు తీసుకురావడంలో శంకర్ కీలక భూమిక పోషించారు. సస్పెండైన రోజు రాత్రే కూర్మారావు ఇంటికి వెళ్లి మరీ శంకర్ అభయమిచ్చారు. ఇప్ప్పుడది చేసి చూపించారు.

1 Comment


Begum Salma
Begum Salma
a day ago

IAS cadre unna post (MC skl) lo DE cadre officer aa

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page