పూడిక తీయాలంటే.. ప్రహరీ కొట్టాలంట!
- SATYAM DAILY
- 3 hours ago
- 2 min read
30 ఏళ్లుగా మెయిన్‌రోడ్డులో కాలువ క్లియర్ చేయలేదు
వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ముందే నిల్వ ఉండిపోతున్న నీరు
వర్షాకాలం ముందే పనులు చేపట్టాలని కోరుతున్న ప్రజలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, జిల్లా రెడ్‌క్రాస్ కార్యాలయం... ఈ రెండింటి పరిసరాల్లో ఉన్న కాలువ ఎలా ఉండాలి? జిల్లా మొత్తానికి ఆరోగ్యం కోసం దారి చూపించాల్సిన కార్యాలయం ముందున్న ఈ కార్పొరేషన్ కాలువలో కనిపిస్తున్నది నీరు కాదు.. పూర్తిగా మట్టి. మురుగు ప్రవహించాల్సిన చోట మట్టి పేరుకుపోవడం మనకు కొత్త కాదు. కాకపోతే 30 ఏళ్లుగా ఈ డ్రైనేజీని క్లియర్ చేసిన పుణ్యం కట్టుకోలేదు మున్సిపల్ యంత్రాంగం. పోనీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులేమైనా మా కాలువ క్లియర్ చేయండి బాబూ అని అడిగారా? అంటే అదీ లేదు. ఇప్ప్పుడు వర్షం పడితే డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంతం, రెడ్‌క్రాస్ ప్రధాన గేటు నీటిలో మునిగిపోతుందని, కాలువలో మట్టిని తీయాలని మున్సిపల్ హెల్తాఫీసర్‌ను కోరితే.. కాలువ మీద వేసిన పలకలు తీస్తే వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ప్రహరీ కూలిపోతుందని, అందుకే దాన్ని క్లియర్ చేయలేమని చెబుతున్నారట. ఇది వాస్తవం కూడా. ఆ రోడ్డులో స్ట్రీట్‌ఫుడ్ వెండర్లు తమ తోపుడుబళ్లు నిలుపుకోవడం కోసం కాలువ మీద పలకలు వేసుకున్నారు. వైద్యఆరోగ్యశాఖ నూతన భవనం నిర్మించినప్ప్పుడు కొంతమేర ఈ పలకల మీద కాంపౌండ్‌ను తిప్పేశారు. ఇప్ప్పుడా పలకలు తీయాలంటే ప్రహరీని తొలగించాల్సి ఉంటుందని ఎంహెచ్‌వో చెబుతున్నారు. ఈ చిన్న కారణానికి ఏళ్ల తరబడి ఆ కాలువలో పేరుకుపోయిన మట్టిని తీయకపోవడం విడ్డూరం. ప్రహరీ కొట్టడం, దాన్ని కట్టడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనుకున్నప్ప్పుడు ప్రహరీ పోగా మిగిలిన పలకలను బద్దలుగొడితే సరిపోతుంది. ఈ చిన్న లాజిక్‌ను విడిచిపెట్టేసి ప్రహరీ తీసేయాలన్న నెపం చూపించి 30 ఏళ్లుగా ఈ కాలువ జోలికి పోలేదు. ఫలితంగా బాపూజీ కళామందిర్ ఎదురుగా పెట్రోమాక్స్ వీధికి వెళ్లే త్రోవలో వర్షం పడితే నీరు నిలబడిపోతోంది. శంకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత కాలువల్లో పూడిక తీయడమనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. కానీ ఇంతవరకు ఈ కాలువ జోలికి పోలేదు. కారణం.. కాలువ నిండా మట్టి పేరుకుపోయి అక్కడ కాలువే ఉందన్న ఆనవాలు లేకపోవడం ఒకటి కాగా, ఎక్కడైనా కాలువ షేప్ కనిపించినా దాని మీద పలకలు వేసేయడం వల్ల మున్సిపల్ యంత్రాంగం ఆ జోలికే పోలేదు. ఇక్కడ కాలువను క్లియర్ చేయడం వల్ల చిన్నబజారు వరకు, అటు స్టేట్‌బ్యాంక్ దిగువ ప్రాంతం వరకు నీరు నిల్వకాకుండా ఉంటుంది. రామకష్ణ థియేటర్ సందు నుంచి పాలకొండ రోడ్డు వచ్చే మార్గం దిగువున ఉంటుంది. అలాగే పెట్రోమాక్స్ వీధి నుంచి చౌక్‌బజార్‌లోకి వెళ్లే రోడ్డు కూడా డౌన్‌లోనే ఉంటుంది. ఇప్ప్పుడు రామకష్ణ థియేటర్ రోడ్డు నుంచి వచ్చే నీరు, డీఎంహెచ్‌వో కార్యాలయం పక్కనుంచి పెట్రోమాక్స్ వీధిలోకి చేరుతుంది. చౌక్‌బజారు మీదుగా స్టేట్‌బ్యాంక్ డౌన్ వరకు వెళ్తుంది. ఇప్ప్పుడు ఈ కాలువను క్లియర్ చేస్తే ఎత్తైన ప్రాంతాల నుంచి దిగువకు వచ్చే నీరు నిల్వ ఉండకుండా ప్రవహిస్తుంది. దీన్ని వదిలేసి ప్రహరీ చుట్టూ 30 ఏళ్లుగా కథ తిప్ప్పుతున్నారు.






Comments