top of page

పెళ్లయినా తగ్గేదేలే!

  • Guest Writer
  • Sep 16, 2025
  • 2 min read

సాధారణంగా హీరోయిన్స్‌ కి ఇండస్ట్రీలో లైఫ్‌ టైం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు అందరికీ ఒకే రేంజిలో లభిస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది పెళ్లయి.. పిల్లలు ఉన్నా అదే రేంజ్‌ లో హీరోయిన్‌ గా అలరిస్తూ దూసుకుపోతే.. మరికొంతమంది ఒకటో రెండో ఫ్లాపులు పడ్డాయి అంటే వారు ఎంత తోపు హీరోయిన్లు అయినా సరే అవకాశాలు రావు. ఇంకొంతమందికి పెళ్లయితే చాలు అవకాశాలు లేకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కొంతమంది హీరోయిన్లు పెళ్లయిన తర్వాత మరింత జోరు పెంచారు అనే చెప్పాలి. వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను సైతం సంతోషపరుస్తున్నారు. ఇకపోతే పెళ్లయిన తర్వాత జోరు పెంచిన ఆ హీరోయిన్స్‌ ఎవరు అనే విషయానికొస్తే..

కాజల్‌ అగర్వాల్‌..

‘చందమామ’ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా పేరు సొంతం చేసుకుంది. తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. కెరియర్‌ పీక్స్‌ లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పండంటి కొడుకుకు కూడా జన్మనిచ్చింది. ఇక కొద్ది రోజులు ఇంటికే పరిమితమైన ఈమె.. ఇప్పుడు ఇండియన్‌ 3, ది ఇండియా స్టోరీ వంటి చిత్రాలతో బిజీగా మారింది.

శ్రియా శరణ్‌..

ప్రముఖ హీరోయిన్‌ గా పేరు సొంతం చేసుకున్న శ్రియా శరణ్‌.. తెలుగు, హిందీ భాషలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 2018లో వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్‌ చిత్రంలో కీలక పాత్ర పోషించి భారీ సక్సెస్‌ అందుకుంది.

నయనతార:

లేడీ సౌత్‌ సూపర్‌ స్టార్‌ గా పేరు సొంతం చేసుకున్న నయనతార.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ సినిమాలలో జోరు మాత్రం తగ్గడం లేదు. వరుసగా ఫిమేల్‌ సెంట్రిక్‌ సినిమాలతో పాటు హీరోయిన్‌ గా కూడా అవకాశాలు అందుకుంటుంది. అలా మూకుత్తి అమ్మన్‌ -2 (అమ్మోరు తల్లి 2) చిత్రం తోపాటు చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమాలో కూడా హీరోయిన్‌ గా నటిస్తోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌:

టాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ కెరియర్‌ పిక్స్‌ లో ఉండగానే బాలీవుడ్‌ కి వెళ్లిపోయిన ఈమె.. అక్కడ బాలీవుడ్‌ నటుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె.. ఇక్కడ సౌత్‌ లో ఇండియన్‌ 3 లో కూడా నటిస్తోంది.

కీర్తి సురేష్‌:

అటు సినిమాలు, ఇటు వెబ్‌ సిరీస్‌ లు అంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిన్నది ఇటీవల ఉప్పుకప్పురంబు అనే వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రివాల్వర్‌ రీటా అనే సినిమాలో నటిస్తోంది. లావణ్య త్రిపాఠి: మెగా కోడలిగా మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇటీవలె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సతీ లీలావతి చిత్రంతోపాటు టన్నెల్‌ అనే సినిమాలో కూడా నటిస్తోంది. దీనికి తోడు తమిళంలో ఈమె నటించిన తనల్‌ అనే సినిమా కూడా ఇటీవల విడుదలైంది.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page