top of page

పదోన్నతుల్లో 30 మంది అనర్హులు

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 4 days ago
  • 2 min read
  • 154 మంది నుంచి రూ.20వేలు చొప్ప్పున వసూలు

  • ఆర్‌వోఆర్ బుక్ పోయిందనేది అవాస్తవం

  • మీడియా ముందు నోరు విప్పడానికి ససేమిరా అంటున్న డీఎంహెచ్‌వో

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో వివిధ సచివాలయాý పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీలుగా పని చేస్తూ గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2కు పదోన్నతికి సిద్ధం చేసిన జాబితాలో 30 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. డీఎంహెచ్‌వో కార్యాలయంలో సంబంధిత సీటు చూస్తున్న ఉద్యోగి దగ్గర్నుంచి, ఆ సెక్షన్ సూపరింటెండెంట్ వరకు మూడు స్థాయిల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20వేలు వసూలుచేసి, జాబితాను రూపొందించినట్లు తెలుస్తుంది. డబ్బులు ఇచ్చిన వెంటనే ప్రమోషన్ జాబితాలో తమ పేర్లు ప్రచురించి, ఆ తర్వాత డిసెంబరు 1 నుంచి పదోన్నతులు ఇవ్వడానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ముందుకు రాకపోవడంతో ఆగ్రహం చెందిన హెల్త్ సెక్ర{రీలు రెండు రోజులు డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే నిరసన తెలిపారు. 154 మందికి ప్రమోషన్లు ఇస్తున్నట్లు గత ఏడాది నవంబరులోనే ఒక జాబితా ప్రకటించారు. ఇందులో 30 మంది అనర్హులు ఉన్నారు. అయితే ఈ 30 మంది నుంచే 20వేలు వసూలు చేశారు కాబోలని అంతా భావించారు. కానీ 154 మంది నుంచి కూడా ఈ మేరకు వసూళ్ల పర్వం పూర్తయింది. అయినా పదోన్నతులు రాకపోవడంతో వీరంతా ధర్నాకు దిగారు. ఇప్ప్పుడు తమకెందుకు ప్రమోషన్లు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ బుక్ కనపడకుండాపోయిందని, అందుకే ఇవ్వలేకపోతున్నామని డీఎంహెచ్‌వో ప్రకటించారు. అదే నిజమైతే ఇందులో ఆదివాసీలకు అన్యాయం జరిగిందంటూ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ఫిర్యాదు చేయడానికి వెళ్లడానికి వీలుగా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే స్వయంగా డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాలే ఆయనకు ఆర్‌వోఆర్ బుక్‌లోని కాపీలు సంతకం చేసి మరీ ఇచ్చారు. అలాగే ప్రమోషన్ల జాబితా పట్టుకెళ్లి కలెక్టర్ దగ్గర అనుమతి తెచ్చుకున్నప్ప్పుడు కూడా ఆర్‌వోఆర్ బుక్ ఉంది. ఎప్ప్పుడైతే 30 మంది అర్హులకు అన్యాయం జరిగిందని తేలిందో, అసలు పదోన్నతుల జాబితాయే తప్ప్పులతడక అని రుజువైంది. దీంతో 2019లో తాను లేనని, ఈ జాబితాను రూపొందించిన ఉద్యోగులు కూడా ఆ సీటులో అప్ప్పుడు లేరని డీఎంహెచ్‌వో చెప్ప్పుకొస్తున్నారు. వాస్తవానికి కొందరైతే దూర ప్రాంతాల్లో ఉండి హెడ్‌క్వార్టర్‌కు రాలేకపోతున్నామని, ఈలోగా పదోన్నతుల జాబితాలో తమ పేరు చేర్చాలంటూ ఫోన్‌పేలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్ప్పుడు 30 మందికి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంది. అదే చేస్తే, ఈ 154లో 30 మందిని తొలగించాలి. దాంతో పాటు వారు ఇచ్చిన సొమ్ములు వెనక్కు ఇవ్వాలి. ఇందులో ఏది చేసినా, వారు అసలు విషయం బయటపెడతారు. దీంతో అటు ప్రమోషన్లూ ఇవ్వక, ఇటు ఇవ్వలేమని చెప్పక ఆర్‌వోఆర్ బుక్ పోయిందని కొత్త నాటకానికి తెర లేపారు. వాస్తవానికి ఉద్యోగాలిచ్చినప్ప్పుడు పాటించే రోస్టర్ విధానం వేరు, పదోన్నతులు ఇవ్వాలంటే అనుసరించాల్సిన రోస్టర్ విధానం వేరు. కానీ పదోన్నతుల జాబితా తయారుచేసినప్ప్పుడు ఉద్యోగ జాబితా లెక్క మేరకే కానిచ్చేశారు. దీంతో తమకు అప్పనంగా ప్రమోషన్ వస్తుందని డబ్బులు సమర్పించేశారు. ఇప్ప్పుడు వైద్య ఆరోగ్యశాఖ హెడ్‌క్వార్టర్ సిబ్బంది ఆ సొమ్ములు కక్కలేక, నిజాన్ని మింగలేక ఆపసోపాలు పడుతున్నారు. ఈ డీఎంహెచ్‌వో కంటే ముందు పని చేసిన అధికారి ఏసీబీకి దొరికితే, అమ్మో అని జనాలు నోరెల్లబెట్టారు. కానీ అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఇప్ప్పుడున్న డీఎంహెచ్‌వో కలెక్షన్లలో కొత్త రికార్డులు సష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో వివిధ పీహెచ్‌సీల్లో వైద్యాధికారులుగా పని చేస్తూ పీజీ చదువుల కోసం సర్వీస్ నుంచి రిలీవ్ చేయడానికి గతంలో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2వేలు వసూలు చేసేవారు. ఇప్ప్పుడు దాన్ని రూ.13వేలు నుంచి 15వేలకు పెంచేశారు. డీఎంహెచ్‌వోలకు కలెక్షన్ ఏజెంట్లుగా సీసీలో, గుమస్తాలో, సూపరింటెండెంట్లో వ్యవహరించేవారు. ఇప్ప్పుడు ఆ బాధ లేదని స్వయంగా ఉన్నతాధికారే బేరసారాలు కానిచ్చేస్తున్నారని కార్యాలయ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా రోస్టర్ బుక్ మీద మాట్లాడటానికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంగళవారం సాయంత్రం డీఎంహెచ్‌వోను ఎన్నిసార్లు సంప్రదించినా, ఆమె స్పందించలేదట. బుధవారం విజయవాడలో సమీక్షకు ఆమె వెళ్లిపోయినట్లు భోగట్టా.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page