పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు !
- Guest Writer
- Jul 2
- 2 min read

సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచ్చింది.. ఏ మూల ఏ సంఘటన జరిగిన క్షణాల్లో సమాచారం చేరిపోతుంది. దీని పుణ్యమా అని రాత్రికి రాత్రి కొందరు సెలెబ్రిటీలు అయిపోతున్నారు. పూసలు అమ్ముకునే అమ్మాయి అలా రాత్రికి రాత్రి సినీ నటి అయిపోయింది. ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. అందుకే చాలామంది బతికి చెడ్డవాళ్ళు తమ కష్టాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ క్యారక్టర్ నటి వాసుకి (పాకీజా ఫ్రేమ్) ఏడుస్తూ తన కష్టాలను ఒక వీడియోలో చెప్పి సోషల్ మీడియాలో ఉంచింది
ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే..
తన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. అయినవాళ్లు ఎవరూ లేకపోవడంతో తమిళనాడు తన సొంత ఊరిలో ఒంటరి జీవితం గడుపుతున్నానని.. గతంలో చిరంజీవి, నాగబాబు అన్నయ్యలు సాయం చేయబట్టి కొంతకాలం నెట్టుకొచ్చానని.. ఇప్పుడు మళ్ళీ తన ఆర్థిక పరిస్థితి మొదటికి వచ్చిందని పూట గడవటం కష్టంగా ఉందని ఏడుస్తూ చెప్పింది. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కలిసి తనకు పెన్షన్ సౌకర్యం ఇప్పించవలసిందిగా వేడుకుందామని వెళ్తే సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తాను వాళ్ళను కలవలేకపోయానని.. ఎవరైనా సాయం చేసి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు
అయితే వాసుకీ విడుదల చేసిన ఈ వీడియో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన వాసుకిని పిలిపించి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని పార్టీ విప్ ద్వారా ఆమెకు ఇప్పించారు. తన కష్టాలకు వెంటనే స్పందించి ఆదుకున్న పవన్‌కళ్యాణ్ తనకు దేవుడి లెక్క అని ఆమె కన్నీటి పర్యంతం అవుతూ చెప్పింది.
ఏది ఏమైతేనేమి వాసుకి కష్టాలకు తక్షణం కొంత రిలీఫ్ దొరికింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తక్షణ స్పందనకు పలువురు నెటిజన్లు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు !!
పరేష్ తుర్లపాటి
తీర్చిదిద్దిన శిల్పంలా మౌని

మౌనిరాయ్ పరిచయం అవసరం లేదు. నాగిన్‌బ్యూటీ ‘గోల్డ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అటుపై ‘కేజీఎఫ్’లో స్పెషల్ నంబర్‌తో సౌత్ లో అడుగుపెట్టింది. మౌని ఇంతకుముందు రణబీర్ ‘బ్రహ్మాస్త్ర’లోను తన అతిథి పాత్రతో ఆకట్టుకుంది. ఇక దిశా పటానీతో స్నేహం కారణంగాను మౌనిరాయ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది.
మరోవైపు సోషల్ మీడియాల్లోను మౌని అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇన్‌స్టా వేదికగా భారీ ఫాలోయింగ్ ఉన్న తారల్లో ఒకరిగా మౌని పాపులరైంది. తాజాగా ఈ భామ నాచు రంగు ట్రెడిషనల్ దుస్తుల్లో గుబులు రేపుతున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. స్లీవ్‌లెస్ బ్లౌజ్.. బ్రాలెట్-స్టైల్‌తో మౌని ఇంటర్నెట్ ని కిల్ చేసింది. అయితే తన టోన్డ్ దేహశిరుల్ని కవర్ చేసేందుకు చీర కానీ, దుపట్టా కానీ ఎంతమాత్రం సహకరించలేదు. ఈ కొత్త లుక్ లో మౌని అందచందాలకు యువతరం ఫిదా అయిపోతోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. మౌని ప్రస్తుత కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. తదుపరి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘విశ్వంభర’లో ఒక ప్రత్యేక పాటలో కనిపించనుది. ఈ భారీ ఫాంటసీ డ్రామా మూవీని పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. జాతీయ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
తుపాకి.కామ్ సౌజన్యంతో..
Comentarios