top of page

ఫైట్లందు.. అప్పటి ఫైట్లు వేరయా!!

  • Guest Writer
  • Sep 19, 2025
  • 2 min read

‘‘హహ్హహ..నాకు తెలుసు ఎన్టీఆర్‌.... నువ్‌ శ్రీదేవి కోసం వెతుక్కుంటూ నా డెన్‌ లోకి వస్తావని..ఇక నిన్ను ఆ దేముడు కూడా కాపాడలేడు.. కాస్కో...హహ్హా ..’’ ‘‘రేయ్‌ కైకాల సత్యం..అడవిలో ఉండే సింగాన్ని గోకి మొదటి తప్పు చేశావ్‌..నా శ్రీదేవిని ఎత్తుకొచ్చి రెండో తప్పు చేశావ్‌...ఈరోజుతో నీ పని మాటాష్‌...కాస్కో..’’ అంటూ ఎన్టీఆర్‌ దూకుడుగా ముందుకొచ్చి సత్యనారాయణ ముక్కు మీద డిస్యూమ్‌ అంటూ పిడిగుద్దు గుద్దుతాడు.

సత్యనారాయణ ‘అబ్బా ‘అని అరిచి ముక్కు మీద చెయ్యిపెట్టుకుని చూస్తాడు. రక్తం కారుతుంది..

‘‘ఎంత నీ శ్రీదేవిని ఎత్తుకొస్తే మాత్రం మర్యాద లేకుండా రక్తం కారేట్టు ముక్కు మీద గుద్దుతావా ఎన్టీఆర్‌..’’ అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్వాజ్‌ను ఎన్టీఆర్‌ మీదకు విసురుతాడు సత్యనారాయణ

ఎన్టీఆర్‌ ఫ్లవర్వాజ్‌ను గాల్లోనే క్యాచ్‌ చేసి పిండి చేసి పక్కకి ఉదేస్తాడు. ఈసారి పక్కనే ఉన్న సైకిల్‌ టైర్‌ ఎన్టీఆర్‌ మీదకు విసురుతాడు సత్యం. గాల్లోనే సైకిల్‌ టైర్‌ లో వేలు పెట్టి సుదర్శన చక్రం లా గిర్రున తిప్పి రివర్స్‌ విసురుతాడు ఎన్టీఆర్‌. దగ్గర్లో పాత ఇనప సామాన్లు ఏమీ లేకపోవటంతో సత్యం దూకుడుగా ముందుకొచ్చి ఎన్టీఆర్‌ మెడ పట్టుకుంటాడు. ఎన్టీఆర్‌ కూడా సత్యనారాయణ మెడ పట్టుకుంటాడు.

ఇద్దరూ గట్టిగా పట్టు బిగిస్తూ గిరగిరా తిరుగుతూ మేడ మెట్ల మీదనుంచి ఒకళ్ళమీద ఒకళ్ళు పడి కిందమెట్టు దాకా దొర్లుతారు. కిందకు రాగానే ఎన్టీఆర్‌ సత్యనారాయణ ముఖం మీద ఎడమవైపు పిడిగుద్దు గుద్దుతాడు. సత్యనారాయణ అబ్బా అంటూ కుడివైపు తిరుగుతాడు. కుడివైపు కూడా ఓ గుద్దు గుద్దుతాడు ఎన్టీఆర్‌. అబ్బా అంటూ ముఖం పైకెత్తుతాడు సత్యనారాయణ. ముఖం మీద ఫ్రంట్‌ సైడ్‌ ఆపకుండా పిడిగుద్దులు గుద్దుతాడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ పిడిగుద్దులకు ముఖం పచ్చడై సత్యనారాయణ ‘‘నన్నొదిలేయ్‌ రా బాబూ.. శ్రేదేవి ఆ గదిలో ఉంది.. తోలుకుపో..’’అని పక్కగది వైపు చెయ్యి చూపిస్తాడు. ఎన్టీఆర్‌ చేతులు దులుపుకుంటూ లేచి పక్కగది తలుపులు బద్దలుకొట్టి లోపలికెళ్లి శ్రీదేవి కట్లు విప్పి ‘ ‘ఘాట్టిగా’ కౌగిలించుకుంటాడు. శ్రీదేవి ఊపిరాడక గిలగిలలాడుతుంది.

కట్‌ చేస్తే ఊటీలో ‘ ఆకు చాటు పిందె తడిసె ‘ సాంగ్‌ మొదలౌతుంది. ఇదంతా ఎందుకంటే అప్పట్లో ఫైట్లు భలే ఉండేవిలే.. ఇప్పట్లా ఒక హీరో ఒకేసారి వందమంది రౌడీలను ఒకొక్కడిని లైన్లో ఛావబాదటాలు...చిన్న స్క్రు డ్రైవర్‌ తో ఒక్కో రౌడీ వీపు మీద ..మెడ మీద.. పిర్ర మీద పొ డు చు కుంటూ వెళ్ళటాలు లేవు ! ఫైటింగులు హీరో విలన్‌ ఇద్దరి మధ్య ఫేస్‌ టు ఫేస్‌ ఉండేవి !

కాంతారావు కత్తులు గిరగిరా తిప్పి ఫైటింగులు చేసినా.. నరసింహారాజు కర్రసాము చేసినా..ఎన్టీఆరు.. కైకాల దొర్లుకుంటూ కొట్టుకున్నా భలే కిక్కు ఉండేది !

ఏమైనా నాటి సినిమాల్లో ఆ ఫైటింగులు భలే థ్రిల్‌ ఇచ్చేవి కదా !!

ఫైటింగ్‌ ఇమేజ్‌ అడిగితే ఏఐ ఇలా అల్లు అర్జున్ను దింపింది.. అదీ సంగతి

- పరేష్‌ తుర్లపాటి!!

నాగిని ఫోజులతో కసిగా కవ్విస్తున్న ఫరియా అబ్దుల్లా!!

ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల బుల్లెట్‌ అంటే హీరోలే గుర్తొస్తారు. కానీ హీరోయిన్‌ లలోనూ ఆరడుగుల బుల్లెట్‌ ఉంటారని ఫరియా అబ్దుల్లాని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఫరియా అబ్దుల్లా తన హైట్‌ తో ఎంతోమందిని ఆకట్టుకుంది.. ప్రభాస్‌ లాంటి కటౌట్‌, హైట్‌ తో ఉండే ఫరియా అబ్దుల్లా తన రియల్‌ నేమ్‌ కంటే ఎక్కువగా చిట్టి అనే పేరుతోనే ఫేమస్‌ అయింది. అనుదీప్‌ డైరెక్షన్లో వచ్చిన ‘జాతి రత్నాలు’ మూవీలో నవీన్‌ పోలిశెట్టి ఫరియా అబ్దుల్లా లు నటించారు.ఈ సినిమాలో చిట్టి అనే పాత్రతో ఫరియా అబ్దుల్లా చాలా ఫేమస్‌ అయ్యింది. ఆ తర్వాత రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ బంగార్రాజు మూవీలో స్పెషల్‌ సాంగ్‌ కూడా చేసింది.

అంతేకాకుండా మత్తు వదలరా-2 సినిమాతోపాటు ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఎద అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా కొబ్బరిచెట్టు చాటున ఉన్న ఫోటోలను షేర్‌ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ ఫోటోలలో చాలా హాట్‌గా యూత్‌ కి చెమటలు పట్టించేలా తన ఎద అందాలను హైలెట్‌ చేసింది.. గ్రీన్‌ కలర్‌ మినీ స్కర్ట్‌ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. కొబ్బరి చెట్టు వెనుక ఉన్న కొన్ని హాట్‌ ఫొటోస్‌ని కూడా షేర్‌ చేసింది. అందులో ఫరియా అబ్దుల్లా ఎద అందాలతో పాటు థైస్‌ అందాలు కూడా హైలెట్‌గా నిలిచాయి.

ఈ గ్రీన్‌ కలర్‌ మినీ స్కర్ట్‌లో ఉన్న ఫోటోలను షేర్‌ చేయడమే కాకుండా కింద క్యాప్షన్‌గా ‘‘గురువారం రోజు మీకు కొన్ని నాగిని వైబ్స్‌ పంపిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్‌లో వైరల్‌గా మారడంతో చిట్టి భలే క్యూట్‌గా ఉందే అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ ఫొటోస్‌ చూసిన ఆమె అభిమానులు.. ఫరియా అబ్దుల్లా గురించి చూసుకుంటే.. హీరోయిన్‌ కాకపోతే నేను కొరియోగ్రాఫర్‌ని అయ్యేదాన్ని అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అలా తనకి హీరోయిన్‌ అవ్వడం కంటే కొరియోగ్రాఫర్‌ అవ్వడం ఇష్టమని, ఒకవేళ లేడీ కొరియోగ్రాఫర్‌గా అవకాశం వస్తే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి దిగ్గజ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తాను.. అంటూ చెప్పుకొచ్చింది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page