ఫ్రెండ్ షిప్ లేదు .. ఉన్నది అవసరం మాత్రమే!
- NVS PRASAD

- 5 hours ago
- 3 min read


యుద్ధం అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతుంది.. కానీ అసలు నిజం ఏంటంటే.. ఈ యుద్ధం అమెరికా, చైనా మధ్యే జరుగుతుంది. చైనాని ఓడించడానికి ఇరాన్‌ని ఒక పావుగా వాడుకుంటోంది అమెరికా. ఎందుకు?! చైనా ఒక ఫ్యాక్టరీ.. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ.. రోజూ కొన్ని కోట్ల వస్తువులు తయారు చేస్తుంది. సో ఆ ఫ్యాక్టరీ నడవాలంటే ఒకే ఒకటి కావాలి.. అదే ఆయిల్. అది కొద్ది మొత్తంలో కాదు.. ఒక రోజు రెండు రోజులు కాదు... చాలా అంటే చాలా కావాలి.. ప్రతిరోజు ఆగకుండా కావాలి. చైనా దగ్గర తన సొంత ఆయిల్ చాలా తక్కువ. అది మరో దేశం నుంచి దిగుమతి చేసుకోవాలి.
ఇప్పుడు ప్రపంచంలో అత్యంత చౌకగా, పుష్కలంగా ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది? మిడిల్ ఈస్ట్‌లోని ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలో దొరుకుతుంది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. మిడిల్ ఈస్ట్ అనే ఒక ప్రాంతంలో అమెరికా పోలీస్ ఉంది. యుఎస్ నేవీ, మిలిటరీ బేస్‌లు ఆ ప్రాంతంలో ఉన్నాయి. యుఎస్ మిత్రులైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, యూఏఈ అందరూ ఆ మిడిల్ ఈస్ట్‌లోనే ఉన్నారు. సో ఇప్పుడు చైనా ఆయిల్ కొనాలంటే అమెరికన్ పర్మిషన్‌తో అమెరికన్ రూల్స్ ఫాలో చేసి తీసుకోవాలి. ఇది చైనాకి మహా చిరాగ్గా ఉంది. ఇప్పుడు చైనా తనకు తానే ఒక సింపుల్ క్వశ్చన్ వేసుకుంది. అమెరికా పోలీస్‌ని బైపాస్ చేసి మిడిల్ ఈస్ట్‌లో తనకంటూ ఒక సొంత ఫ్రెండ్ ఉంటే... కాలగమనంలో ఆ ఫ్రెండే ఇరాన్ రూపంలో దొరికేసాడు. ఇక్కడ చైనాకి ఇరాన్ ఎందుకు అంత యూజ్‌ఫుల్ అంటే.. ఇరాన్ అనేది మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకి పెద్ద శత్రువు. అమెరికా ఇరాన్ మీద సుంఖాలు విధించింది. ఏకాకిని చేసింది. దాని ఎకానమీ చంపేసింది. అంటే ఇరాన్ దగ్గర ఎవరైనా కొనాలన్నా, అమ్మాలన్నా వెస్ట్రన్ కంట్రీస్ భయపడతాయి. దాంతో ఇరాన్ దగ్గర బయర్స్ లేరు, మనీ లేదు, టెక్నాలజీ లేదు, సరిగ్గా ఇక్కడే చైనా ఎంట్రీ ఇచ్చింది. చైనా ఇరాన్‌కి చెప్పింది నువ్వు నాకు ఆయిల్ అమ్ము, నేను డాలర్స్‌తో కాకుండా చైనీస్ యున్‌తో కొంటాను. దాంతో వెస్ట్రన్ సుంఖాలు అఫెక్ట్ అవ్వవు అని చెప్పింది. పైగా నీకు నేను టెక్నాలజీ కూడా ఇస్తాను. మన ఈ బేరం అమెరికాకు కనపడదు అని చెప్పింది. ఇరాన్ కి వేరే దారి లేదు. చైనాకి చీప్ గా ఆయిల్ కావాలి. సో డీల్ డన్ కానీ ఇది కేవలం ఆయిల్ డీల్ మాత్రమే కాదు ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. చైనాకి ఇరాన్ ఒక్కటే సరిపోదు. దానికి ఒక పెద్ద మొత్తంలో నెట్వర్క్ కావాలి. చైనా దీర్ఘంగా ఆలోచించింది. ఇరాన్ ఆయిల్ మాత్రమే కాదు మిడిల్ ఈస్ట్ అంతా తాను చెప్పినట్టు తలలూపాలి. ఆ ప్రాంతంలో పట్టు కావాలి. అది ఉంటేనే అమెరికాని ఛాలెంజ్ చేయగలనని అనుకుంది. దీనికోసం చైనా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసింది. దాన్నే రీజనల్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే చైనా ప్రాంతంలో నిర్మించిన కనిపించని పవర్ స్ట్రక్చర్. ఇది కనపడదు కానీ రియల్‌గా ఉన్న ఒక నెట్వర్క్. దీన్ని ఇప్పుడు నాలుగు రకాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది స్ట్రైట్ ఆఫ్ హర్మూస్ అంటే ఇదొక ప్రాంతం ప్రపంచ ఆయిల్లో చాలా భాగం ఇక్కడి నుంచే వెళ్తుంది. ఈ ప్రాంతం ఒక డోర్ లాంటిది. ఇరాన్ నుంచి డైరెక్ట్‌గా చైనాకి ఆయిల్ రావాలంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూస్ గుండా వెళ్లాలి. ఈ ప్రాంతం దగ్గర ఇరాన్ ఉంది. ఇరాన్ ఫ్రెండ్లీగా ఉంటే ఆ వాటర్ రూట్ సేఫ్. ఫ్రెండ్లీగా లేకపోతే చైనా ఆయిల్ సప్లైకి డైరెక్ట్ త్రెట్. ఇక రెండవది ఇరాన్ చుట్టూ ఉన్న ఇరాన్ కంట్రోల్ చేసే ప్రాక్సీ గ్రూప్స్. వీళ్లని తీవ్రవాదులు అనొచ్చు. అంటే లెబనాన్లో హెజ్బుల్లా, యమెన్లో హౌతీస్, ఇరాక్‌లో షియా మిలిషస్.. వీళ్లందరూ ఇరాన్ మనీ, వెపన్స్, ట్రైనింగ్‌తో నడుస్తారు. వీళ్లు మిడిల్ ఈస్ట్‌లో అమెరికన్ బేసెస్‌ని, ఇజ్రాయెల్‌లోని యుఎస్ ఫ్రెండ్స్‌ని డిస్టర్బ్ చేయగలరు. దాంతో ఇరాన్‌ని గుప్పెట్లో పెట్టుకుంటే చైనా డైరెక్ట్‌గా అమెరికాపై యుద్ధం చేయకుండా ఇరాన్ చేత చేయించగలదు. అలాగే అమెరికా మిడిల్ ఈస్ట్‌లో బిజీగా ఉంటే చైనా మీద అటెన్షన్ తక్కువగా ఉంటుంది. ఇది చాలా తెలివైన ఐడియా. ఇక మూడోది.. సర్వేలెన్స్ టెక్నాలజీ ఎక్స్‌పోర్ట్. చైనాలో ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ముస్లిమ్స్ ఉన్నారు. వారిని యోగర్స్ అంటారు. వీళ్ల మూలం టర్కిష్‌లో ఉంది. వీళ్లు ఎప్పటి నుంచో చైనాలో బతుకుతున్నారు. వీళ్లని 24 గంటలూ ట్రాక్ చేయడానికి కెమెరాస్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఇంటర్నెట్ కంట్రోల్ సిస్టం బిల్డ్ చేసింది. చైనా ఈ సిస్టంలో ప్రపంచంలోనే చాలా అడ్వాన్స్‌గా ఉంది. అదే టెక్నాలజీని చైనా ఇరాన్‌కు అమ్మింది.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఇరాన్ ఎందుకు కొన్నాది? ఎందుకంటే.. ఇరాన్‌లో తరచు నిరసనలు జరుగుతాయి. ఎక్కువగా విమెన్ రైట్స్ కోసం గవర్నమెంట్‌ని పడగొట్టడం కోసం ప్రతిపక్షం చేసే నిరసనలు ఎక్కువగా ఉంటాయి. దాంతో గవర్నమెంట్‌కి భయం ఉంటుంది. నిరసనలు పెద్దగా జరిగితే పాలన కుప్పకూలుతుంది. అందుకే ఇరాన్ గవర్నమెంట్ ఇంటర్నెట్ మానిటర్ చేస్తారు. సోషల్ మీడియా బ్లాక్ చేస్తారు ప్రొటెస్ట్ లీడర్స్‌ని ట్రాక్ చేస్తారు. ఈ పనులన్నింటికీ సర్వైలెన్స్ సిస్టం ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఇరాన్ గవర్నమెంట్ ఇరాన్ పీపుల్‌ని కంట్రోల్ చేయడానికి చైనీస్ టెక్నాలజీ వాడుతుందన్నమాట.
దీన్నిబట్టి ఇరాన్ చైనా కంట్రోల్‌లో ఉంది. 2026 జనవరి నిరసనలలో ఇరాన్ ఇంటర్నెట్ షట్‌డౌన్ చేసింది. అది పాసిబుల్ కావడానికి కారణం.. చైనా నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే. ఇక చిట్టచివరిది డిప్లమాటిక్ షీల్డ్. ఇరాన్ ఎప్పుడైనా తప్పు చేస్తే చైనా యునైటెడ్ నేషన్స్‌లో బ్లాక్ చేస్తుంది. సుంఖాలు పెట్టడానికి రష్యాతో కలిసి వీటో వేస్తుంది. ఇక్కడ ఇరాన్‌కి ఒక పవర్‌ఫుల్ బాడీగార్డ్ దొరికింది. అలాగే చైనాకి ఒక లాయల్ మిడిల్ ఈస్ట్‌లో భాగస్వామి దొరికింది. ఈ నాలుగు కలిపితే అంటే ఆయిల్ రూట్ ప్రాక్సీ డిస్ట్రాక్షన్ సర్వైలెన్స్ ఎక్స్‌పోర్ట్ అండ్ డిప్లమాటిక్ కవర్ ఇదే.
చైనా నిర్మించిన ఆర్కిటెక్చర్ అంటే ఇది ఒక్క ఇరాన్‌తో మొదలై మెల్లగా సిరియాకి.. లెబనాన్‌కి.. యెమెన్‌కి.. ఇరాక్‌కి విస్తరించింది. చైనా డైరెక్ట్‌గా అమెరికా మాదిరిగా ఏ దేశంలోనూ తన దళాలు పెట్టలేదు. కానీ ఇరాన్‌ని సెంటర్‌గా పెట్టుకొని మిడిల్ ఈస్ట్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ సంపాదించింది. ఇప్పుడు ప్రెజెంట్‌కి వస్తే.. 2025లో ఇజ్రాయిల్ ఇరాన్ న్యూక్లియర్ బేస్‌ని నాశనం చేసింది. 2026లో యుఎస్ ఇజ్రాయిల్ కలిసి ఖమేనీతో సహా సీనియర్ లీడర్షిప్‌ని చంపేశారు. దీని పర్యవసానాలు ఏంటంటే.. హెజ్బుల్లాకి సొమ్ములు అందడం ఆగింది. హౌతీస్‌కి వెపన్స్ రావడం ఆగింది. చైనాకి ఆయిల్ రూట్ అస్తిరమైంది. మెయిన్‌గా చైనా నిర్మించిన ఎంటైర్ నెట్వర్క్‌కి క్రాక్ వచ్చింది. ఒక్క ఇరాన్ పడిపోయేసరికి చైనా దశాబ్దాల దూరదృష్టి దశాబ్దాల ఇన్వెస్ట్మెంట్ అంతా నాశనం అయింది. ఇది అసలు కథ. సో దీన్ని బట్టి పవర్ నగ్నసత్యం ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. ప్రపంచంలో ఫ్రెండ్ షిప్ అనేదే లేదు.. ఉన్నది ఒకటే అదే అవసరం. రెండు దేశాలు దగ్గర అవుతున్నాయి అంటే అర్థం వాళ్ళు ఒకరికొకరు ఉపయోగపడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారని అర్థం. ఆ అవసరం తీరిపోయే రోజులు వస్తే ఫ్రెండ్షిప్ కూడా కట్ అవుతుంది. అది దేశాల మధ్య అయినా మనుషుల మధ్య అయినా.






Comments