top of page

బుజ్జి కన్నా అంటూ బుట్టలో వేస్తున్నారా?

  • Guest Writer
  • May 5
  • 3 min read

ree

‘లవ్‌ టుడే’తో టాలీవుడ్‌ కి పరిచయమైన యంగ్‌ బ్యూటీ ఇవానా గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమాతోనే అమ్మడు యువత అటెన్షన్‌ డ్రా చేసింది. యూత్‌ పుల్‌ లవ్‌ స్టోరీ తో కుర్ర కారులో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. వైవిథ్యమైన హవభావాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా అమ్మడు ‘సింగిల్‌’ అనే సినిమాతో తెలుగులోనూ లాంచ్‌ అవుతుంది. ఇందులో శ్రీవిష్ణుకు జోడీగా నటించింది. తొలి సినిమానే ప్రతిష్టాత్మక గీతా ఆర్స్ట్‌లో అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. అలాగే తెలుగుకుర్రాళ్లు తనని ఎలా పిలుస్తారో కూడా గుర్తు చేసుకుంది. ‘హైదరాబాద్‌కి ఎప్పుడొచ్చినా ఇక్కడ ఆడియన్స్‌ అంతా బుజ్జి, కన్నా అంటూ పిలుస్తున్నారు. బహుశా లవ్‌ టుడేలో నేను పోషించిన పాత్ర ప్రభావం అనుకుంటా. అలా పిలవడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. తొలి సినిమాతోనే నన్ను గుర్తు పెట్టుకుని అలా పిలిచారంటే నన్నెంత అభిమానిస్తున్నారు? అన్నది అర్దమవుతుంది.

‘సింగిల్‌’ సెట్‌లో వీలైనంతవరకూ తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నించా. భాష పూర్తిగా నేర్చుకోవాలి. తెలుగు చాలా అందమైన భాష’ అంటోంది. నటిగా ఇవానా కెరీర్‌ మాలీవుడ్‌లో మొదలైంది. ‘మాస్టర్స్‌’ సినిమాతో నటిగా ప్రయాణం మొదలుపెట్టింది. అటుపై మాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకుంది. అనంతరం అమ్మడు కోలీవుడ్‌కి ప్రమోట్‌ అయింది. కోలీవుడ్‌లో రెండు సినిమాల తర్వాత ‘‘లవ్‌ టుడే’’లో నటించింది. ఈ సినిమా మంచి విజయంసాధించడంతో తమిళ్‌తోపాటు తెలుగులోనూ గుర్తింపు దక్కింది. ఆ మధ్య రిలీజ్‌ అయిన ‘‘డ్రాగన్‌’’లోనూ గెస్ట్‌ రోల్‌ పోషించింది. కనిపించింది కొన్ని నిమిషాలైనా ఇవానా రాకతో థియేటర్లు ఒక్కసారిగా మోతెక్కాయి. ‘‘లవ్‌ టుడే’’ కాంబినేషన్‌ మళ్లీ స్క్రీన్‌ పై కనిపించడంతోనే ఆ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

భారతీయ సినిమాలపై ట్రంప్‌ బండ !

ree

భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్‌ దూరం కాబోతోంది. ఇప్పటి వరకూ అక్కడ వచ్చిన షేర్‌లో కనీసం సగం నిర్మాత అకౌంట్లో పడేది. ఇక ముందు అందులో కూడా అత్యధిక మొత్తం అమెరికా ప్రభుత్వ అకౌంట్లో టాక్స్‌ రూపంలో పడబోతోంది. నిర్మాతకు అతి చిన్నమొత్తమే మిగలనుంది. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. కొందరు నిర్మాతలు హాలీవుడ్‌ని నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ట్రంప్‌ చెప్పారు.

ఇప్పటి వరకూ సినిమాలపై సుంకం స్వల్పం !

భారత సినిమాలపై అమెరికాలో ఇప్పటి వరకూ పెద్దగా పన్నులు లేవు. సాధారణంగా దిగుమతి సుంకాలు మాత్రమే వర్తిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఏడు శాతం వరకూ ఉండేది. అయితే ఇది సినిమాను ఎక్కడ నిర్మించారన్న దానితో సంబంధం లేని పన్ను. ఇప్పుడు ట్రంప్‌ ఇతర దేశాల సినిమాలకే కాదు.. అమెరికాలో చిత్రీకరించని హాలీవుడ్‌ సినిమాలపైనా ఈ పన్ను వేశారు. అంటే హాలీవుడ్‌ లో నిర్మాణం కాని సినిమాలకు పన్ను విధింపు ఉంటుంది. సాధారణగా ఇండియన్‌ సినిమాలు అమెరికాలో షూటింగ్‌ జరుపుకునేది చాలా తక్కువ.

భారత నిర్మాతలకు భారీ నష్టం

భారత్‌ నుంచి తెలుగు, హిందీ, తమిళ, మలయాళ సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్‌ ఉంది. స్టార్‌ హీరోల సినిమాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్‌ వస్తాయి. సినిమా బాగుంటే.. కలెక్షన్లు ఇండియాలో కంటే ఎక్కువగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఉన్న టాక్స్‌ స్ట్రక్చర్‌ ప్రకారం.. నిర్మాతలకు ప్రాఫిట్‌ ఉండేది. కానీ ఇప్పుడు వంద శాతం పన్ను అంటే.. అక్కడ రిలీజ్‌ ఖర్చులు కూడా రావేమోనన్న ఆందోళన ఉంటుంది. ఇది భారతీయ సినిమాకు గట్టి దెబ్బే అవుతుంది. ఇప్పటికే సమస్యల్లో ఉన్న సినిమాలు మరింతగా ఇబ్బందుల్లో పడతాయి.

హాలీవుడ్‌లో తగ్గిపోయిన సినిమాల నిర్మాణం

గత ఐదు సంవత్సరాల్లో అమెరికాలో సినిమాల నిర్మాణానికి కేంద్రం అయిన లాస్‌ ఎంజిల్స్‌ లోని హాలీవుడ్‌ లో కార్యకలాపాలు తగ్గిపోయాయి. సినీ నిర్మాణాలు దాదాపుగా నలభై శాతం వరకూ తగ్గిపోయాయని రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల కార్చిచ్చు కారణంగా చాలా వరకూ మౌలిక సదుపాయాలు కూడా కాలిపోయాయి. దీంతో పరిస్థితి మరింతగా దిగజారింది. చాలా మంది హాలీవుడ్‌ నిర్మాతలు అమెరికా బయట షూటింగ్‌ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. హాలీవుడ్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ ఉంటుంది కాబట్టి వారి సినిమా కథలకు తగ్గట్లుగా ఆయా దేశాల్లో చిత్రీకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇది ట్రంప్‌కు నచ్చడం లేదు.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

సుహాస్‌ సర్‌ప్రైజింగ్‌ లుక్‌

ree

తెలుగులో విభిన్న చిత్రాలు చేస్తున్న హీరో సుహాస్‌. చిన్న నిర్మాతలూ, కొత్త దర్శకులకు తను కేరాఫ్‌ అడ్రస్స్‌ అయ్యాడు. ఈసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టాడు. ‘మందాడి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదో స్పోర్ట్స్‌ డ్రామా. తమిళ నటుడు సూరి కీలక పాత్రధారి. తెలుగు నుంచి ఈ సినిమా కోసం సుహాస్‌ని తీసుకొన్నారు. ఈ సినిమాలో సుహాస్‌ లుక్‌ ఈ రోజు రివీల్‌ చేశారు. లుక్‌ పరంగా సుహాస్‌ ఆకట్టుకొన్నాడు. తనకు ఇదో కొత్త తరహా సినిమా అవ్వబోతోందన్న భరోసా ఈ పోస్టర్‌ తో కలుగుతోంది. సునామీ రైడర్స్‌ టీమ్‌ కెప్టెన్‌ గా సుహాస్‌ కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్‌ పాజిటీవ్‌నా, నెగిటీవ్‌నా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు దర్శక నిర్మాతలు. వెట్రిమారన్‌ ఈ చిత్రానికి ఒకానొక నిర్మాత. వెట్రిమారన్‌ మార్క్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలన్నీ ‘రా’ అండ్‌ ‘రస్టిక్‌’గా ఉంటాయి. ఈ సినిమా కథ కూడా అలాంటిదే అని టాక్‌. స్పోర్ట్స్‌ డ్రామాల్ని చాలా సజహంగా, ఎమోషనల్‌ డ్రైవ్‌ తో తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో.. అలాంటి సినిమానే ఇది అని చిత్రబృందం చెబుతోంది. టెక్నికల్‌ టీమ్‌ సపోర్ట్‌ కూడా ఈ సినిమాకు ఉంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎస్‌.ఆర్‌.కార్తీక్‌ కెమెరా వర్క్‌ అందించారు. మట్రిమారన్‌ పుకజ్‌హిందీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సుహాస్‌ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page