మతతత్వం పోయినట్లా.. పెరిగినట్లా?
- DV RAMANA

- 1 day ago
- 3 min read

తూర్పు భారతంలో వంగ దేశం(పశ్చిమ బెంగాల్)లో కొత్త పొద్దు పొడిచింది. కమలం వికసించింది. కాషాయ జెండా ఎగిరింది. వెరసి హిందూ అజెండా, సనాతన ధర్మం తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమÖల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి 200పైగా స్థానాల్లో విజయం కేతనం ఎగురువేసిన సంఫtT పరివార్‌కు చెందిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ప్రభుత్వంలో బెంగాల్ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ పార్టీని విజయపథంలో నిడిపించిన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో బెంగాల్లో హిందూత్వ శకం ఆరంభమైనట్లే. బెంగాల్‌కే చెందిన భారతీయ జనసంఫtT వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయం ఎట్టకేలకు ఆయన స్వరాష్ట్రంలో నెరవేరింది. శుక్రవారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ీVAంమంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించూ శ్యామప్రసాద్ ఆకాంక్షను నెరవేర్చగలిగినందుకు చాలా ఆనందంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడంతో ఆయన ఆత్మ శాంతిస్తుందని ఉవాచించారు. బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడం ద్వారా వందేళ్ల సైద్ధాంతిక ప్రయాణం కీలక మైలురాయిని చేరుకుందని అభివర్ణించారు. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను పరాయి భావజాలాల నుంచి విముక్తి చేసి రామకృష్ణ పరమహంస, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు కలలుగన్న ‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) నిర్మాణానికి ఈ విజయం బాటలు వేస్తుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ‘ఎక్కడైతే మనసు భయం లేకుండా ఉంటుందో.. ఎక్కడైతే తల గర్వంతో నిటారుగా ఉంటుందో.. అటువంటి బెంగాల్ వైపు అడుగులు పడుతున్నాయి’ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఆయన ప్రస్తావించారు. అమిత్ షా మాటలను చాలామంది రాజకీయ కోణంలో చూడవచ్చు.. కానీ చరిత్ర పుటలను తిరగేసి పరిశీలిస్తే ఆయన మాటల్లో కొన్ని కఠిన వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేశంగా గుర్తింపు పొందిన భారతదేశంలో కీలక రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్లో హిందూత్వ అజెండా కలిగిన పార్టీ పాలనలోకి వెళ్లడం వందల ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం నమ్మశక్యం కాని వాస్తవం. 800 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బెంగాల్‌లో సనాతన ధర్మ జెండా ఎగిరింది. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే క్రీ.శ. 1204లో భక్తియార్ ఖిల్జీ బెంగాల్‌పై దాడి చేశాడు. అప్పట్లో లక్ష్మణ్‌సేన్ బెంగాల్ రాజుగా ఉండేవారు. ఖిల్జీ అతన్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అనంతరం 1204`1576 మధ్య బెంగాల్ తురుష్కులు, ఆఫ్ఘన్ల క్రూరమైన పాలనలో మగ్గిపోయింది. 1576`1757 మధ్య మొఘలులు బెంగాల్‌తో పాటు మొత్తం భారతదేశాన్ని దోచుకున్నారు. భారతీయులపై అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. అతి విలువైన, అరుదైన వనరులను తరలించుకుపోయారు. అప్పుడే మహమ్మదీయం దేశంలో విస్తరించింది. కాగా 1757 నుంచి 1947 వరకు బెంగాల్‌తో సహా దేశమంతా ఆంగ్లేయుల చేతుల్లోకి వెళ్లింది. బ్రిటిష్ పాలకులు బెంగాల్‌లో దారుణమైన అరాచకాలు , అకృత్యాలకు పాల్పడ్డారు. వారి కాలంలో క్రైస్తవ పాలన కొనసాగింది. మొఘలులు, మహమ్మదీయులు, బ్రిటిషర్ల పాలన, దోపిడీకి దేశమంతా బలైంది కదా.. అనుకోవచ్చు. అది నిజమే కానీ.. బానిస సంకెళ్లు తొలగిపోయి దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న తర్వాత కూడా పశ్చిమ బెంగాల్‌లో హిందుత్వకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదనే చెప్పాలి. ఎందుకంటే.. స్వాతంత్య్రానంతరం 1947 నుంచి నిన్నటి ఎన్నికల వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు, ప్రభుత్వాలు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, మైనార్టీవర్గ పరిరక్షణ పేరుతో మత సమానత్వం స్థానంలో ముస్లిం మైనార్టీల పట్ల కాస్త ఎక్కువ సమానత్వం, ఉదారత ప్రదర్శిస్తూ వచ్చారు. 1947 నుంచి 1977 వరకు మÖడు దశాబ్దాలపాటు కాంగ్రెస్, మధ్యలో 1967లో స్వల్పకాలంపాటు బంగ్లా కాంగ్రెస్, 1977 నుంచి 2011 వరకు సుమారు మÖడున్నర దశాబ్దాల పాటు కమÖ్యనిస్టులు, అనంతరం 2011 నుంచి 2026 ఏప్రిల్ వరకు తృణమÖల్ కాంగ్రెస్ పార్టీలు బెంగాల్ రాష్ట్రాన్ని పాలించాయి. ఈ పార్టీలన్నీ లౌకికవాదం, మైనారిటీ హక్కుల రక్షణ పేరుతో ఆ వర్గ ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ఫలితంగా స్వతహాగా హిందూ రాష్ట్రమైన బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు, రొహింగ్యాల చొరబాట్లు పెరిగిపోయి, వారి జనాబా అంతకంతకూ పెరిగిపోయింది. ఎట్టకేలకు హిందూత్వ అజెండాను మోస్తున్న బీజేపీ ప్రభుత్వపగ్గాలు చేపట్టడంతో ఒక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడుతుందని అంటున్నారు. అందుకే దీన్ని ‘నాగరికత యుద్ధం’గా ఆరఎసఎస్ అభివర్ణిస్తున్నది. ఇప్పటికైనా ఈ అధికార మార్పు జరగకపోయి ఉంటే బెంగాల్ శరవేగంగా మరో బంగ్లాదేశ్ మారేదని పలువురు విశ్లేషకులు కూడా చెబుతున్నారు. పదిహేనేళ్ల తన పాలనలో తృణమÖల్ అధినేత్రి మమతా బెనర్జీ బెంగాల్ ప్రజలపై ప్రయోగించిన మూడు ప్రముఖ నినాదాలు కూడా మైనారిటీ వర్గీయులపై ప్రేమను చాటేవిగానే ఉన్న విషయాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. వరుసగా మÖడు ఎన్నికల్లో అప్రతిహత విజయాలు సాధించిన ఆమె మూడు నినాదాలను ప్రముఖంగా ప్రచారం చేశారు. వాటిలో ఒకటి ‘మా మాటి మానుష’.. మాతృమÖర్తి, మట్టి, మనుషులు అని అర్థం. రెండోది ‘జై బంగ్లా’, మూడోది ‘ఖేలా హోబే’.. ఆట మొదలైంది అని అర్థం. ఈ మూడు నినాదాలు బంగ్లాదేశ్ నుంచి కాపీ కొట్టినవే. ‘జై బంగ్లా’ అనేది 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఇచ్చిన నినాదం. ‘మా మాటి మానుష’ అనేది 1991 బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత్రి బేగం ఖలీదా జియా వాడిన నినాదం. ఇక ‘ఖేలా హోబే’ అనేది 2013లో బంగ్లాదేశ్ అవామీ లీగ్ నేత షమీమ్ ఉస్మాన్ ఇచ్చిన నినాదం. ఇప్పుడైనా సర్వమత సమానత్వం సాధిస్తారేమో చూడాలి.






Comments