top of page

మన సూపర్‌స్టార్‌కు..ఎలా మిస్సైంది..?

  • Guest Writer
  • Sep 9, 2025
  • 2 min read

జెమినీవాసన్‌.. ఈ పేరు తమిళ్‌నాడులో ఏస్‌ ప్రొడ్యూసర్‌ అనవచ్చు. ఆయనకు అక్కడ ఎంత పెద్దపేరు అంటే అక్కడ ఒక నానుడి ఉండేది సినిమా హిట్టయితే వాసన్‌ ప్లాఫ్‌ అయితే ఉపవాసన్‌ అని. అలాంటి నిర్మాత దగ్గరికి బాగా చదువుకున్న ఒక 20ఏళ్ల కుర్రాడు వెళ్లి ఒక కథ వినిపించి తనకు దర్శకుడిగా అవకాశం ఇమ్మని అడిగాడు. ఆ కుర్రాడు ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీధర్‌. తను చిత్రరంగానికి పరిచయం చేసిన స్టార్స్‌లో జయలలిత, కాంచన, రవిచంద్రన్‌ లాంటివాళ్ళు ఉన్నారు. మన సూపర్‌స్టార్‌ కృష్ణ తన మొదటి సినిమా అవకాశాన్ని కొంచెంలో మిస్‌ అయ్యారు.

శ్రీధర్‌ దర్శకత్వంలో విడుదలైన తొలికలర్‌ చిత్రం కాధలిక నేరమిల్లి. అది తమిళ్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచింది. ఆ సినిమాతోనే రవిచంద్రన్‌ హీరోగా తెరంగేట్రం చేశాడు. సిల్వర్‌ జూబ్లీ హీరో అని చెప్పుకునేస్థాయిలో ఎన్నో సిల్వర్‌ జూబ్లీ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. అదేవిధంగా పలు కలర్‌ చిత్రాల్లో నటించారు. అప్పట్లో కలర్‌ ఫిలిమ్స్‌లో నటించడం అంటే చాలా పెద్ద విషయం. ఈ రవిచంద్రన్‌ మలేసియ తమిళియన్‌.

కాధలిక నేరమిల్లి చిత్రంలో రవిచంద్రన్‌తోపాటు హీరోగా నటించేందుకు ఇద్దరు నటులు పోటీ పడ్డారు. వారిలో ఒకరు తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య తండ్రి శివకుమార్‌. శ్రీధర్‌ తన ఎత్తును సాకుగా చూపి అవకాశం ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ సినిమాలో హీరోగా నటించేందుకు పోటీపడిన మరో నటుడు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కృష్ణ.

తమిళంతో కాస్త ఇబ్బంది పడటంతో ఆ అవకాశం రవిచంద్రన్‌కి దక్కింది. లేకుంటే ఆ సినిమాలో కృష్ణ హీరోగా నటించి ఉండేవాడు. ఆ అవకాశాన్ని కృష్ణ మిస్‌ చేసుకున్నారట. లేకపోతే కృష్ణ సౌత్‌ ఇండియా స్టార్‌ అయ్యేవాడేమో ??. చిత్రంగా నాన్‌, అతే కనగల్‌ లాంటి తమిళ్‌ చిత్రాల్లో రవిచంద్రన్‌ యాక్ట్‌ చేస్తే నేనేంటే నేనే, అవేకళ్ళు లాంటి తెలుగు చిత్రాల్లో తెలుగులో కృష్ణ చేశాడు.

ఆ కాధలిక్క నేరమిళ్ళై చిత్రాన్ని తెలుగులో తీస్తే రవిచంద్రన్‌ పోషించిన ఆ పాత్రను అక్కినేని పోషించాడు. అక్కినేని లాంటి పెద్ద హీరో ఉన్నాసరే ఈ చిత్రాన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోనే తీశారు. పెద్ద మ్యూజికల్‌ హిట్‌ అయ్యింది. పాటలన్నీ తమిళ బాణినే అనుసరించారు.అన్నట్టు ఈ సినిమా దర్శకుడు శ్రీధర్‌ రెడ్డి తమిళ్‌ నాడులో స్థిరపడ్డ తెలుగు మూలాలున్నవాడు.

- బాతాఖానీ.కామ్‌ సౌజన్యంతో...

చైనా వాల్‌ దాటిన ‘మిరాయ్‌’ పాప

చూస్తుండగానే చైనా వాల్‌ దాటేయబోతోంది ఈ కొత్తమ్మాయ్‌. ‘మిరాయ్‌’ సినిమాతో పాన్‌ ఇండియాస్టార్‌గా దేశాలన్నీ చుట్టేయబోతోంది. ముంబైలో ఒక్క ఛాన్స్‌ అంటూ అవకాశాల కోసం వెతికిన ఈ మోడల్‌ కం నటి, ఉన్నట్టుండి తేజ సజ్జా సినిమాతో వరల్డ్‌ ఫేమస్‌ కాబోతోంది. కొత్తమ్మాయ్‌ అయినా కానీ తనవైన వన్నె చిన్నెలు, గ్లామరస్‌ లుక్‌ తో మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఏ నోట విన్నా ఈ అమ్మడి లక్‌ గురించే గుసగుస. పేరు రితిక నాయక్‌. ఢల్లీిలోని ఒడియా కుటుంబంలో జన్మించిన ఈ ప్రతిభావని టాలీవుడ్‌ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. 2019లో ఢల్లీి టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ యొక్క 12వ సీజన్‌ను గెలుచుకున్న తర్వాత వినోద పరిశ్రమలో బిగ్‌ డ్రీమ్స్‌ ని నెరవేర్చుకోవడానికి ప్రయాణం ప్రారంభించింది. కాలేజ్‌ డేస్‌ నుంచే నటన అంటే ఈ భామకు ఆసక్తి.

ఆరంభం, అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)తో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో వసుధగా తనదైన అద్భుత నటనతో యువతరాన్ని ఆకట్టుకుంది. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి విద్యాసాగర్‌ చింత దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాలో రితిక నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత రవితేజ ఈగిల్‌ లో కీలక పాత్ర పోషించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు ‘మిరాయ్‌’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులరైపోతోంది. హనుమాన్‌ చిత్రంతో తేజ సజ్జా పాన్‌ ఇండియా స్టార్‌ గా గుర్తింపు తెచ్చుకోవడంతో ఇప్పుడు ఇది ఈ భామకు కూడా కలిసొస్తోంది. మిరాయ్‌ కథ, విజువలైజేషన్‌ పాన్‌ ఇండియా అప్పీల్‌ తో అలరించడంతో మార్కెట్లో ఈ మూవీపై బోలెడంత బజ్‌ పెరిగింది. ఇక ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొడితే, తేజ సజ్జాతో పాటు రితిక నాయక్‌ దశ తిరిగిపోతుందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి కొత్తమ్మాయే అయినా, సినిమా రిలీజ్‌ తర్వాత అమాంతం తన రేంజ్‌ మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక రితిక ఇప్పటికే మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ సినిమాలోను అవకాశం అందుకుంది. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రారంభమైంది. చూస్తుండగానే మిరాయ్‌ పాప చైనా వాల్‌ దాటేస్తోంది.. దేవీశ్రీ పాడిన పాటలోని ఒక అద్భుతమైన సింగిల్‌ లైనర్‌ వర్ణనలా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page