top of page

యుద్ధం.. ఇక్కడో అందమైన జ్ఞాపకం!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 1 hour ago
  • 2 min read


(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

యుద్ధం రాగానే రాజకీయ నాయకులు తుపాకులిస్తారు...

ధనవంతులు డబ్బు ఇస్తారు..

పేదవారు వారి పిల్లల్ని ఇస్తారు..

యుద్ధం ముగియగానే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నిర్మించుకుంటారు.. ధనవంతులు వ్యాపారాన్ని నిర్మించుకుంటారు..

పేదలు సమాధులు నిర్మించుకుంటారు..

యుద్ధం కేవలం ఒక రాజకీయ ప్రయోజనం.. కొందరికి లాభం..

యుద్ధం ఎక్కడైనా కన్నీటినే మిగులుస్తుంది. కానీ ఇక్కడ అదో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.2.30 కోట్లతో పునర్నిర్మించిన కార్గిల్ విక్టరీ పార్క్ కేవలం ఒక ఆహ్లాద వాతావరణానికి చిహ్నం మాత్రమే కాదు.. యుద్ధం మిగిల్చిన గాయాన్ని మర్చిపోయి, దానికోసం మన జిల్లా యుద్ధవీరులు చేసిన త్యాగానికి గుర్తుగా మిగిలిపోనున్న ఓ అందమైన జ్ఞాపకం. కేవలం స్థానికులు సేద తీరడానికి ఒక పార్క్ కావాలన్న ఉద్దేశంతో కాకుండా యుద్ధవీరుల త్యాగాన్ని గుర్తుచేసుకునే రీతిలో రూపొందిన కార్గిల్ విక్టరీ పార్క్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. పాకిస్తాన్ మీద విజయం సాధించడానికి ఎత్తైన కార్గిల్ కొండపైకి ఎగబాగి మన సైనికులు ఎంత యుద్ధం చేశారో, ఆ పేరుతో ఏర్పాటు చేసిన పునరుద్ధరించాలని కాలనీ ప్రజలు కూడా దాదాపు అటువంటి యుద్ధమే చేశారు. అయితే ఈ పాలకులు మాత్రం సామాన్యుడు సమాధులు నిర్మించుకోవడంలోనే మిగిలిపోకూడదని విక్టరీ పార్క్ కోసం శక్తివంచన లేకుండా కషి చేసి పూర్తి చేశారు. ఇందులో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దగ్గర్నుంచి ఎమ్మెల్యే గొండు శంకర్ వరకు, కలెక్టర్ దినకర్ పుండ్కర్ నుంచి సుడా ఈఈ సుగుణాకర్ వరకు అందరూ యుద్ధవీరులే. దాని ఫలితమే అత్యంత సుందరంగా తయారైన కార్గిల్ విక్టరీ పార్క్. ఇది పార్క్ మాత్రమే కాదు.. అంతకు మించి. ఇదే నగరం నడిబొడ్డులో ఉంటే సిక్కోలు అందాన్ని పదింతలు రెట్టింపు చేసివుండేది. అయినా ఇది యుద్ధ విజయానికి సంకేతం కాబట్టి ఎక్కడున్నా దాని గొప్ప దానిదే. 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్ప్పుడు మన జిల్లా నుంచి పోలాకికి చెందిన సుబేదార్ చింతాడ మోహనరావు ఇందులో వీరమరణం పొందారు. ఆ తర్వాత ఈయనకు ప్రభుత్వం మెడల్ ఇచ్చివుండొచ్చు. కానీ సొంత జిల్లాలో ఆ వీరుడి బలిదానానికి ఇంతకు మించిన ట్రిబ్యూట్ ఉండకపోవచ్చు. అలాగే పాలకొండకు చెందిన హవాల్దార్ చిన్ని సింహాచలం, పలాసకు చెందిన మరో హవాల్దార్ టొంప నీలాచలం ఇద్దరూ ఈ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇప్ప్పుడు కార్గిల్ పార్క్‌లో మన విజయబావుటా ఎగరేస్తున్న శిల్పంలో తామున్నామని వీరిద్దరికీ తెలిస్తే అంతకు మించిన పతకం అవసరం లేదేమో! ఒకరు కాదు, ఇద్దరు కాదు.. 58 మంది సైనికులు వివిధ హÃదాల్లో ఈ జిల్లా నుంచి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. తదనంతర కాలంలో వారంతా పదవీ విరమణ చేశారు. వీరందరూ ఈతరం వారికి కార్గిల్ యుద్ధం కోసం చెబితే అది ఎప్ప్పుడు జరిగిందని అడిగితే తప్ప్పులేదు.. కానీ అందులో మీరున్నారా? అని అడిగితేనే పాపం. అటువంటి వీరుల పోరాటానికి గుర్తుగా కార్గిల్ విక్టరీ పార్క్ పునర్నిర్మించారు. ఇక్కడ ఏమి ఉన్నాయి, ఏమి లేవు అనే చర్చ లోకి వెళ్లనవసరం లేదు. ఎందుకంటే.. ఆ పని ఇప్పటికే సోషల్ మీడియా మొదలుపెట్టింది. ఇంతకు ముందు అనేక పత్రికలూ రాశాయి. ఇంతటి చరిత్ర ఉన్న కార్గిల్ విక్టరీ పార్క్‌ను పునర్నిర్మించాలని ప్రతిపాదనలు వస్తే, పొంతన లేని పనులతో భ్రష్టుపట్టించేశారు. లక్షలాది రూపాయలు తినేశారు. చివరకు కలెక్టర్ దినకర్ పుండ్కర్ కల్పించుకొని నిధులు మంజూరు చేయడంతో పాటు ఇటువంటి వ్యవహారాల్లో దిట్టగా పేరొందిన సుడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుగుణాకర్‌కు ఈ పనులు అప్పగించడంతో కార్గిల్ పార్క్ ఇప్ప్పుడొక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అంతకు మించి నగరవాసులకు అందమైన అనుభవాన్ని మిగిల్చనుంది. ఇది ఎన్నికల హామీలా కనిపించొచ్చు. అదే నిజమైతే స్థానికులు నడవడానికి ఒక వాకింగ్ ట్రాక్ ఇస్తే సరిపోతుంది. దీనికి తోడు ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. బాక్స్ క్రికెట్ ఉంది. పికిల్‌బాల్ ఉంది. ఓపెన్ వైకుంఠపాళీ ఉంది. యోగా సెంటర్ ఉంది. ఇండోర్‌లో చిన్న లైబ్రరీ ఉంది. వీటన్నింటి మధ్యలో కార్గిల్ వీరుడు ఈ దేశ జెండాను ఎగరేస్తున్న ధైర్యం ఉంది. ఇక్కడ గార్డెనింగ్‌తో పాటు పార్క్‌లా కనిపిస్తున్న మొక్కలు సైతం దిగుమతి చేసుకున్నవే. ఇంత తక్కువ ఖర్చులో అంత పెద్ద జ్ఞాపకాన్ని మిగల్చాలంటే రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం ఒకే కలగనాలి. ఆ కల నిజం చేసుకోవాలి. ఇప్ప్పుడు అదే జరుగుతోంది. రూ.2.30 కోట్లతో అత్యంత సుందరంగా ఈ పార్క్‌ను నిర్మిస్తే, ఇందులో సగానికి పైగా సొమ్ములు గతంలో కేవలం తవ్వడానికి, మట్టికే మున్సిపాలిటీ తినేసిందంటే నమ్మగలమా? కనీసం ఆ పనులు ఎం.బుక్‌లో రికార్డయ్యాయో, లేవో కూడా తెలియదు. అందుకే ఎమ్మెల్యే గొండు శంకర్ దీన్ని సుడా చేపట్టాలని కోరారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని చెప్పారు. వీటన్నిటి సమాహారమే ఇప్ప్పుడు కార్గిల్ విక్టరీ 26 ఏళ్ల తర్వాత సగర్వంగా మనకు గుర్తుకొస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page