top of page

యుద్ధం ఓ సాకు.. సామాన్యుడికి ధరల షాక్!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 7 hours ago
  • 3 min read
  • దేనికీ కొరత లేదంటూనే నియంత్రలో విఫలం

  • ఇప్పటికీ నిద్రావస్థలోనే ప్రభుత్వ నిఘా వ్యవస్థలు

  • వంట నూనెలు, పప్పుదినుసుల రేట్లకు రెక్కలు

  • దేశీయ సరుకుల ధరలను కూడా పెంచేసిన వైనం

  • గ్యాస్ అందక చితికిపోతున్న హోటల్ వ్యాపారం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ధరలు పెరగకుండా నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడంలేదు. 20 రోజుల యుద్ధానికే దేశంలో గొడౌన్లన్నీ ఖాళీ అయిపోయాయంటే నమ్మలేం. అలా అని ప్రభుత్వం ఎక్కడైనా కోల్డ్ స్టోరేజీలపై దాడులు నిర్వహించి, సరుకుల్ని రిలీజ్ చేయిస్తుందా అంటే అదీ లేదు. గ్యాస్ బుక్ చేసిన 15 రోజుల్లో అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రెండు రోజుల్లోనే అందుతుందని కేంద్ర ప్రభుత్వం రెండు పొంతనలేని మాటలు చెబుతున్నా, యుద్ధం మొదలైన తర్వాత నుంచి గ్యాస్ సిలెండర్ల కొరత తీరలేదు. పోనీ ఎల్‌పీజీ అంటే పశ్చిమాసియా నుంచి రావాలి. మరి చుట్టుపక్కల నుంచి వచ్చే పప్ప్పులు, ఉప్ప్పుల రేట్లెందుకు పెంచారో అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి సిలిండర్ ధర మాత్రమే పెరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు యథాతధంగానే ఉన్నాయి. అంటే.. రవాణా ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. అటువంటప్ప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉన్న గొడౌన్ల నుంచి తెచ్చే నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరిగాయి? దీనిపై సమీక్షించాల్సిన యంత్రాంగం ఇంకా ప్రపంచమంతా ఇదే ప్రభావంతో ఉందని చెబుతున్నది. జిల్లా స్థాయిలో సివిల్ సప్లై విభాగాలు, విజిలెన్స్ యంత్రాంగం.. ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేసే యంత్రాంగం మనకుంది. దేశంలో వంటనూనె ఎంత స్టాకు ఉందో తెలియపర్చకుండానే అక్కడ క్షిపణి పడగానే.. ఇక్కడ నూనెల రేట్లు పెంచేశారు. వాస్తవానికి శుద్ధి చేయని వంట నూనెలు దిగుమతి చేసుకుంటే.. దానిపై దిగుమతి సుంకాన్ని బడ్జెట్‌కు ముందే కేంద్రం పెంచింది. అప్ప్పుడే ముందస్తు జాగ్రత్తగా కంపెనీలన్నీ ఆయిల్ నిల్వలు పెంచుకున్నాయి. అంతలోనే యుద్ధం రావడంతో వాటి ధరలు పెంచేశారు. ఎందుకు? సాధారణంగా ప్రతి ఆయిల్ కంపెనీకి జిల్లాకు ఐదుగురు చొప్ప్పున డీలర్లు ఉన్నారు. మొన్నటి వరకు ఆఫర్ ఉందంటూ విపరీతంగా డంప్ చేసుకున్న ఆయిల్ ప్యాకెట్లు ఉండగానే ఇప్ప్పుడు ధరలు పెంచేశారు. ఏమంటే యుద్ధం అంటున్నారు. దీనికి ప్రత్నామ్నాయంగా వేరుశనగ పలుకులు తీసుకొని గానుగ పట్టించి వాడేస్తారన్న ఆందోళనతో పల్లీల రేట్లు కూడా పెంచేశారు. వాస్తవానికి శనగపలుకులు ఎక్కడినుంచో దిగుమతి చేసుకోనవసరం లేదు. దేశంలో ఇది ప్రధాన పంట కూడా. అటువంటిది దీని ధర ఎందుకు పెరిగిందో ఏ అధికారీ అడగడు. పల్లీ పెరిగింది కాబట్టి కందిపప్ప్పును పెంచారు. కందిపప్ప్పును తక్కువ చేయకూడదని పెసరపప్ప్పును పెంచారు. ఇలా ఒకదానితో ఒకటి పోటీపడి మరీ నిత్యావసర సరుకు ధరలు పెరిగిపోయాయి. వాస్తవానికి ఆయిల్ రేటు పెరిగినప్ప్పుడు రవాణా ఖర్చులు పెరుగుతాయి. అప్పుడే నిత్యావసరాల ధరలు పెరగాలి. యుద్ధం మరికొన్నాళ్లు కొనసాగితే కచ్చితంగా ధరల్లో మార్పులు వస్తాయి. అయితే ఈలోగానే సరుకును బ్లాక్ చేసి ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని అరికట్టేందుకు ఇంతవరకు ఎక్కడా సోదాలు జరిగినట్లు కనిపించడంలేదు.

తగ్గాల్సిన పరిస్థితుల్లో పెరగడమా?

యుద్ధం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతుంటే.. అదే యుద్ధం ధనవంతులకు వరంగా మారింది. దేనిలో పెట్టుబడులు పెడదామా? అని ఆలోచించే ఒక వర్గానికి బంగారం, వెండి ధరలు తగ్గడం ఇప్ప్పుడు పెద్ద రిలీఫ్. గత కొంత కాలంగా అటు స్టాక్‌మార్కెట్, ఇటు రియల్ ఎస్టేట్ భూమ్ లేకపోవడంతో ఉన్న సొమ్ముతో పిల్లలు పెట్టించలేక ఇబ్బంది పడిన సంపన్నులు మూడురోజులుగా ఎగబడి బంగారం, వెండి కొంటున్నారు. వీరికి నిత్యావసర ధరలు పెరిగినా పెద్దగా పోయేదేమీ ఉండదు. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులైన ప్లాస్టిక్, రబ్బర్ ట్యూబుల ధరలు కూడా పెరిగాయి. వాస్తవానికి దీనికి యుద్ధం కారణం కాదు.. కేవలం అది సాకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల పరిశ్రమ పెద్దది. ఇందులో ఎక్స్‌పోర్ట్ చేసేవే ఎక్కువ. ఇప్ప్పుడు యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయినా కూడా మార్కెట్‌లో రొయ్యల ధర తగ్గలేదు. అంటే.. వెనుక ఏదో సిండికేట్ బలంగా పని చేస్తున్నదని అర్థం. ఒకసారి చవగ్గా ఇస్తే యుద్ధం ముగిసిన తర్వాత కూడా అదే ధరకు బేరమాడతారన్న భయం కాబోలు. కోల్డ్ స్టోరేజీలకు ఇబ్బడిముబ్బడిగా సబ్సిడీలు ఇవ్వడంతో బహుశా అక్కడ నిల్వ చేసి పడేస్తున్నారేమో?! ఇంత సంక్షోభంలోనూ సామాన్యునికి ఊరటేమిటంటే.. ఆమధ్య కొండెక్కిన కోడిగుడ్డు ధర ఇప్ప్పుడు తగ్గింది. నిత్యావసర వస్తువులను మనం ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఇప్ప్పుడది ఆగిపోవడం వల్ల గొడౌన్లలో స్టాకు మిగిలిపోయి రేట్లు తగ్గాలి. కానీ ఎందుకు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు ఆలోచించడంలేదు. గ్యాస్ బండ కోసం ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా సమస్య అలానే ఉంది. ఒక్కో గ్యాస్ ఏజెన్సీలో ఉన్న కనెక్షన్లలో సగానికి సరిపడా మాత్రమే కంపెనీలు సరఫరా చేస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు. మిగిలిన కోటాను సర్దుబాటు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. కాగా గ్యాస్ సరఫరా పరిస్థితిని రెగ్యులర్‌గా సమీక్షించాల్సిన బాధ్యత జిల్లా పౌరసరఫరా అధికారి(డీఎస్‌వో)ది. కానీ రెగ్యులర్‌గా కాదు కదా.. కనీసం ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా మన జిల్లా డీఎస్వీ తన బాధ్యతను నిర్వర్తిస్తున్న జాడలేదు. జిల్లాకు ఎంత స్టాకు వస్తున్నది.. ఎన్ని బుకింగ్స్ అవుతున్నాయి.. ఎంతమందికి ఎన్నిరోజుల వ్యవధిలో సిలిండర్ సరఫరా చేస్తున్నారన్న వివరాలను ఏరోజుకారోజు తెప్పించుకుని పరిశీలించినా వ్యవస్థ గాడి తప్పకుండా ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో అక్కడి జాయింట్ కలెక్టర్ విద్యాధరి అదే పని చేస్తున్నారు. స్వయంగా ఆమే నగరంలోని గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి రికార్డులు పరిశీలించి.. ఆరా తీస్తున్నారు. కానీ దురదృష్టం కొద్దీ శ్రీకాకుళం జిల్లాలో ఆ పరిస్థితి లేకుండాపోయింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page