వారిపైనే ఖర్చుల భారం.. అవినీతికి ఆస్కారం!
- BAGADI NARAYANARAO

- 4 days ago
- 3 min read
జిల్లాలో కార్యక్రమాలన్నింటికీ హాస్టళ్ల నుంచే వసూళ్లు
ఆ ఖర్చులతోపాటు సొంతానికి వార్డెన్ల చిలక్కొట్టుడు
ఉప్పందించి ఏసీబీని ఉసిగొల్పింది ఉపేంద్రుడే
మిగతా వార్డెన్లను వదిలి ఏబీసీడబ్ల్యూవోపైనే కేసు

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
ఇటీవల రధసప్తమి ఉత్సవాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ఇచ్చిన జ్ఞాపికలను కలెక్టర్ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ సమకూర్చింది. దీనికోసం వార్డెన్లు తమ పరిధిలోని వసతి గహాల్లో విద్యార్ధుల సంఖ్యను బట్టి తలా రూ.5 లెక్కగట్టి జిల్లా అధికారి చేతిలో పెట్టారు.
రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యుడు కాంతారావు జిల్లా పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ పేరుతో బీసీ సంక్షేమశాఖ పరిధిలోని వసతి గహాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్ధుల సంఖ్యను బట్టి తలా రూ.5 చొప్పున వార్డెన్ల నుంచి వసూలు చేశారు.
సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని బీసీ సంక్షేమశాఖ ద్వారా నిర్వహించడానికి కూడా హాస్టల్ వార్డెన్లు ఇదే రీతిలో చెల్లించారు. దానికి ముందు వాల్మీకి జయంతి, జ్యోతీరావు పూలే జయంతి కార్యక్రమాలకు సైతం ఇలాగే వసూలు చేశారు. ఇక నెలవారీ డైట్ బిల్లులు జమ అయిన తర్వాత ఇవ్వాల్సిన కమీషన్లు ఉండనే ఉంటాయి.
..ఇలా చెప్పుకొంటూ పోతే సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న వసూళ్ల పర్వమే భారతమంత అవుతుంది. చీటికీమాటికీ వార్డెన్లపై పడి ఖర్చులు చేయిస్తుండటమే అవినీతికి పాల్పడేలా వారిని ప్రోత్సహిస్తోంది. ఈ ఖర్చులు రాబట్టుకోవడానికి, పనిలో పనిగా తమ జేబులు నింపుకోవడానికి వారు హాస్టళ్లకు ప్రభుత్వం అందించే మెనూ, ఇతర నిర్వహణ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇవన్నీ కలిసి పేద విద్యార్థుల పొట్ట కొడుతున్నాయి.
అంతా ఆయనే చేశాడు

కంచిలిలో ఏసీబీ దాడుల నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏబీసీడబ్య్లూవో బాలముకుందరావును కంచిలిలోని అతని కార్యాలయంలోనే పట్టుకోవడం వెనుక రాజపురం ప్రీమెట్రిక్ బాలుర హాస్టల్‌ను డిప్యూటేషన్‌పైన, ఎంఎస్ పల్లి హాస్టల్‌ను ఇన్‌ఛార్జిగా పర్యవేక్షిస్తున్న వార్డెన్ ఉపేంద్ర పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే ఏసీబీ అధికారులు దాడి చేసినట్లు తెలిసింది. సోంపేట ఏబీసీడబ్ల్యూ వో పరిధిలోని వార్డెన్లందరితో సమావేశం నిర్వహించేలా ఆయనే ప్లాన్ చేసి బాలముకుందరావును పట్టించినట్టు సమాచారం. ఏసీబీ అధికారులు కంచిలి చేరుకున్నారని సమాచారం అందిన వెంటనే నెలనెలా ఇవ్వాల్సిన కమీషన్‌ను ఆయా వార్డెన్ల ద్వారానే నగదు రూపంలో ప్యాకెట్లలో పెట్టించి, వాటన్నింటినీ ఒక బ్యాగులో సర్ది ఏబీసీడబ్ల్యూవో కార్యాలయంలో పెట్టించేసి ఉపేంద్ర బయటకు వచ్చేసినట్లు తెలిసింది. ఆ వెంటనే ఏసీబీ అధికారులు ఉపేంద్రతో మాట్లాడి కార్యాలయంలోకి ప్రవేశించి నగదు స్వాధీనం చేసుకున్నారు. కమీషన్లు ఇచ్చిన వార్డెన్లను విడిచిపెట్టి ఏబీసీడబ్ల్యూవో బాలముకుందరావునే ఏసీబీ నిందితుడిగా చూపడం గమనార్హం. వసూలయ్యే కమీషన్లలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టుకున్న చీటీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు దాని ఆధారంగా జిల్లా అధికారిపైనా కేసు నమోదు చేయాలి. కానీ అలా చేయకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్టులు చేస్తామని చెప్పడం విశేషం.
పత్తిత్తు కాదు
ఈ వ్యవహారంలో వార్డెన్ పాత్రపైనే అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉపేంద్రను గత ఏడాది రణస్థలం కాలేజీ వసతి గహానికి బదిలీ చేశారు. అప్పటి వరకు పలాస కాలేజీ వసతి గహానికి వార్డెన్‌గా, రాజపురం, ఎంఎస్ పల్లి హాస్టళ్లకు ఇన్‌ఛార్జీగా ఆయన వ్యవహరించారు. ఆరేళ్లకు పైగా ఒకేచోట విధులు నిర్వహించిన ఆయన రణస్థలానికి బదిలీ అయిన రెండు రోజుల్లోనే మళ్లీ రాజపురం ప్రీమెట్రిక్ హాస్టల్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. ఇది చాలదన్నట్లు అదనంగా ఎంఎస్‌పల్లి హాస్టల్ ఇన్‌ఛార్జి బాధ్యతలు కూడా కట్టబెట్టారు. వాస్తవంగా పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ వార్డెన్లను ప్రీమెట్రిక్ హాస్టల్స్‌కు డిప్యూట్ చేయడం సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకం. అయినప్పటికీ ఉపేంద్రకు అనుకూలంగా జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వద్ధులైన తన తల్లిదండ్రుల సంరక్షణ తానే చూడాల్సి ఉన్నందున డిప్యూటేషన్‌పై పంపాలని ఉపేంద క్రలెక్టర్‌కు పెట్టుకున్న దరఖాస్తును దీనికి కారణంగా చూపించారు. వాస్తవానికి ఉపేంద్ర తండ్రి 20 ఏళ్ల క్రితమే మతి చెందగా తల్లి కరోనా సమయంలో మత్యువాత పడ్డారు. అయినా వీరిద్దరూ సజీవంగా ఉన్నారని తప్ప్పుడు ధ్రువపత్రాలు సష్టించి జిల్లా బీసీ సంక్షేమ అధికారిణితో కుమ్మక్కైన ఉపేంద్ర కలెక్టర్‌ను తప్ప్పుదోవ పట్టించి డిప్యూటేషన్ వేయించుకున్నారÁT. ఉపేంద్రకు రాజపురం, ఎంఎస్‌పల్లి హాస్టళ్ల బాధ్యతలు అప్పగించడం వెనుక జిల్లా అధికారిణి సొంత ప్రయోజనాలు కూడా కారణమన్న చర్చ జరుగుతోంది. ఆమె స్వగ్రామం కంచిలి మండలం బొరివంక. ప్రతి వారం, సెలవు రోజుల్లో అక్కడికే వెళ్లి కుటుంuంతో గడుపుతుంటారు. ఆ కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు, సరుకులు ఉపేంద్రే సమకూరుస్తుంటారని తెలిసింది. అందువల్లే ఆయనకు రాజపురం, ఎంఎస్‌పల్లి హాస్టల్ బాధ్యతలను అప్పగించారు. ఈ రెండు వసతి గహాల్లో విద్యార్ధుల సంఖ్య అధికారిక రికార్డుల్లో 350కు పైగా ఉంటుంది. హాజరయ్యేవారి సంఖ్య పదుల్లోనే ఉంటుంది. తద్వారా ప్రభుత్వ నిధులను బొక్కేస్తున్న ఉపేంద్ర ఆ రెండు హాస్టళ్లు తన చేతిలోనే ఉండేలా మేనేజ్ చేసుకుంటున్నారు.
రెగ్యులర్ తనిఖీలు శూన్యం
డైట్ బిల్లులు జమ అయిన వెంటనే ఎవరు ఎంత ఇవ్వాలన్నది లెక్కలు వేసి కమీషన్లు వసూలు చేస్తుంటారు. ఈ తంతు ప్రతి నెల జరుగుతుంది. శ్రీకాకుళం, రణస్థలంలలో ఏబీసీడబ్ల్యూవోకు సంబంధం లేకుండా వార్డెన్లే కలెక్షన్ చేసి వాటాలు పంచుతారు. నరసన్నపేట, టెక్కలి, సోంపేట డివిజన్లలో ఏబీసీడబ్ల్యూవోలు నెలవారీ కమీషన్లు వసూలు చేసి జిల్లా అధికారికి వాటాలు ఇస్తారు. గతంలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి హాస్టళ్ల రికార్డులు పరిశీలించేవారు. హాజరు పట్టీల ప్రకారం విద్యార్ధులు ఉన్నారా లేరా అని ఆరా తీసేవారు. మౌలిక సౌకర్యాలు, వెనూ అమలుపై విద్యార్ధులతో మాట్లాడి తెలుసుకునేవారు. వార్డెన్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటున్నదీ లేనిదీ పరిశీలించేవారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో ఉన్నతాధికారులకు నివేదిక అందించేవారు. ఆ ప్రకారం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకొనేవారు. అయితే గత పదేళ్లుగా హాస్టళ్లలో తనిఖీల ఊసే లేదు. దీనికి సిబ్బంది కొరత నే కారణంగా చూపిస్తున్నారు. దీనివల్లే బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గహాలు అక్రమాలకు ఆవాసాలుగా మారిపోయాయి.










Comments